స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ చక్రవర్తి’ సినిమా టీజర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో చిత్ర బృందం మాట్లాడుతూ, ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కిందని, ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉందని వెల్లడించారు.
విజయ్ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాను విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించగా, శ్రీని గుబ్బల నిర్మించారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 46 ఇంటర్నేషనల్ అవార్డులు సాధించింది.
దర్శకుడు విక్రాంత్ మాట్లాడుతూ, చిన్నప్పటినుంచి తనను ప్రభావితం చేసిన కథను ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్నానని, అది ఈ సినిమా రూపంలో బయటకు వస్తోందన్నారు. ఈ సినిమా కోసం ఆరు సంవత్సరాలుగా కృషి చేశామని తెలిపారు. 120 లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ చేశామని, ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన నిర్మాత శ్రీని గారికి కృతజ్ఞతలు తెలిపారు. హీరో విజయ్, హీరోయిన్ సిజ్జా సహా టీమ్ మొత్తం ఎంతో డెడికేషన్‌తో పనిచేసిందన్నారు.
హీరో విజయ్ మాట్లాడుతూ, ప్రొ కబడ్డీ జట్లతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నానని, సిక్స్ ప్యాక్ కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశానని చెప్పారు. ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుందని, దర్శకుడు విక్రాంత్ వల్లే ఇది సాధ్యమైందన్నారు.
నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ, దర్శకుడు చెప్పిన కథ ఎంతో నచ్చిందని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామన్నారు. విజయ్ మరియు ఇతర నటులు అద్భుతంగా నటించారని కొనియాడారు.
హీరోయిన్ సిజ్జా మాట్లాడుతూ, ఇది తన మొదటి తెలుగు సినిమా అని, తెలుగు నేర్చుకొని నటించానన్నారు. అన్ని అంకితభావంతో పనిచేశామని, అందరి ఆదరణ కోరుకుంటున్నామని చెప్పారు.
ఇతర టీమ్ సభ్యులైన దుర్గేశ్, మ్యూజిక్ డైరెక్టర్ విగ్నేష్ భాస్కరన్, డీఓపీ జగదీష్ లు ఈ సినిమాపై తమ అనుభవాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశామని, ప్రేక్షకుల ఆదరణే తమకు బలం అని తెలిపారు.
ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాలనే ఆసక్తిని టీజర్ రెట్టింపు చేస్తోంది. ప్రేక్షకుల స్పందన చూస్తే ‘అర్జున్ చక్రవర్తి’ సినిమా ఒక బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం.
