Switch to English

పిఠాపురంలో ‘అపోలో’ మిషన్.! ఉపాసనకి థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,952FansLike
57,764FollowersFollow

ఉపాసన కొణిదెల అంటే తెలుసు కదా.? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. ఔను, పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి కోడలు ఉపాసన. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసణ, పిఠాపురంలో అపోలో ఆసుపత్రి తరఫున అత్యంత ప్రత్యేకమైన ‘మిషన్’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

పిఠాపురంలో ‘అపోలో’ మిషన్.! ఉపాసనకి థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్

మాతా శిశు సంరక్షణకి కట్టుబడి, ‘మెటర్నీ, ఇన్‌ఫాంట్ దశలో మరణాల్ని సున్నా స్థాయికి తగ్గించడం’ సహా, జననం తర్వాత పూర్తి స్థాయిలో ఆరోగ్యకరమైన ఆహారం, పరిశుభ్రత తదితర అంశాలకు సంబంధించి అవగాహనా కార్యక్రమాల్ని పిఠాపురంలో చేపట్టనుంది అపోలో ఆసుపత్రి. తన తాతయ్య పద్మ విభూషణ్ ప్రతాప్ రెడ్డి 93వ జన్మదినం సందర్భంగా ఈ వివరాల్ని ఉపాసన వెల్లడించారు.

పిఠాపురంలో ‘అపోలో’ మిషన్.! ఉపాసనకి థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్

విమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ బిల్డింగ్ వంటి అంశాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని, పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు ఉపాసన. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అలాగే కమ్యూనిటీ బలోపేతం, వందకి పైగా అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం తదితర లక్ష్యాలతో బృహత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉపాసన ప్రకటించారు.

ఉపాసన ప్రకటించిన ఈ మిషన్ పట్ల హర్షం వ్యక్తం చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం. పిఠాపురంలో చేపట్టనున్న ఈ కార్యక్రమాలతో నియోజకవర్గ రూపు రేఖలు వైద్య, ఆరోగ్యం పరంగా మారతాయని ప్రభుత్వం భావిస్తోంది.

అపోలో గ్రూప్ తరఫున పిఠాపురం నియోజకవర్గంలో ఇంత పెద్ద మిషన్ ప్రారంభం కానుండడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అపోలో ఆసుపత్రి నిర్మాణం కోసం స్థల సేకరణ జరుగుతున్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది. కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యే అత్యాధునిక వైద్యం, పిఠాపురం లాంటి నియోజకవర్గంలో అందుబాటులోకి రానుండడం అభినందించదగ్గ విషయమే.

అంగన్వాడీలను అభివృద్ధి చేయడం, విమెన్ ఎంపవర్మెంట్, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం.. ఇవన్నీ సమాజాభివృద్ధికి సూచికలుగా చెప్పుకోవచ్చు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక, క్షణం తీరిక లేకుండా అభివృద్ధి కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్, దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో తనదైన ప్రత్యేకతను చాటి చెబుతున్నారు.

కుటుంబం పరంగా, మెగా కాంపౌండ్ నుంచి పిఠాపురం నియోజకవర్గానికి దక్కుతున్న ఈ అండదండలు.. మరింత ప్రత్యేకం.

సినిమా

వచ్చేస్తున్నాడు: అఖండ 2 రిలీజ్ కి మార్గం క్లియర్‌… కానీ..

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2కి సంబంధించిన రిలీజ్ డ్రామా చివరకు కీలక మలుపు తీసుకుంది. మద్రాస్ హైకోర్టు రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు...

అభ్యంతరకర పోస్టులపై కోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు ఎన్టీఆర్‌.. సోషల్‌మీడియాలో తనపై వస్తున్న అభ్యంతరకర, తప్పుడు పోస్టులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని కోర్టుకు తెలియజేశారు. దీంతో సంబంధిత ఖాతాలపై...

BIGG BOSS 9 TELUGU E93: సంజన జైలుకి – ఆఖరి...

బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 93 సోమవారం ఎపిసోడ్ పూర్తిగా టర్నింగ్స్‌తో, టెన్షన్  మోమెంట్స్‌తో నిండిపోయింది. ఇప్పటి వరకూ కెప్టెన్ కాలేని భరణిని బిగ్...

ఇంకా తేలని అఖండ2 అప్పుల వ్యవహారం!

అఖండ2 కోసం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నా, ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎదురవుతున్న సమస్యలు మాత్రం ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికే అనుకోని పరిస్థితుల...

మురళీకాంత్ చెప్పిన కథలోనే సినిమా తీయాలనిపించింది: నిర్మాత బెన్నీ

నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని (Benny) నటుడు మురళీకాంత్‌తో కలిసి చేస్తున్న దండోరా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎందుకు ఒక డిఫరెంట్...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ యూనివర్సిటీకి ఓపెన్‌ఏఐ సహకారం కోరిన మంత్రి లోకేష్

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి ముఖ్యమైన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ను కృత్రిమ మేధస్సు (AI) వినియోగంలో...

అమరావతి క్రియేటర్ ల్యాండ్‌కు కాన్వా సహకారం – లోకేష్ కీలక చర్చలు

శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా): అమరావతిని జ్ఞాన, సృజనాత్మకత, డిజిటల్ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే యత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్,...

అమరావతిలో క్వాంటమ్ రీసెర్చ్ హబ్‌కు రిగెట్టి సహకారం కోరిన లోకేష్

అమరావతిని అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్‌ను ఆయన...

ఆంధ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం: డల్లాస్‌లో లోకేష్ హామీ

అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రవాసాంధ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆంధ్రుల కోసం ప్రభుత్వం మరింత బాధ్యతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలాల్లో ప్రవాసాంధ్రులు...

విశాఖలో జడ్‌స్కాలర్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు లోకేష్ ఆహ్వానం

శాన్ ఫ్రాన్సిస్కో‌లో మంత్రి నారా లోకేష్ జడ్‌స్కాలర్ సీఈవో జే చౌదరిని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ సెక్యూరిటీ అభివృద్ధికి అనుకూలమైన అవకాశాలను వివరించారు. క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో ప్రపంచవ్యాప్త పేరొందిన ఈ సంస్థను...

ఎక్కువ చదివినవి

BIGG BOSS 9 TELUGU E87: ఫైనలిస్ట్ ల పోటీలో చతికిల పడిన డిమాన్ పవన్, దూసుకెళ్లిన ఇమ్మానియేల్, తనూజ

బిగ్ బాస్ సీజన్ 9 మంగళవారం ఎపిసోడ్ పూర్తిగా ఫైనలిస్ట్ రేస్ హంగామాతో సందడి చేసింది. గ్రాండ్ ఫి నాలే దగ్గరపడుతుండడంతో హౌస్‌లోని ప్రతి సభ్యుడు టెన్షన్‌తో, పందెం టాస్క్‌లతో, మాటల బాణాలతో...

చేసింది చెప్పుకోలేక పోయాం అన్న జగన్‌కి… టీడీపీ కేడర్ నుంచి వర్షంలా వ్యంగ్యాస్త్రాలు!

రాజకీయాలలో మాటల దాడులు అంతం లేనివి. “చేసింది చెప్పుకోలేక పోయాం” అంటూ జగన్ మీడియా సమావేశాల్లో వాపోతూ ఉండగానే… మరో పక్క టీడీపీ కార్యకర్తలు సూటిగా, స్టైలిష్‌గా, ఘాటు వ్యంగ్యాస్త్రాలతో రిప్లై ఇస్తూ...

BIGG BOSS 9 TELUGU E93: సంజన జైలుకి – ఆఖరి కెప్టెన్ గా భరణి

బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 93 సోమవారం ఎపిసోడ్ పూర్తిగా టర్నింగ్స్‌తో, టెన్షన్  మోమెంట్స్‌తో నిండిపోయింది. ఇప్పటి వరకూ కెప్టెన్ కాలేని భరణిని బిగ్ బాస్ డైరెక్ట్‌గా ఆఖరి కెప్టెన్‌గా నియమించడం...

అమరావతి క్రియేటర్ ల్యాండ్‌కు కాన్వా సహకారం – లోకేష్ కీలక చర్చలు

శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా): అమరావతిని జ్ఞాన, సృజనాత్మకత, డిజిటల్ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే యత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్,...

ఆంధ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం: డల్లాస్‌లో లోకేష్ హామీ

అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రవాసాంధ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆంధ్రుల కోసం ప్రభుత్వం మరింత బాధ్యతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలాల్లో ప్రవాసాంధ్రులు...