Switch to English

నాగ శౌర్య ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

నటీనటులు: నాగ శౌర్య, మెహ్రీన్ కౌర్,
నిర్మాత: ఉషా మలుపురి
దర్శకత్వం: రమణ తేజ
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల అండ్ జిబ్రాన్
ఎడిటర్‌: గ్యారీ బిహెచ్
రన్ టైం: 2 గంటల 39 నిముషాలు
విడుదల తేదీ: జనవరి 31, 2020

ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా కనిపించిన యంగ్ హీరో నాగ శౌర్య తన పంథా మార్చి యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఫుల్ రఫ్ అండ్ టఫ్ లుక్ లోకి మారి చేసిన సినిమా అశ్వథ్థామ. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఛలో’ సినిమా తర్వాత వరుసగా 3 ప్లాప్స్   అందుకున్న శౌర్య ఈ సారి పక్కా హిట్ కొట్టాలని తనే స్వయంగా కథ రాసుకొని చేసిన సినిమా అశ్వథ్థామ నాగ శౌర్య కోరుకుంటున్న హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం..

కథ:

నాగ శౌర్యకి తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అందులోనూ తన చెల్లెలు అంటే ప్రాణం. అంత ఇష్టమైన చెల్లెలి నిశితార్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కానీ పెళ్లి కాకముందే తనకే తెలియకుండా శౌర్య చెల్లెలు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అప్పటికీ అబార్షన్ చేయించినా తన చెల్లెలికి అలా అయ్యేలా చేసింది ఎవరు అనే మిస్టరీని ఛేదించడం శౌర్య మొదలు పెడతాడు. ఇక అక్కడి నుంచి తను వైజాగ్ లో జరుగుతున్న సేమ్ ఇన్సిడెంట్స్ మరియు పలువురు కిడ్నాప్స్ గురించి తెలుస్తుంది. ఇంతకీ అది ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? తనకి ఎదురైనా అవాంతరాలన్నిటినీ దాటుకొని శౌర్య ఆ రాక్షసుడిని పెట్టుకున్నాడా? లేదా? అనేదే కథ..

తెర మీద స్టార్స్..  

నాగ శౌర్య తన లవర్ బాయ్ ఇమేజ్ పోవాలి అని చేసిన ప్రయత్నం మాత్రం సక్సెస్ అయ్యిందని చెప్పాలి. తన రఫ్ అండ్ టాప్ లుక్, మాస్ పెర్ఫార్మన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో తను చూపిన ఎనర్జీ సూపర్బ్ అని చెప్పాలి. అలాగే ఎమోషనల్ ఎపిసోడ్స్ లో తన నటనతో సినిమాని అందరికీ కనెక్ట్ చేసాడు. మెహ్రీన్ కౌర్ కి పెద్ద రోల్ లేదు, కానీ ఉన్నంతలో ఓకే ఓకే అనిపించుకుంది.

ఇక మెయిన్ హైలైట్ గా చెప్పుకోవాల్సింది అంటే విలన్ రోల్ చేసిన జిష్షు సెంగుప్తా గురించి.. సెకండాఫ్ లో జిష్షు పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. తన నటన వల్లే సెకండాఫ్ లో ఆసక్తిగా సాగుతుంది. సెకండాఫ్ లో హీరో – విలన్ సీన్స్ లో ఇద్దరి నటన హైలైట్. హరీష్ ఉత్తమన్ కూడా తన డిఫరెంట్ రోల్లో బాగా చేసాడు. మిగిలిన సీరియల్ నటీనటులు తమ పాత్రల్లో ఓకే అనిపించారు.

తెర వెనుక టాలెంట్..

మొదటగా రచయితగా మారిన నాగ శౌర్య దగ్గరి నుంచి మొదలు పెడితే.. యాక్షన్ ఇమేజ్ కోసం తాను సెలక్ట్ చేసుకున్న జానర్ మరియు అనుకున్న లైన్ బాగుంది. కానీ కథగా రాసుకున్నప్పుడు కొన్ని సీన్స్ సూపర్బ్ అనిపిస్తే ఎక్కువ సీన్స్ లో ఇంకా ఎదో ఉండాలి ఎదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఉదాహరణకి యాక్షన్ ఈప్సిడోస్ సూపర్బ్ కానీ ఆ దానికి లీడ్ చేసే సీన్స్ లో పెద్ద కంటెంట్ లేకపోవడం వలన ఇంత రేంజ్ యాక్షన్ అవసరమా అనిపిస్తుంది. అలాగే కథని కంప్లీజ్ ఎమోషనల్ కనెక్షన్ తో తీసుకెళ్లలేకపోయారు. ఇక స్క్రీన్ ప్లే – దర్శకత్వ బాధ్యతలు చూసుకున్న రమణ తేజ ఫస్ట్ హాఫ్ లో పెద్దగా తన మార్క్ చూపలేదు కానీ సెకండాఫ్ లో కాస్త స్పీడ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ గా నటీనటుల నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో సూపర్బ్ అనిపించుకున్నాడు. కానీ ఓవరాల్ గా సినిమానై ఆడియన్స్ కి హుక్ చేయడంలో యావరేజ్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉంది.

ఇక ది బెస్ట్ అనిపించుకున్న డిపార్ట్ మెంట్స్ రెండు.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. స్పెషల్ గా ఛేజింగ్ సీక్వెన్స్ ని సూపర్బ్ గా తీసాడు. అలాగే అనల్ – అరసు యాక్షన్ ఎపిసోడ్స్ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ప్రతి ఫైట్ ని చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. ఎడిటర్ గ్యారీ ఉన్నంతలో స్పీడ్ గా కట్ చేయడానికే ట్రై చేశారు. కానీ ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కంటెంట్ లేకపోవడం వలన స్లో అనిపిస్తుంది, కానీ సెకండాఫ్ స్పీడ్ గా ఉండేలా చేశారు. శ్రీ చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే మరియు జిబాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కొన్ని చోట్ల సూపర్బ్ అనిపిస్తే కొన్ని చోట్ల ఎదో ఉందంటే ఉంది అన్నారు.

 
విజిల్ మోమెంట్స్: 

– నాగ శౌర్య మాస్ పెర్ఫార్మన్స్
– జిష్షు సేన్ గుప్తా సైకో నటన
– యాక్షన్ అండ్ ఛేజింగ్ ఎపిసోడ్స్
– ఇంటర్వల్ ఎపిసోడ్
– ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్

బోరింగ్ మోమెంట్స్:

– బోరింగ్ ఫస్ట్ హాఫ్
– స్పీడ్ బ్రేకర్స్ లాంటి సాంగ్స్
– నో ఎంటర్టైన్మెంట్
– ఎస్టాబ్లిష్ మెంట్ సీన్స్ సరిగా లేకపోవడం
– విలన్ మెయిన్ మోటోలో పెద్ద కిక్ లేదు
– హీరో – హీరోయిన్ ట్రాక్

విశ్లేషణ: 

లవర్ బాయ్ ఇమేజ్ వద్దు నాకు మాస్ కావాలి అని వాంటెడ్ గా నాగ శౌర్య చేసిన ‘అశ్వథ్థామ’ సినిమా తాను కోరుకున్న మాస్ హీరో ఇమేజ్ ని అయితే పక్కాగా ఇస్తుంది. అలాగే రైటర్ గా కూడా పరవాలేధనిపించుకుంటాడు. కానీ నాగ శౌర్య ఒక 100% మాస్ ఫిలింని డెలివరీ చేయడంలో 50% మాత్రమే సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా నాగ శౌర్య హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, జిష్షు సేన్ గుప్తా సైకో పెర్ఫార్మన్స్ వల్ల ‘అశ్వథ్థామ’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి బాగుందనిపిస్తుంది, కానీ మిగతా వారికి మాత్రం బేసిక్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషనల్ గా పెద్ద స్ట్రాంగ్ గా లేకపోవడం వలన బిలో యావరేజ్ అనిపిస్తుంది.

ఇంటర్వల్ మోమెంట్: ఇంటర్వల్ బ్లాక్ పర్లేదు, సెకండాఫ్ ఎలా ఉంటుందో..?

ఎండ్ మోమెంట్: డీసెంట్ థ్రిల్స్, యావరేజ్ బొమ్మ..

చూడాలా? వద్దా?: థ్రిల్లర్ జానర్ నచ్చే వారికి మాత్రమే..

బాక్స్ ఆఫీస్ రేంజ్:

సంక్రాంతి సీజన్ తర్వాత పెద్దగా సినిమాలేమీ లేకపోవడం ఈ సినిమాఓపెనింగ్స్ కి బాగానే హెల్ప్ అవుతుంది. కానీ ‘అశ్వథ్థామ’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేందు, అలాగే నాగ శౌర్య గత సినిమాల్లో లా రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఆశించినవారు కూడా నిరుత్సాహపడతారు కావున ఈ సినిమా ఏ సెంటర్స్ వరకూ బాగానే కలెక్షన్స్ రాబట్టుకున్న, మాస్ సెంటర్స్ లో మాత్రం వీకెండ్ తర్వాత పెద్దగా ఆడియన్స్ ని రాబట్టుకోలేదు.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 2.5/5

 

<<<<   నాగ శౌర్య “అశ్వద్ధామ” యూస్ఏ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్   >>>>

06:55 AM: సెకండాఫ్ రిపోర్ట్: ‘అశ్వథ్థామ’ సినిమా ఒక థ్రిల్లర్.. కథ పెద్దగా అనిపించకపోయినా థ్రిల్లర్ లో ఉండాల్సిన కొన్ని కొన్ని థ్రిల్స్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికీ ఓకే అనిపిస్తుంది.

06:50 AM: హై యాక్షన్ ఎపిసోడ్ తో విలన్ ని నాగ శౌర్య చంపేయడంతో సినిమా పూర్తయ్యింది..

06:42 AM: క్లైమాక్స్ లో విలన్ తాను ఎందుకు అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తున్నాడు అని రివీల్ చేసే సీన్ ని చాలా బాగా రాశారు. డైలాగ్స్ అండ్ విలన్ పెర్ఫార్మన్స్ సూపర్బ్..

06:35 AM: విలన్ నాగ శౌర్య ని తన ప్లేస్ కి రప్పించుకునే సీన్ ని చాలా బాగా రాశారు అండ్ తీసాడు కూడా.. ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తుంది ఈ సీన్.

06:30 AM: ఎవరు అనేది తెలియకుండా నాగ శౌర్య మెయిన్ విలన్ ని కలిసే సీన్ ని బాగా డిజైన్ చేశారు. అక్కడ ఇద్దరి పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.

06:25 AM:  మెయిన్ విలన్ ని ఒక డాక్టర్ కానీ తాను అమ్మాయిలపై చేస్తున్న రీసెర్చ్ గురించి రివీల్ చేయలేదు. కథ పెద్దగా రివీల్ కాలేదు కానీ స్క్రీన్ ప్లే కాస్త స్పీడ్ గా ఉండడం సినిమాకి ప్లస్.

06:18 AM: నాగ శౌర్య తనని ఛేజ్ చేస్తుండడంతో విలన్ మరింత వైల్డ్ గా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు.. పబ్లిక్ గా అమ్మాయిల శవాల్ని పడేస్తున్నాడు.

06:14 AM: మరో టాప్ బిజినెస్ మెన్ కుమార్తెతో కిడ్నాప్ తో కథ మళ్ళీ సీరియస్ మోడీ లోకి వెళ్ళింది.

06:10 AM: మెహ్రీన్ కి తన చెల్లికి ఏం జరిగింది, తాను ఎందుకు అలా వేట మొదలు పెట్టాడు అని చెప్పే ఎమోషనల్ సీన్ లో నాగ శౌర్య యాక్టింగ్ సూపర్బ్ గా ఉంది.

06:05 AM: మెయిన్ విలన్ పాత్రని చాలా డిఫరెంట్ అండ్ శాడిస్టిక్ వేలో డిజైన్ చేసారు. దాంతో సెకండాఫ్ లో రాను రాను ఆసక్తి పెరుగుతోంది.

05:57 AM: కథలో ఇప్పటి వరకూ చూపిన అన్ని అత్యాచారాలకు అసలైన రాక్షసుడు అలియాస్ విలన్ ని రివీల్ చేశారు. కానీ ఎందుకు చేస్తున్నాడు అనేది హీరో ఛేజ్ చేయాల్సి ఉంది.

05:52 AM: సెకండాఫ్ సినిమాలోని ముఖ్యమైన రెండు పాత్రల పరిచయం ద్వారా మొదలైంది. ఆ రెండు పాత్రలు అమ్మాయిలపై చేసే పనులను కొంతవరకూ చూపించారు.

05:45 AM: ఇంటర్వెల్ టైం: మొదటి 40 నిమిషాలు కథలోని పాత్రలను ఎస్టాబ్లిష్ మెంట్ కి సరిపోయింది. ఆ తర్వాత 20 నిమిషాలుఅసలైన మోడ్ లో సినిమా స్పీడ్ అందుకుంది. ఆసక్తికర ఇంటర్వల్ తో సెకండాఫ్ మీద ఆసక్తి పెంచింది.

05:35 AM: మెహ్రీన్ ఫ్రెండ్ కి కూడా సేమ్ టు సేమ్ జరగడంతో నాగ శౌర్య అంబులెన్సు ని ఛేజ్ చేసే సీన్స్ అదిరింది. స్పెషల్ గా యాక్షన్ సీన్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ ఉంది.

05:27 AM: 30 నిమిషాల సినిమాలో అందరికీ మిస్టరీలా అనిపించే ఒక చిన్న ట్విస్ట్ తప్ప మిగతా అంతా సో సోగా ఉంది.. నాగ శౌర్య పెర్ఫార్మన్స్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ సింప్లీ సూపర్బ్..

05:25 AM: కాలేజ్ డేస్ నుంచి తన సిస్టర్ ని ఇబ్బంది పెట్టినా, లైన్ వేసిన అందరి దగ్గరి నుంచి నాగ శౌర్య ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు.. మూవీ ఇప్పుడు స్పీడ్ అందుకుంది.

05:20 AM: తన చెల్లెలికి జరిగిన అన్యాయంపై నాగ శౌర్య అన్వేషణ మొదలు పెట్టాడు..

05:15 AM:నాగ శౌర్యకి వచ్చిన మొదటి మిస్టరీ ఇంకా సాల్వ్ కాలేదు.. ఇంతలో సిస్టర్ పెళ్లి టైం అండ్ పార్టీ సాంగ్ టైం. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా షూట్ చేశారు..

05:10 AM: నాగ శౌర్య చెల్లెలి పాత్ర ద్వారా కథలో ఫస్ట్ ట్విస్ట్.. సిస్టర్ కంగారు పడే సీన్స్ జరుగుతున్నాయి.

05:03 AM: నాగ శౌర్య కాలేజ్ డేస్ నుంచి లవర్ అయినా మెహ్రీన్ ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య – మెహ్రీన్ మధ్య ‘నిన్నే నిన్నే’ డ్యూయెట్ మెలోడీ సాంగ్ మొదలైంది..

04:59 AM: సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో నాగ శౌర్య ఎంట్రీ ఎయిర్ పోర్ట్ లో జరిగింది. నెక్స్ట్ తన సిస్టర్ ఎంగేజ్మెంట్ సీన్స్ జరుగుతున్నాయి.

04:55 AM: రౌడీస్ అమ్మాయిని కిడ్నాప్ చేసే సీన్ ని చాలా ఆసక్తికరంగా షూట్ చేశారు..

04:50 AM: చిన్నప్పటి పాత్రలో నాగ శౌర్య అశ్వథ్థామగా ఎంట్రీ జరిగింది అండ్ అప్పుడే తన బాధ్యతని పెంచే చెల్లాయి పుట్టింది.

04:45 AM: ‘గోపాల గోపాల’ సినిమాలోని పవన్ కళ్యాణ్ ఓవర్ తో ‘అశ్వథ్థామ’ మూవీ స్టార్ట్ అయ్యింది..

04:40 AM: రాక్షసుడి కోసం ‘అశ్వథ్థామ’ వేట మరికొద్ది సేపట్లో మొదలు కానుంది. నాగ శౌర్య ‘అశ్వథ్థామ’ సినిమా రన్ టైం – 134 నిముషాలు

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...
నటీనటులు: నాగ శౌర్య, మెహ్రీన్ కౌర్, నిర్మాత: ఉషా మలుపురి దర్శకత్వం: రమణ తేజ సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల అండ్ జిబ్రాన్ ఎడిటర్‌: గ్యారీ బిహెచ్ రన్ టైం: 2 గంటల 39 నిముషాలు విడుదల తేదీ: జనవరి 31, 2020 ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా కనిపించిన యంగ్ హీరో నాగ శౌర్య తన పంథా మార్చి యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఫుల్ రఫ్ అండ్ టఫ్ లుక్ లోకి మారి చేసిన సినిమా అశ్వథ్థామ....నాగ శౌర్య 'అశ్వథ్థామ' మూవీ రివ్యూ