PawanKalyan: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అట.! ‘పవన్ కళ్యాణ్ గో బ్యాక్’ అంటూ ఆ మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో ఓ ప్లకార్డు పట్టుకుని, మీడియా ముందర హడావిడి చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి కూడా.!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 8చోట్ల పోటీ చేస్తోంది. బీజేపీ – జనసేన కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, బీజేపీకి జనసేన మద్దతివ్వడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి తెలంగాణలో జనసేనని అధికార భారత్ రాష్ట్ర సమితి అంత సీరియస్‌గా తీసుకోవడంలేదు.
కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా జనసేన పార్టీని విమర్శించిన దాఖలాలు లేవు. ఏ కోణంలో చూసినా, జనసేన పార్టీని విమర్శించే పార్టీ తెలంగాణలో ఏదీ లేనట్టే. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీని పనిగట్టుకుని తూలనాడేది అక్కడి అధికార వైసీపీ మాత్రమే. ఆ వైసీపీనే, తెలంగాణలోనూ జనసేనకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో వైసీపీ జెండా ఎప్పుడో పీకేశారు. జగన్ స్థానంలో షర్మిల, కొత్త రాజకీయ కుంపటి పెట్టినా, ఆమె కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తన పార్టీని దూరంగా వుంచిన సంగతి తెలిసిందే. మరి, పవన్ కళ్యాణ్‌ని తెలంగాణలో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నదెవరు.? ఇంకెవరు వైసీపీనే.!
పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, ఆయన కారుకి అడ్డం పడ్డాడో ఉస్మానియా విద్యార్థి.! అతన్ని చూస్తే, విద్యార్థి అని ఎవరూ అనలేరనుకోండి.. అది వేరే సంగతి. పవన్ కళ్యాణ్ కారు బ్యానెట్ మీదకెక్కి, చెప్పులు విసిరేందుకు ప్రయత్నించి.. సదరు వ్యక్తి నానా యాగీ చేశాడు.
దాంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు అలాగే పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. కొందరు అతన్న చితక్కొట్టి ఆసుపత్రిలో చేర్చారు కూడా. డబ్బుకి కక్కుర్తి పడి, సదరు వ్యక్తి ఇదంతా చేశాడన్న చర్చ అంతటా జరుగుతోంది. అతనికి డబ్బుని ఎరగా వేసింది కూడా వైసీపీయేనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.