విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా చావా. శివాజి మహారాజ్ తనయుడు శంబాజీ మహారాజ్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే భారీ అంచనాలు ఏర్పడగా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.
ముఖ్యంగా సినిమాలో విక్కీ కౌశల్ నటనకు బీ టౌన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. చావా చూస్తున్న నార్త్ ఆడియన్స్ ఉద్యేగానికి లోనవుతున్నారు. విక్కీ కౌశల్ నటన లక్ష్మణ్ ఉటేకర్ టేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలిచేలా చేశాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి.
చావా సినిమాకు రోజు రోజుకి పాజిటివ్ టాక్ పెరుగుతుండగా అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సినిమా చూసి థియేటర్ లో ఎమోషనల్ అవుతున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చావా సినిమా చూసి ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. చావా సినిమాలో రష్మిక మందన్న కూడా నటించిన విషయం తెలిసిందే.
చరిత్రను సినిమాగా తీసే టైంలో ఒక్కోసారి అంచనాలను అందుకోకపోతే రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చావా సినిమా రిలీజ్ ముందు వరకు మేకర్స్ కూడా టెన్షన్ పడ్డారు. చావా చూసిన ప్రేక్షకులు శంబాజీ కథను ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు అన్న విధంగా స్పందిస్తున్నారు.