బస్సు మైలేజీ తగ్గితే జీతం నుంచి రికవరీ చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు నోటీసులు ఇస్తున్నారనే వార్త సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బస్ మైలేజీ తగ్గినందుకు బాధ్యతగా.. డీజిల్ అదనపు వినియోగానికి అయిన వ్యయాన్ని జీతం నుంచి రికవరీ చేస్తామని డ్రైవర్లకు కొన్ని జిల్లాల్లో డిపో మేనేజర్లు నోటీసులిస్తున్నారని తెలుస్తోంది. విశాఖ పరిధిలోని సింహాచలం, అనకాపల్లి అనకాపల్లి డిపోలకు చెందిన కొందరు డ్రైవర్లకు ఇలా నోటీసులిచ్చినట్టు తెలుస్తోంది.
కండిషన్ లో లేని బస్సులు, గుంతల రోడ్లతో మైలేజీ ఎలా సాధ్యమని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటుంటి సందర్భాల్లో డ్రైవర్‌కు నోటీసులిస్తారు కానీ.. జీతం నుంచి రికవరీ చేసేలా ఇవ్వరని కారణాలను పరిశీలిస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. బస్ మైలేజీ తగ్గితే.. సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌ను పంపి మైలేజీ తగ్గడానికి కారణాలను విశ్లేషించి.. సమస్య ఉంటే జోనల్ శిక్షణ కళాశాలకు డ్రైవర్ ను పంపి వారం శిక్షణ ఇస్తారని.. ఇవేమీ చేయకుండా నోటీసులివ్వడం, జీతం రికవరీ చేస్తామని చెప్పడమేంటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.