AP MLC Elections: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ‘క్రాస్ ఓటింగ్’ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమైంది. అధికార పార్టీ ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది. బలం లేకపోయినా, ఇతర పార్టీల నుంచి లాక్కున్న ఎమ్మెల్యేలతో ఆ సీటు దక్కించుకోవాలని ఆశపడి, భంగపడింది అధికార వైసీపీ.
అయితేనేం, మిగిలిన ఆరు స్థానాల్ని వైసీపీ గెల్చుకుంది. ఆరు గెల్చుకున్న పార్టీ, ఒక్కటి ఓడితే అది పెద్ద విషయం కాదు. కానీ, ఇక్కడ అధికార వైసీపీ లేని ప్రతిష్టకు పోయింది. పంతానికి వెళ్ళి పరువు పోగొట్టుకుంది. అందుకే ఇంత చర్చ.. ఇంత రచ్చ. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసేదాకా వెళ్ళింది వైసీపీ.
చాలాకాలంగా వైసీపీ మీద తిరుగుబాటు షురూ చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుని ఈ రోజు వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేకపోయారు. అంతెందుకు, ఆనం రామనారాయణరెడ్డి కావొచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావొచ్చు.. వీళ్ళ విషయంలోనూ నీళ్ళు నములుతూ వచ్చారు ఇప్పటివరకూ.
వుండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం న్యూ ఎంట్రీస్ ఈ లిస్టులో అనుకోవచ్చు. వాస్తవానికి, తాము వైసీపీ అభ్యర్థులకే ఓటేశామని వుండవల్లి శ్రీదేవి, మేకపాటి చెబుతున్నారు. అయినా, వాళ్ళనెందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు.? ఎక్కడో ఏదో తేడా కొడుతోంది.
క్రాస్ ఓటింగ్‌కి పాల్పడిన ఎమ్మెల్యేలు వేరే వున్నారు. వాళ్ళెవరన్నదానిపై అధికార పార్టీ పెదవి విప్పదు. కారణం, అవి పెద్ద తలకాయలే అయి వుండొచ్చన్నది అంతటా వినిపిస్తోన్న వాదన. ‘మా ఎమ్మెల్యేలే మాకు ఓటేశారు.. మా బలం 23.. మాకు పడ్డ ఓట్లు 23’ అని టీడీపీ గట్టిగా చెబుతోంటే, వైసీపీ దానికి సమాధానం చెప్పలేని దుస్థితి.
ముందు ముందు చాలా జరగబోతున్నాయ్ వైసీపీలో.! గట్టు తెగింది, ఎమ్మెల్యేలు బయటకు పారిపోవడం ఖాయం.. అన్న చర్చ వైసీపీలోనే అంతర్గతంగా జరుగుతోందిట.
293884 422135Ill do this if require to as a lot as I hope that is not too far off the track. 921388