Aswani Dutt: బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (Aswani Dutt) ప్రశంసల జల్లులు కురిపించారు. అమితాబ్ ను మించినవారు లేరంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD).. సినిమా ఈవెంట్ ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన సంఘటనను ప్రస్తావించారు అశ్వనీదత్.
‘కల్కి వేడుకలో జరిగిన సంఘటనకు నేను ఆశ్చర్యపోయా. నేను తేరుకుని అమితాబ్ పాదాలను తాకబోయా. ఊహించని.. మరచిపోని ఈ క్షణాలు జీవితంలో ఎంతో మధురమైనవి. వాటన్నంటినీ ముంబై ఈవెంట్ అందించింది. ఇండియన్ సినిమా లెజండ్ అమితాబ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. ఆయనకు నా సెల్యూట్’ అని అన్నారు.
అశ్వనీదత్ గురించి బాలీవుడ్ మీడియాకు అమితాబ్ వివరిస్తూ.. ‘అశ్వనీదత్ వంటి వినయం ఉన్న వ్యక్తిని నా కెరీర్లో చూడలేదు. 50ఏళ్లుగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. సినిమాపై ఆయనకు ఉన్న ఇష్టం అటువంటిద’ని అశ్వనీదత్ పాదాలు తాకబోయారు అమితాబ్. దీనిపైనే అశ్వనీదత్ పోస్ట్ చేశారు.