Switch to English

ఏప్రిల్‌ 14 తర్వాత థియేటర్లు ఓపెన్‌ అయ్యేనా?

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెల్సిందే. ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌ డౌన్‌ను విధించక ముందే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు క్లోజ్‌ అయ్యాయి. లాక్‌ డౌన్‌తో థియేటర్ల బంద్‌ కొనసాగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14 వరకు కొనసాగించాల్సిందే అంటూ ప్రధాని సీరియస్‌గా చెప్పిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ కర్ఫ్యూ వాతావరణం కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్‌ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కొందరు ముఖ్యమంత్రులు లాక్‌ డౌన్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తే మరికొందరు మాత్రం మెల్ల మెల్లగా లాక్‌ డౌన్‌ను ఎత్తి వేయాలని దశలవారీగా లాక్‌ డౌన్‌ను ఎత్తివేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

దశల వారీగా అంటే అత్యంత ముఖ్యమైన వాటిని మొదట లాక్‌ డౌన్‌ నుండి తప్పిస్తారు. ఆ క్రమంలో చూస్తే స్కూల్స్‌ ఇంకా థియేటర్లు చివర్లో ఓపెన్‌ చేసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లాక్‌ డౌన్‌ను దశలవారీగా ఎత్తి వేయడం అనేది జరిగితే మాత్రం ఏప్రిల్‌ చివరి వరకు లేదంటే మే మొదటి లేదా రెండవ వారం వరకు కూడా థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి ఉండదనిపిస్తుంది. ఒకవేళ ఏప్రిల్‌లోనే థియేటర్లు ఓపెన్‌ చేసినా కూడా సినిమాల విడుదలకు నిర్మాతలు ఆసక్తిగా లేరు అనిపిస్తుంది.

ఎందుకంటే ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు రావాలంటే కనీసం రెండు నెలలు అయినా సమయం పడుతుంది. కరోనా గురించి పూర్తిగా భయాలు తొలగి పోయే వరకు థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే అవకాశం లేదు. అందుకే థియేటర్లపై లాక్‌ డౌన్‌ ను కొనసాగించినా వచ్చే నష్టం ఏమీ లేదని కొందరు అంటున్నారు. అయితే షూటింగ్స్‌ మాత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఏప్రిల్‌ 14 న కాకుండా రెండవ దశలోనో మూడవ దశలోనే షూటింగ్స్‌కు పర్మీషన్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉందంటున్నారు.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

విజయ్ సినిమాకు 20 కోట్ల నష్టం.. నిజమెంత?

తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరో ఎవరంటే కచ్చితంగా విజయ్ పేరు ముందు వినిపిస్తుంది. రీసెంట్ గా కూడా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్యన ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగేది కానీ...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేనా.?

పోలవరం ప్రాజెక్ట్‌.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఎప్పుడో బ్రిటిష్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆలోచనలు ముందడుగు వేశాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞం.....

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం ఏంటో తెలుసా?

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ ఆయన్ను దేశ వ్యాప్తంగా ఆకాశానికి ఎత్తుతున్నారు....

మళ్లీ అధికారంలోకి వస్తామనే కలలో బతకొద్దంటూ టీడీపీపై నాగబాబు ఫైర్

మెగా బ్రదర్ నాగబాబు ఈరోజు టీడీపీని టార్గెట్ చేశారు. ఈరోజు తన ట్విట్టర్ అకౌంట్లో తనదైన స్టైల్లో టీడీపీపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణలా మారిపోయాయి పరిస్థితులు. ఈ...