AR Rahman: ‘ఆయనతో ‘రామాయణ’ ప్రయాణం అద్భుతం’.. ఎ.ఆర్.రెహమాన్ కామెంట్స్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,298FansLike
57,764FollowersFollow

AR Rahman: భారతదేశపు అత్యంత అద్భుతమైన సినిమాలలో ఒకటిగా ‘రామాయణ’ నిలుస్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. భారతీయ సినీ ప్రేక్షకులనే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు. ‘రామాయణ’కు హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ తో కలిసి ఆయన సంగీతం అందిస్తున్నారు. హాన్స్ జమ్మర్ తో పనిచేయడం గురించి ఏఆర్ రెహమాన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

“హాన్స్ జిమ్మర్ తో పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మా ఇద్దరి స్నేహం ఎంతో గొప్పది. మన దేశ సంస్కృతికి సంబంధించిన గొప్ప సినిమాకి మేమిద్దరం కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఆయన వల్ల ఈ ప్రాజెక్టుకి అంతర్జాతీయ గుర్తింపు దక్కుతుంది. విదేశీయులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారు. హాన్స్ జిమ్మర్ ‘రామాయణ’కు ఎందుకు సంగీతం అందించారనే ఆసక్తితో కూడా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులు ‘రామాయణ’ను ఆదరిస్తారు. ఓ సినిమాకు ఆయన సంగీతం అందించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. నా కెరీర్ లోనే పనిచేసిన అతిపెద్ద సినిమాలో ఒకటి ‘రామాయణ’”.

“సినిమా తీసే విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అత్యాధునిక సాంకేతికత వినియోగించడంతో సినిమా మరో స్థాయికి వెళుతుందని నమ్మకముంది. త్రీడీలో టైలర్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇటువంటి టెక్నాలజీతో ఒక భారతీయ సినిమా ఇంతవరకు రాలేదు. త్రీడి విజువల్స్, సంగీతం గురించి ఖచ్చితంగా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ప్రేక్షకుల్ని రామాయణ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంద’ని అన్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రావణాసురుడిగా యశ్, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. దాదాపు 4వేల కోట్లతో సినిమా జరిగిక్కుతోంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.

సినిమా

Rashmika: నా కెరీర్లోనే క్లిష్టమైన సీక్వెన్స్ ఇది.. సవాల్ గా తీసుకున్నా:...

Rashmika: హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ కావడం చిన్న విషయం కాదు. ఏకంగా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవడం అంటే ఎంత హార్డ్ వర్క్, టాలెంట్...

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి...

Jana Nayagan: ‘జననాయగన్’ వచ్చేస్తోంది..! విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారా..?

Jana Nayagan: తమిళనాడు సీఎం విజయ్ నటించిన‌ చివరి సినిమా 'జన నాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన సినిమాపై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...

12 గంటల యాక్షన్ షూట్‌లో చిరంజీవి.. మెగా స్టార్ డెడికేషన్‌కు టీమ్...

మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావం, క్రమశిక్షణతో మరోసారి అభిమానులతో పాటు చిత్రబృందాన్ని కూడా ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న #MEGA158 సినిమా షూటింగ్‌లో అత్యంత క్లిష్టమైన...

ప్రేయసిపైనే కోర్టులో కేసు.. ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసం, బ్రేకప్, ప్రతీకారం వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమలో జరిగిన అన్యాయానికి న్యాయం కోసం తన ప్రేయసిపైనే కోర్టులో కేసు...

రాజకీయం

పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానం.. తెలంగాణలో జనసేనలో ప్రముఖుల చేరిక

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ సంఘాల ప్రముఖులను జనసేనలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ...

శ్రవణ్, రావణ్ వెనుక వైసీపీ ఉందని జనసేన ఆరోపణ.. తాడేపల్లి నుంచే డైరెక్షన్ అని విమర్శ

యూట్యూబర్ రావణ్, జడ శ్రవణ్ వ్యవహారాల వెనుక వైసీపీ ఉందని జనసేన పార్టీ నేతలు ఆరోపించారు. రావణ్‌కు న్యాయ సహాయం అందిస్తామని వైసీపీ ప్రకటించడమే ఇరు వర్గాల మధ్య ఉన్న సంబంధానికి నిదర్శనమని...

ఏపీ షిప్‌బిల్డింగ్ రంగంలో పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.. హెచ్‌డీ KOSEతో కీలక చర్చలు

దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ యాత్ర కొనసాగిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ షిప్‌బిల్డింగ్ సంస్థ HD Korea Shipbuilding & Offshore Engineering (HD...

శ్రీసిటీలో మోటివ్ లింక్ పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.. ఈవీ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చలు

దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మోటివ్ లింక్ (MOTIVELINK) ప్రతినిధులతో సమావేశమయ్యారు....

జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కీలక దిశానిర్దేశం.. ప్రజల్లోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు

జనసేన పార్టీ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో మరింత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన జనసేన లెజిస్లేటివ్...

ఎక్కువ చదివినవి

దక్షిణ కొరియాకు లోకేష్.. పెట్టుబడులే లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌కు రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) ప్రభుత్వం అధికారిక ఆహ్వానం అందించింది. భారత్–దక్షిణ కొరియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం,...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

హస్తకళాకారులకు పవన్ హామీ అమలు.. ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా...

ఏపీలో హ్వాసంగ్ మెగా క్లస్టర్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియాలోని బుసాన్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రముఖ హ్వాసంగ్ గ్రూప్ (Hwaseung Group) ఉన్నతస్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫుట్‌వేర్, ఫుట్‌వేర్ మెటీరియల్స్, ఆటోమోటివ్...

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...