రెండున్నర నెలల్లోనే ఏపీఎస్ఆర్టీసీ మరోసారి బస్సు చార్జీలు పెంచింది. పెంచిన టికెట్ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 14న డీజిల్ సెస్ పేరుతో చార్జీలు పెంచి.. ఇప్పుడూ అదే పేరుతో చార్చీలు పెంచింది. దీంతో దూరప్రాంత ప్రయాణికులపై భారం పడనుంది. డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసీపై రూ.2.50 కోట్లు పడుతోందని బస్సు చార్జీలను పెంచక తప్పలేదని ఆర్టీసీ ఎండీ తిరుమలరావు పేర్కొన్నారు. పెంచిన ధరల్లో విజయవాడ, విశాఖపట్నం సీటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నామన్నారు.
పెంచిన చార్జీలు ఇలా..
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.20 నుంచి 25 వరకు..
ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో రూ.90 వరకూ..
అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో రూ.120 వరకూ..
ఏసీ సర్వీసుల్లో రూ.140 వరకూ.. గరిష్టంగా పెంచారు.
పెరిగిన ధరలతో ఏటా ప్రయాణికులపై రూ.500 కోట్లు భారం పడుతుందని అంచనా. నేటి (శుక్రవారం) నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.