బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ” సైఫ్ పై దాడి గురించి విని షాక్ అయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
మరోవైపు సైఫ్ పై దాడి ఘటన గురించి ఆయన టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం జరిగిందని.. ఈ ఘటనలో ఆయన గాయాల పాలయ్యారని వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు లీలావతి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని తెలిపింది. ఈ ఘటనపై మీడియాతో పాటు ఆయన అభిమానులు కూడా సంయమనం పాటించాలని కోరింది. ఇది పోలీస్ కేసుకి సంబంధించిన విషయమని, దీనిపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తామని చెప్పింది.
Shocked and saddened to hear about the attack on Saif sir.
Wishing and praying for his speedy recovery and good health.
— Jr NTR (@tarak9999) January 16, 2025