ఆంధ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం: డల్లాస్‌లో లోకేష్ హామీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,218FansLike
57,764FollowersFollow

అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రవాసాంధ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆంధ్రుల కోసం ప్రభుత్వం మరింత బాధ్యతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలాల్లో ప్రవాసాంధ్రులు అందించిన అండ, మద్దతు తమ కుటుంబానికి, పార్టీకి అపారమైన బలం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఎయిర్‌పోర్ట్ నుండి కార్యక్రమం వరకూ ప్రజలు ఇచ్చిన భారీ స్వాగతం తనను మరింతగా ప్రభావితం చేసిందని చెప్పారు.

లోకేష్ మాట్లాడుతూ, ప్రవాసాంధ్రుల ఉత్సాహం, ప్రేమ చూసి అమెరికాలో ఉన్నామా లేక ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా అనిపించిందన్నారు. యువగళం పాదయాత్ర రోజుల్లో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను గుర్తుచేసుకుంటూ, అప్పుడు వెంట నిలిచిన వారిని ఈ రోజు మళ్ళీ చూడటం హర్షకరమని తెలిపారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోలేనివని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం తాము తీసుకున్న బాధ్యత అని చెప్పారు.

ఎన్నికల్లో జనం చూపిన చిత్తశుద్ధి ఫలితంగానే కూటమి రికార్డు స్థాయి విజయాన్ని సాధించిందని లోకేష్ అన్నారు. “వై నాట్ 175?” అన్న వారికే ప్రజలు “వై నాట్ 11?” అని సమాధానం చెప్పారన్నారు. ప్రవాసాంధ్రులు ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు నిలబెట్టిన ఆత్మగౌరవ స్ఫూర్తి ఈ విజయానికి ప్రధాన కారణమన్నారు. కేవలం ఎన్ఆర్ఐలు మాత్రమే కాకుండా, ఎంఆర్ఐలు—మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్—అని ప్రశంసించారు.

రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ, ఐటీ, క్వాంటమ్ టెక్నాలజీ, రిన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆక్వా, స్టీల్, సీబీజీ, సోలార్ వంటి రంగాల్లో వేగంగా ముందుకు వెళ్తున్న రాష్ట్రాన్ని “స్పీడ్‌కు బ్రాండ్ అంబాసిడర్”గా అభివర్ణించారు. కేంద్రం–రాష్ట్రం–జనసేన కలిసిన డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం వచ్చే పదేళ్లలో ఏపీలో అప్రతిహత అభివృద్ధి తీసుకువస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

యువతకు 20 లక్షల ఉద్యోగాల సృష్టి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇప్పటికే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. జాబ్ సీకర్స్ మాత్రమే కాకుండా, జాబ్ క్రియేటర్స్ గా మారే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రవాసాంధ్రుల కోసం ఏపీ ఎన్ఆర్ఐటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విదేశాల్లో చదువుకు “కలలకు రెక్కలు” పథకం ద్వారా ప్రభుత్వం సాయం చేయనున్నట్లు వివరించారు.

చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన లోకేష్, రాజకీయంగా కక్షసాధింపులు చేయాలన్న ఉద్దేశం లేదని, కానీ అవమానాలను మాత్రం సహించబోమన్నారు. స్త్రీలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పునరుద్ఘాటించారు.

ఈ సమావేశంలో ఏపీ ఎన్‌ఆర్ఐటీ సొసైటీ అధ్యక్షులు వేమూరి రవికుమార్, ఎన్ఆర్ఐ టీడీపీ సమన్వయకర్తలు, గార్లాండ్ నగర మేయర్ డైలాన్ హెడ్రిక్ తదితరులు పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో హాజరై లోకేష్‌ను అభినందించారు.

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

ఎక్కువ చదివినవి

Jailer 2: ‘జైలర్ 2’పై లేటెస్ట్ అప్డేట్..! రజినీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో

Jailer 2: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా ‘జైలర్ 2’. 2023లో విడుదలై సూపర్ హిట్టయిన ‘జైలర్’కు సీక్వెల్ గా తెరకెక్కుతోందీ మూవీ. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్ ఇదేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇటివలే...

Daily Horoscope: కర్కాటకం వారికి శుభవార్తలు.. ధనుస్సు వారికి కొత్త అవకాశాలు

జులై 2 , 2026 గురువారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా జులై 2, 2026 గురువారం నాటి రాశిఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, విద్య మరియు...

Varanasi: ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్డేట్..! మహేశ్ ఫ్యాన్స్ లో జోష్

Varanasi: మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునేలా అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కతోందీ సినిమా. సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్ లో...

‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ టీజర్‌కు కౌంట్‌డౌన్

పాన్ ఇండియా చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. టీజర్ విడుదలకు ఇక కేవలం మూడు రోజులే మిగిలి ఉన్నాయని...