నేరం నిరూపితమయ్యేవరకూ నిందితుడు మాత్రమే.! ఈ మాట చాలా తేలిగ్గా వాడేస్తుంటాం. నేరం అయితే, జరిగిపోతుంది.! కానీ, నిరూపించడానికి ఏళ్ళు పడుతుంది.! దశాబ్దాలు గడిచిపోతుంటాయ్.! కానీ, నేరం నిరూపితం కాదు.!
అలాంటప్పుడు, నేరం చేసిన వ్యక్తిని కేవలం నిందితుడిగానే చూడాలా.? సోషల్ మీడియా వేదికగా అత్యంత అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేయడం నేరం.! మీడియా సాక్షిగా, చంపేస్తామని బెదిరించడమూ నేరమే.! మరి, ఈ నేరాల్లో దోషులకు శిక్ష పడేదెలా.? ‘దోషి’ అని తేల్చేదెప్పుడు.?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు ‘నేరస్తులకు సంబంధించి’ పెద్ద రచ్చ జరుగుతోంది. ఇద్దరూ వైసీపీ మద్దతుదారులే.! అందులో ఒకరు అరెస్టయ్యారు.. రిమాండ్‌కి తరలించబడ్డారు. అతనితో పోలీసులు విందు ఆరగించారు.. అదీ, రిమాండ్‌కి తరలించే క్రమంలో. ఈ కేసులో బాధ్యులైన పోలీసు సిబ్బంది మీద ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారట.
మరో కేసులో, ఇంకో నేరస్తుడిని పోలీసులు వదిలేశారట. అలా వదిలేసిన పోలీసులపైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారట.! అసలేం జరుగుతోంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో.?
అబ్బే, వాళ్ళిద్దరూ ప్రస్తుతానికి నిందితులు మాత్రమే.. అని వాదిస్తే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి వుండదు. హత్య చేసిన వ్యక్తి హంతకుడే అవుతాడు.! న్యాయస్థానాలు శిక్ష వేస్తేనే దోషి అంటే ఎలా.? హత్యకు ఏమాత్రం తీసిపోని నేరాలు హత్య చేస్తానని బెదిరించడం. అదీ, చిన్న పిల్లలపై హత్యాచారం చేస్తానని బెదిరించడం అత్యంత హేయం.!
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో పోలీస్ శాఖలోని కొందరు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే, ప్రజలకు ఏం సమాధానం చెప్పగలం.? అని పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ప్రశ్నించారు.
వంగలపూడి అనిత కూడా, పైన పేర్కొన్న నేరస్తుల వల్ల బాధితురాలిగా మారినవారే.! మరి, ఆమెకు పోలీస్ శాఖపై కమాండ్ లేకపోవడమేంటి.? హోంశాఖ మంత్రిగా ఆమెకు అసలు ‘పవర్స్’ వున్నాయా.? లేవా.?