సంక్రాంతి పండక్కి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని సొంతూళ్ళకు వెళుతున్నారు చాలామంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని వెతుక్కునే క్రమంలో దేశంలోని నలు మూలలకూ వెళ్ళిపోయిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, ఏడాదికోసారి అయినా సొంతూరుకి వెళ్ళే క్రమంలో సంక్రాంతిని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
ఈసారి సంక్రాంతికి ఆంధ్ర ప్రదేశ్‌లో స్పెషల్ ఏంటో తెలుసా.? రోడ్లు.! జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్‌లో రోడ్ల విషయమై ప్రత్యేక బాధ్యత తీసుకున్నారు.
ప్రత్యేకించి, గ్రామీణ రోడ్ల విషయమై పవన్ కళ్యాణ్ చూపుతున్న చొరవ, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్, ఆయా రోడ్ల నిర్మాణాలు, మరమ్మత్తులపై పెడుతున్న ప్రత్యేక శ్రద్ధ.. రాష్ట్రంలో రోడ్లన్నీ తళతళ్ళాడేలా చేస్తున్నాయ్.
దశాబ్దాలుగా రోడ్లకు నోచుకోని గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు పడ్డాయ్. మరీ ముఖ్యంగా సిమెంట్ రోడ్లు ఎక్కువగా నిర్మాణమయ్యాయి గడచిన ఆర్నెళ్ళలో.
రోడ్ల మీదనే భోగి మంటలు వేసుకునే అలవాటున్న జనం, కొత్త రోడ్లపై బోగి మంటలు వేస్తూ, ఆయా ఫొటోల్ని సోషల్ మీడియాలో వుంచుతున్నారు. క్రెడిట్ అంతా ఏపీ డిప్యూటీ సీఎం ఖాతాలోనే వేస్తున్నారు జనం.
రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితికీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికీ మళ్ళీ స్పెషల్ ఎట్రాక్షన్.. అన్నట్లుంది పరిస్థితి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలతో ఫ్లెక్సీలు పెద్దయెత్తున దర్శనమిస్తున్నాయి.
‘మా రోడ్డు దుస్థితి గతంలో ఇలా వుండేది.. ఇప్పుడు ఇంత బావుంది.. దీనిక్కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..’ అని జనం స్వచ్ఛందంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయాల్లో జనసేన తెచ్చిన మార్పు ఇదీ.. అని ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా జనం చర్చించుకుంటున్నారు.