Switch to English

అర్జున ఫల్గుణ రివ్యూ

Critic Rating
( 1.50 )
User Rating
( 1.50 )

No votes so far! Be the first to rate this post.

Movie అర్జున ఫల్గుణ
Star Cast శ్రీ విష్ణు, అమృతా అయ్యర్
Director తేజ మర్ని
Producer నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
Music ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్
Run Time 2 hr 22 Mins
Release డిసెంబర్ 31, 2021

విభిన్నమైన సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు నుండి వస్తోన్న మరో చిత్రం అర్జున ఫల్గుణ. ఈ ఏడాది రాజ రాజ చోరతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు 2021ను మరో విజయంతో ముగించాలనుకున్నాడు. ఈరోజే విడుదలైన అర్జున ఫల్గుణ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

తమకున్న ఆర్ధిక ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి అర్జున్ (శ్రీ విష్ణు), తన స్నేహితులు కలిసి డ్రగ్ స్మగ్లింగ్ చేయడానికి నిశ్చయించుకుంటారు. గోదావరి జిల్లాల్లోని ఒక చిన్న పల్లెటూరి నుండి వచ్చిన వీరు ఆ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వీరిని పోలీస్ ఆఫీసర్ సుబ్బు (సుబ్బరాజ్) ఎలా ఎదుర్కొన్నాడు?

మొత్తం ఈ గందరగోళం నుండి అర్జున్, తన స్నేహితులు ఎలా బయటపడ్డారు అన్నది చిత్ర ప్రధాన కథాంశం.

పెర్ఫార్మన్స్:

శ్రీ విష్ణు ఎప్పటిలానే తన పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. పక్కింటి కుర్రాడిలా కనిపించే శ్రీ విష్ణు, అర్జున్ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో శ్రీ విష్ణు నటన చాల బాగుంది. హీరోయిన్ గా అమ్రిత అయ్యర్ చూడటానికి బాగుంది. అయితే ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానంలో క్లారిటీ లేదు. దీనికి తోడు శ్రీ విష్ణు, అమ్రితల మధ్య కెమిస్ట్రీ విషయంలో కూడా సరిగా వర్కౌట్ చేయలేదు అనిపిస్తుంది.

సుబ్బరాజును సరిగా ఉపయోగించుకోలేదు. ఆ పాత్రను ఇంకా వాడుకోవచ్చు. హీరో స్నేహితులుగా చేసిన జబర్దస్త్ మహేష్ ఇంకా తదితరులు వాళ్ళ పరిధుల మేరకు రాణించారు. శివాజీ రాజా, నరేష్ లు సపోర్టింగ్ రోల్స్ లో మెప్పించారు.

సాంకేతిక నిపుణులు:

జోహార్ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన తేజ మర్ని అర్జున ఫల్గుణను రూపొందించాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ తీయాలన్న దర్శకుడి ఆలోచన అభినందించ తగిందే. అయితే తన నరేషన్ లో క్లారిటీ లేదు, ప్రెజంటేషన్ లో గ్రిప్ లేదు. స్క్రీన్ ప్లే లో చాలా లోపాలున్నాయి.

ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం సంగీతం బాగుంది కానీ పాటలను సరిగా ఉపయోగించుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తగ్గ సన్నివేశాలు తెరపై లేవు. జగదీశ్ చీకటి ఛాయాగ్రహణం బాగుంది. విప్లవ్ ఎడిటింగ్ ఓకే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • నటీనటుల పెర్ఫార్మన్స్ లు

మైనస్ పాయింట్స్:

  • ప్రెజంటేషన్
  • సరైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం

విశ్లేషణ:

అర్జున ఫల్గుణ సరైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, సాలిడ్ ప్రెజంటేషన్, ఎంగేజింగ్ డ్రామా లేని ఒక సాధారణ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో ప్రేక్షకుడ్ని మెప్పించే సన్నివేశాలు చాలా అంటే చాలా తక్కువ. ఇంకా ఈ చిత్రాన్ని చూడాలనుకుంటే థియేటర్లలో స్కిప్ చేసి ఓటిటిలో వచ్చే వరకూ ఆగండి.

తెలుగు బులెటిన్ రేటింగ్: 1.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో...

హిందీలో అస్సలు ‘తగ్గేదే లే’ పుష్ప

ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దత్

రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్...

శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్...

సంక్రాంతి సినిమాల లిస్ట్ ఫైనల్ అయిందిగా

ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి రేసు నుండి పక్కకు తప్పుకున్నాయో ఇక అదే అదునుగా చాలా చిన్న చిత్రాలు సంక్రాంతి...

రాజకీయం

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు....

’13న నర్సాపురం వస్తున్నా.. ఫిబ్రవరి 5లోపు అనర్హత వేయించండి..’ రఘురామ సవాల్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. ‘ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముంది. సచివాలయ ఉద్యోగులకు నా మద్దతు తెలుపుతున్నాను. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి...

కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తంగా ఉండండి: పవన్ కల్యాణ్..

దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనా పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం...

ఫలిస్తున్న జగన్ ఢిల్లీ టూర్: ప్రత్యేక హోదా వచ్చేస్తోందా.?

కలిసొచ్చే అంశమేదన్నా వుందంటే, దానికి తమ ‘పేరు’ తగిలించేసుకోవడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణమే. ఏదన్నా తేడా కొడితే మాత్రం, ‘మా ప్రయత్నం మేం చేశాం..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కూడా మామూలే. ముఖ్యమంత్రి...

అన్నీ ఒమిక్రాన్ కేసులే.. కానీ, లెక్క నాలుగు వేలే.!

దేశంలో కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు పైగానేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న లక్షా ఎనభై వేలు. చిత్రమేంటంటే,...

ఎక్కువ చదివినవి

మింగలేక కక్కలేక.. ఏపీ ఉద్యోగుల అంతర్మధనమిదీ.!

ఎగేసుకుంటూ వెళ్ళారు.. నీరసంగా బయటకొచ్చారు.. కానీ, మొహాన నవ్వు పులుముకోక తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతల పరిస్థితి ఇదీ.! లోపల ఏమయ్యింది.? అంటే, ‘ఆల్ ఈజ్ వెల్..’ అనలేంగానీ.. అంటూ సన్నాయి...

ఈసారి సమ్మర్ పై కన్నేసిన ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్

సంక్రాంతికి ఉండాల్సిన సందడి అంతా పోయింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పలు విధమైన నిబంధనలను విధించాయి. ఢిల్లీలో థియేటర్లు బంద్ అయ్యాయి. కర్ణాటకలో వీకెండ్ కర్ఫ్యూ విధించారు....

వర్మాయణం.. ఇది బులుగాట కాదు కదా.?

రామ్ గోపాల్ వర్మని చాలామంది పరాన్న జీవిగా అభివరణిస్తారు. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ. 2014 నుంచి 2019 వరకూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా, జనసేన అధినేత...

విశాఖలో మత్స్యకారుల మధ్య ఘర్షణ..! రింగు వలలు రేపిన మంటలు..!

విశాఖ తీర ప్రాంతంలో నిన్న చెలరేగిన రింగు వలల వివాదం మత్స్యకారుల వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. సముద్రంలోనే పడవల్లో వలలను తగులబెట్టడం, పడవల దహనంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది....

రాజమౌళి కోసం రామాయణాన్ని వదులుకున్న మహేష్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫెవరెట్ దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకడు. రాజమౌళితో పనిచేయడం పట్ల పలు మార్లు ఆసక్తిని కనబరిచాడు. నిజానికి బాహుబలి తర్వాత మహేష్ తోనే జక్కన్న...