Switch to English

ఓటమి బాటలో ఏపీ మంత్రులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,323FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కూటమి పార్టీలు జోరు చూపిస్తున్నాయి. ఇప్పటికే 150 కి పైగా సీట్లలో భారీ ఆధిక్యం కనబరుస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సిపి 13 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మినహా మిగిలిన మంత్రులందరూ వెనకంజలో ఉన్నారు.

నగరిలో మంత్రి రోజా తొలి రౌండు నుంచి వెనకబడ్డారు. అక్కడ కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ నాయుడు ప్రస్తుతం ఎనిమిది వేలకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు.

గుడివాడ నియోజకవర్గంలో మాజీమంత్రి కొడాలి నాని వెనకంజలో ఉన్నారు. అక్కడి కూటమి అభ్యర్థి, టిడిపి నేత వెనిగండ్ల రాము ఐదువేల పైచిలుకువాట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

ఆమదాలవలస నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం కి సైతం షాక్ తగిలింది. అక్కడి కూటమి అభ్యర్థి కోన రవికుమార్ 9000 కు పైగా ఓట్ల ఆధిక్యం తో ముందంజలో ఉన్నారు.

చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకు ఓటర్లు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి 900 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. కూటమి అభ్యర్థి టిడిపి నేత కళా వెంకట్రావు ఆదిక్యం లో ఉన్నారు.

మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా డోన్ నియోజకవర్గంలో వెనుకంజ లో ఉన్నారు. తన సమీప అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి 1900 ఓట్ల తో ముందంజలో ఉన్నారు.

గాజువాకలో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వెనుకంజలో ఉన్నారు. తన సమీప అభ్యర్థి, టీడీపి నేత పల్లా శ్రీనివాసరావు 21 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

మంత్రి విడదల రజిని కూడా వెనకబడ్డారు. అక్కడి కూటమి అభ్యర్థి గల్లా మాధవి 7 వేలకి పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు.

కొండేపి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ తన సమీప అభ్యర్థి, టిడిపి నేత బాల వీరాంజనేయులు కంటే మూడు వేల పైచిలుకు ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆసుపత్రిలో చేరిన జాన్వికపూర్

వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె తీసుకున్న ఆహారం కల్తీ కావడంతో అనారోగ్యం పాలైన ఆమె ఆసుపత్రిలో...

ట్రోల్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోండి.. డీజీపీకి “మా” సభ్యుల వినతి

సోషల్ మీడియా వేదికగా సినీ ఆర్టిస్టులపై వస్తున్న ట్రోల్స్, అసభ్యకర ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ( MAA ) సభ్యులు తెలంగాణ...

డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి చేతుల మీదుగా “జస్ట్ ఎ మినిట్” ట్రైలర్...

" ఏడు చేపల కథ" ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన హీరో అభిషేక్ పచ్చిపాల. ఇప్పుడాయన హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా "జస్ట్...

Murari: మహేశ్ ‘మురారి’ వెడ్డింగ్ కార్డు వైరల్.. మూవీ రీ-రిలీజ్ తో...

Murari: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) కెరీర్లో తొలి సూపర్ హిట్ మూవీ ‘మురారి’ (Murari). క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన...

Ram Charan: అంబానీ ఇంటి పెళ్లిసందడిలో మెరిసిన ‘రామ్ చరణ్’

Ram Charan: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. కోట్లాది దేవతల ఆశీర్వాదం.. అంగరంగ వైభవంగా జరిపే వివాహానికి తెలుగు మాటల్లో ఉన్న ఓ నానుడి ఇది....

రాజకీయం

పదకొండు ప్రభావం: వైసీపీ.. రాజు లేని రాజ్యమైపోయిందే.!

వై నాట్ 175 అనే నినాదాన్ని నిజానికి, వైసీపీ శ్రేణులే నమ్మలేదు. అప్పటి వైసీపీ సిట్టింగ్ ప్రజా ప్రతినిథులూ నమ్మలేదు. కానీ, సాధ్యం కాని విషయాన్ని బలంగా రుద్దేందుకోసం ‘సిద్ధం’ అంటూ కోట్లు...

రేపే అల్పపీడనం.. రాష్ట్రంలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం గా ఉండాలని సూచించింది. శుక్రవారం మరో...

‘విజయ – శాంతి’ వివాదంపై సజ్జల మౌనం దేనికి సంకేతం.?

అధికారిణి శాంతి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య ఏదో సంబంధం వుందంటూ, శాంతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే. ఓ...

అయినా గులాబీ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతోందే.!

ఎక్కడ తేడా కొడుతోందో గులాబీ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోలేకపోతోంది.! కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఏమైపోయాయ్.? కేటీయార్ వాక్ చాతుర్యం ఎక్కడికి పోయింది.? అసలంటూ గులాబీ పార్టీ నాయకులకు అధినాయకత్వం నుంచి సరైన...

పవన్ కళ్యాణ్ మీద కార్టూన్: ‘పచ్చ’ బుద్ధి బయటపెట్టుకున్న ఆర్కే.!

టీడీపీ అను‘కుల’ మీడియాలో ఏబీఎన్ ఆర్కేని పెద్ద ముత్తైదువగా పేర్కొంటుంటారు.! కుల జాడ్యం నరనరానా జీర్ణించుకుపోయిన వ్యక్తిగా ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణకి మీడియా, రాజకీయ వర్గాల్లో ఓ ఘనమైన పేరు ప్రఖ్యాతులున్నాయ్....

ఎక్కువ చదివినవి

Mount Everest: ఎవరెస్ట్ పర్వత శిఖరం డ్రోన్ వీడియో వైరల్.. అద్భుతం ఆ అందాలు..

Mount Everest: ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ (Everest mountain) అనే విషయం తెలిసిందే. సముద్ర మట్టానికి 3,500 మీటర్లో ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ ను ఏటా వేలల్లో పర్వతారోహకులు అధిరోహిస్తున్నారు....

పార్టీ బలోపేతంపై జనసేనాని స్పెషల్ ఫోకస్.!

100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడంతో ఏకంగా భారత రాజకీయాల్లోనే పొలిటికల్ పవర్ స్టార్ అనిపించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్, పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా...

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు

ఏపీ లో దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది....

పంచె కట్టుకుని మాల్ లోకి వచ్చాడని.. బెంగళూరులో అమానవీయ ఘటన

పంచె కట్టుకున్నాడన్న కారణంతో ఓ రైతును మాల్ లోకి రానీయకుండా అడ్డుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన నటరాజ...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 17 జూలై 2024

పంచాంగం తేదీ 17- 07- 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:38 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు తిథి: శుక్ల ఏకాదశి సా....