Switch to English

ఆత్మ నిర్భర్‌ భారత్‌ 4: దీన్ని ప్యాకేజీ అనగలమా.?

ఒకదాన్ని మించిన ప్రకటన ఇంకోటి వస్తోంది 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ ప్యాకేజీకి సంబంధించి. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశం విలవిల్లాడుతున్న వేళ, ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ.. అంటూ తీపి కబురు అందించారు దేశ ప్రజానీకానికి. కానీ, ఇది కేవలం లెక్కల మాయ.. అని తేలడానికి పెద్దగా సమయం పట్టలేదు. లాక్‌డౌన్‌ మొదలయ్యాక సుమారు లక్షన్నర కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం, దాన్ని ఈ ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’లో కలిపేయడంతోనే అందరికీ ఈ స్పెషల్‌ ప్యాకేజీలో ‘పస’ ఎంతో తెలిసిపోయింది.

అయినాగానీ, ఏదో చిన్న ఆశ.. తమ కోసం కేంద్రం ఏదో చేసేస్తుందని దేశ ప్రజానీకం ఎదురుచూశారు. మొదటి రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్‌, ప్యాకేజీపై వివరణ.. వెల్లడించిన అంశాలు అందర్నీ షాక్‌కి గురిచేశాయి. రెండో రోజూ అదే పరిస్థితి. మూడో రోజు కూడా సేమ్ టు సేమ్. నాలుగో రోజైతే మరీ ఆశ్చర్యం. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. అంతే కాదు, స్పేస్‌ రంగంలో కూడా ప్రైవేటు సంస్థల్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారామె.

ప్యాకేజీ అదిరిపోయింది కదూ.! విషయం ఇంకా వుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థని ప్రైవేటు పరం చేస్తున్నట్లూ నిర్మలమ్మ సెలవిచ్చారు. ఇది ఇంకా అద్భుతం మరి. అసలు, ప్యాకేజీ అంటే ఏంటి.? ప్రజలు ఆ ప్యాకేజీ నుంచి ఏం ఆశిస్తున్నారు.? అనే ఆలోచనే లేకుండా ఏకంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ తయారైనట్లు కన్పిస్తోంది. ఆయా రంగాలకు ప్రోత్సాహకాలంటారు.. ‘లోన్లు’ చుట్టూ మాట్లాడతారు.. దీన్ని ప్యాకేజీ అనుకోవాలంటే ఎలా.?

సగటు భారతీయుడు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయాడు. ‘ఈ పరిస్థితుల్లో నాకు కేంద్రం ఏమిస్తుంది.?’ అన్నది మాత్రమే సగటు భారతీయుడికి కావాలి. ‘సారీ, అక్కడ కేంద్రం ఇచ్చేదేమీ లేదు.. కావాలంటే అప్పులు ఇప్పిస్తుంది..’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. ఆ అప్పులు గ్రౌండ్‌ లెవల్‌లో ఎంత గొప్పగా సామన్యులకు దక్కుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తమ్మీద, నాలుగో ఆణిముత్యం.. అదేనండీ ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ నాలుగో అధ్యాయం మరీ దారుణంగా నిరాశపర్చింది. ఇంకెన్ని ఆణిముత్యాలు కేంద్రం నుంచి వెలువడనున్నాయో ఏమో.!

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: కాటికెళ్లే వయసులో బాలికపై అత్యాచారం.!

బాలికలపై అత్యాచారాలను అరికట్టాలని ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఇంకా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటువంటి ఓ దురాగతం సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పంచాయితీలోని కిష్టయ్యపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో కుటుంబంతో కలిసి...

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...

ప్రభాస్ 20 షూట్ ప్లాన్ అండ్ రిలీజ్ అప్డేట్

కరోనా మహమ్మారి ప్రపంచం మీద చేస్తున్న దండయాత్ర అందరినీ భయాందోళనలో పడేయడమే కాకుండా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయేలా చేసింది. అందులో భాగంగా సినిమా షూటింగ్స్, విడుదలలు కూడా ఆగిపోయాయి. మళ్ళీ ఎప్పుడు...

కేజీఎఫ్‌ విషయంలో అంత పట్టుదల ఎందుకు?

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రపంచంలో పలు దేశాలు లాక్‌ డౌన్‌ అమలు చేశాయి. ఇండియాలో రెండు నెలల పాటు లాక్‌ డౌన్‌ కొనసాగింది. ఇంకా కూడా లాక్‌ డౌన్‌లోనే ఇండియా ఉంది....

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ...