తెలుగు సినిమా అభిమానులకు మరో హ్యాపీ న్యూస్. తెలుగు సినిమా రంగంలో అత్యంత విజయవంతమైన ప్రొడక్షన్ హౌస్లలో ఒకటైన అర్కా మీడియా వర్క్స్ (Arka Mediaworks) ప్రస్తుతం హీరో రామ్ తో ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారు అయినట్టే.
ఇప్పటికే రామ్ హీరోగా తెరకెక్కిన “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా పూర్తికి చేరువలో ఉంది. ఫుల్ ఎనర్జీ, స్టైల్, డాన్స్తో యువ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రామ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతని సినిమాలు థియేటర్స్ లో ఎప్పుడూ యువతలో ఉత్సాహం రేపుతుంటాయి.
తాజాగా అర్కా మీడియా – రామ్ సినిమా.. గ్రాండ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకోబోతుందన్నది సమాచారం. భారీ బడ్జెట్, అద్భుతమైన టెక్నికల్ వర్క్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందన్న వార్తలు అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
రామ్ లైన్లో మరిన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అర్కా మీడియా సినిమా తో పాటు, మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నాయి .
అర్కా మీడియా వర్క్స్ గతంలో “బాహుబలి” వంటి ఆల్టైమ్ ఇండియన్ బ్లాక్బస్టర్ ని అందించింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నడిపే ఈ సంస్థకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. భారీ కాస్ట్, అద్భుతమైన టెక్నికల్ వర్క్ తో సినిమాలను తీర్చిదిద్దడంలో అర్కా మీడియా కి మంచి పేరుంది.
ఇప్పుడు అదే స్థాయి ప్రొడక్షన్ లో రామ్ హీరోగా ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వస్తుందనగానే అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇది అధికారికంగా ప్రకటించబడితే రామ్ కెరీర్ కి మరో మైలురాయి అవుతుందని టాక్ వినిపిస్తోంది.
