Switch to English

అమరావతిలో క్వాంటమ్ రీసెర్చ్ హబ్‌కు రిగెట్టి సహకారం కోరిన లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,195FansLike
57,764FollowersFollow

అమరావతిని అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్‌ను ఆయన కలిసి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మార్పు ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా అమరావతిలో త్వరలో ప్రారంభం కానున్న క్వాంటమ్ వ్యాలీలో ప్రత్యేక క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ వింగ్‌ను స్థాపించాలని లోకేష్ కోరారు. క్వాంటమ్ క్లౌడ్ టెక్నాలజీని ఏపీ డిజిటల్ మౌలిక సదుపాయాల్లో అనుసంధానించి రాష్ట్రాన్ని దేశంలోనే తొలి క్వాంటమ్ రెడీ స్టేట్‌గా మార్చాలనే ప్రభుత్వం లక్ష్యాన్ని ఆయన వివరించారు.

ఎఆర్/వీఆర్ కంటెంట్ క్రియేషన్, ఏఐ ఆధారిత మీడియా ప్రాసెసింగ్ కోసం క్రియేటర్ ల్యాండ్ కార్యక్రమానికి రిగెట్టి సహకరించాల్సిన అవసరాన్ని కూడా లోకేష్ గుర్తుచేశారు. భారతదేశం మరియు గ్లోబల్ సౌత్ మార్కెట్లకు ఆంధ్రప్రదేశ్‌ను ఆధారంగా తీసుకుని క్వాంటమ్-యాజ్-ఏ-సర్వీస్ (QaaS) అందించే అవకాశాలు విస్తారంగా ఉన్నాయని ఆయన సూచించారు.

ఈ ప్రతిపాదనలపై స్పందించిన రిగెట్టి సిటిఓ డేవిడ్ రివాస్… బర్క్‌లీ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ఫ్రీమాంట్‌లో అత్యాధునిక క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీ, ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్స్, ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ భాగస్వామ్య సంస్థలతో కలిసి క్వాంటమ్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి తగిన విధంగా ముందుకు సాగుతామని రివాస్ వెల్లడించారు.

సినిమా

మెగా బ్లాక్ బస్టర్ పై స్పందించిన .. అల్లు(డు) అర్జున్

మెగాస్టార్ చిరంజీవి – అల్లు అర్జున్ మధ్య సంబంధాలపై సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది. ఒకవైపు మెగా కుటుంబం నుంచి దూరంగా...

90 రోజుల ముందే టికెట్ ధరల ఉత్తర్వులు ఇవ్వాలి: హైకోర్టు సంచలన...

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు జారీ...

గౌతమ్ ఎంట్రీకి డైరెక్టర్ ఎవరు?

సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని సినీ ఎంట్రీపై టాలీవుడ్‌లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో ప్రొఫెషనల్ యాక్టింగ్ కోర్స్ పూర్తి...

ప్రెస్ క్లబ్‌లో రేణూ దేశాయ్–రష్మీ గౌతమ్ స్పీచ్… కుక్కల హింసపై ఆవేదన,...

హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ తీవ్ర చర్చకు దారి తీసింది. నటి రేణూ దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్ పాల్గొన్న ఈ...

CHIRANJEEVI: ముంగిట్లో సంక్రాంతి ముగిసింది.. ధియేటర్లో ‘చిరంజీవి’ పండగ ముగియలేదు

CHIRANJEEVI: సంక్రాంతి పండగొచ్చింది.. ప్రజలను ఊళ్ళకు రప్పించింది.. కుటుంబాల్లో ఆనందాలు నింపింది.. సంబరాలు చేసింది..! వారం రోజుల సంతోషాలు, ఆనందాలు పండగ వెళ్ళిపోవడంతో పండగ సంతోషాలు...

రాజకీయం

వైసీపీ వర్సెస్ టీడీపీ: దిష్టి బొమ్మ ఎవరు.?

మాజీ మంత్రి అమర్‌నాథ్‌కి సోషల్ మీడియాలో వున్న పేరు ‘కోడి గుడ్డు అమర్నాథ్’ అని. ఆ పేరు ఆయనకి ఎలా వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాభివృద్ధి విషయమై మీడియా అడిగిన...

కల్చర్‌ బట్టల వరకే పరిమితమైందా? కుక్కల అంశంపై రష్మి గౌతమ్‌ గట్టి ప్రశ్నలు

యాంకర్‌ రష్మి గౌతమ్‌ తాజాగా కుక్కల సమస్యపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆమె, సమాజంలో మనుషుల ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా...

దావోస్‌లో ఏపీకి గ్రీన్ టెక్ బూస్ట్… పోర్టుల్లో హైడ్రోజన్ వాహనాలపై కీలక చర్చలు

దావోస్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక భేటీ నిర్వహించారు. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ సంస్థ ఎవల్యూషన్ సినర్జెటిక్ ఆటోమోటివ్ ఎస్‌ఎల్ (EVO) మేనేజింగ్...

“అభివృద్ధి అంటే చంద్రబాబు”: యూరప్ వేదికపై లోకేష్ స్పష్టమైన సందేశం

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వేదికగా జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేనని స్పష్టం చేస్తూ, ఆయన...

కోటరీ కుంపటి.! వైసీపీకి విసారెడ్డి ఉచిత సలహా ఉపయోగపడేనా.?

వెనిజులా అంశాన్ని తీసుకొచ్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉచిత సలహా ఇచ్చారు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి. దాంతో, సహజంగానే వైసీపీలో కొంతమందికి బాగా కాలింది. ఆ...

ఎక్కువ చదివినవి

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

రాజకీయ వేడి రాజుకుంది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ,...

సోషల్ మీడియా వలలో పడిన వందల మంది..! భార్యాభర్తల బ్లాక్‌మైలింగ్ గుట్టు రట్టు

కరీంనగర్‌లో జరిగిన ఓ సంచలన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పురుషులను వలలో పడేసి, శృంగార వీడియోలతో బెదిరించి లక్షల రూపాయలు దండుకున్న భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...