Switch to English

మంత్రుల బస్సు యాత్ర.! ఏపీ రోడ్ల మీదేనా.?

‘సామాజిక న్యాయ భేరి’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ మంత్రులట) బస్సు యాత్ర చేయబోతున్నారు. ఎవరైనా బస్సు యాత్రలో, పాదయాత్రలో చేయొచ్చు. ఇందులో ఎవర్నీ తప్పు పట్టడానికి వీల్లేదు. కాకపోతే, ఆ బస్సు యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల మీదనే కొనసాగుతుందా.? అన్నదే చాలామందికి డౌట్.!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి ఎలా వుందో మొన్న వైసీపీకి అత్యంత సన్నహితంగా వుంటోన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు వివరించారు. అంతేనా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘రాజ గురువు’ లాంటి త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీజీ కూడా సెలవిచ్చారు.

అయినా, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి గురించి ఎవరో వచ్చి చెప్పాలా.? ఆ రోడ్ల మీద నిత్య నరకం అనుభవిస్తున్న రాష్ట్ర ప్రజలకు తెలియదా.? వర్షాలు గట్టిగా కురిశాయ్ కాబట్టి, రోడ్లు పాడయ్యాయ్.. వీలైనంత త్వరగా రోడ్లు బాగు చేసేస్తాం.. అని దాదాపు రెండేళ్ళ నుంచీ ఒకే పాట పాడుతోంది అధికార వైసీపీ.

ఇంతకీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు ఎలా వున్నాయ్.? ఏమో, కొంత మెరుగుపడి వుండొచ్చు. లేదా, కాస్త మెరుగు పడిన రోడ్ల మీదనే మంత్రులు బస్సు యాత్రకు ఉపక్రమించి వుండొచ్చు. సామాన్యులేమైపోయినా ఫర్లేదు.. పాలకులకి. ఎందుకంటే, కీలక పదవుల్లో వున్నోళ్ళు రోడ్ల మీద తిరగడం అరుదు.. గాల్లోనే చక్కర్లు కొట్టేస్తుంటారు ఎక్కువగా.!

లేదంటే, ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే, రాత్రికి రాత్రి ఆ కాస్త మేర రోడ్లు బాగైపోతుంటాయ్. అదే విపక్షాలకు చెందిన నేతలెవరైనా ప్రజల వద్దకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటే, రోడ్ల మరమ్మత్తులంటూ రాత్రికి రాత్రి రోడ్లు తవ్వేసే కార్యక్రమాలూ వుంటాయ్.

కాస్త మెరుగ్గా వున్న రోడ్ల మీద తమ బస్సు యాత్ర సాగేలా, మంత్రులు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకునే వుంటారు. అందుకే, అంత ధైర్యంగా ‘మేం ప్రజల వద్దకు వెళుతున్నాం..’ అని మంత్రులు చెప్పుకోగలుగుతున్నారు. లేదంటే, అంతే సంగతులు.! ఓ నెల రోజులపాటు ఏకధాటిగా ఆంధ్రప్రదేశ్ అంతటా, రాష్ట్రంలోని అన్ని రోడ్ల మీదా మంత్రుల బస్సు యాత్ర సాగితే బావుంటుందేమో.! అప్పుడన్నా రోడ్లు బాగు పడతాయ్.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీతో.. ‘అం అః’ సినిమా..! ట్రైలర్ విడుదల

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా శ్యామ్ మండల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అం అః'. (ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్లర్) ట్యాగ్‌లైన్‌. రంగ‌స్థలం మూవీ...

లైగర్ ‘పీకే’ పోస్టర్‌ తో పబ్లిసిటీ పీక్స్‌

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. షూటింగ్ ముగిసి నెలలు గడుస్తోంది....

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం...

దిల్ రాజు ప్లాన్ తో ఆ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళం

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు సినిమా ల రిలీజ్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా...

మేజర్‌ కు అక్కడ కూడా బ్రహ్మరథం

అడవి శేష్‌ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్‌ సినిమా విడుదల అయిన ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది....

రాజకీయం

మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో నిరసన..! పలువురి అరెస్టు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు....

‘వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే..’ అల్లూరి జయంతి వేడుకల్లో కేటీఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై...

ఫాఫం రఘురామ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా,...

యావత్ భారతావని తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు...

అల్లూరి చుట్టూ రాజకీయం.! ఇదా ఆయనకిచ్చే గౌరవం.?

ఓ సినీ కవి, మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా నడి రోడ్డు మీదా.. కరెన్సీ నోటు మీదా.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..’ అంటాడు. మహనీయుల్ని మనం ఎలా చూస్తున్నాం.? అన్న విషయమై...

ఎక్కువ చదివినవి

రాబోయే 30-40 ఏళ్లు దేశంలో బీజేపీ హవా

హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి.. బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రాబోయే రోజుల్లో విశ్వ...

ల్యాప్‌టాప్ ఔట్.! ట్యాబ్ ఇన్.! జగనన్న ‘కోత’ల పథకం.!

ఒక్క రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు.. అన్నారు. ఒకటీ లేదు, మూడే లేదు. మొత్తంగా ఇప్పుడు అయోమయం.! అమ్మ ఒడి అన్నారు.. దాంట్లో భాగంగా కోరినవారికి ల్యాప్‌టాప్ అన్నారు. అదిప్పుడు మాయమై,...

సలార్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 లింక్ ఉంటుందా?

ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ ఫ్రాంచైజ్ తో రెండు బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఈ రెండు సినిమాలతో ప్రశాంత్ నీల్ ఫేమ్ ఆకాశాన్ని తాకే రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న...

నన్ను టార్గెట్ చేస్తున్నారు.. న్యాయ పోరాటం చేస్తా: ఏబీ వెంకటేశ్వరరావు

ఒకసారి ఒక అంశాన్ని హైకోర్టు కొట్టేసినప్పుదు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. గతంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే...

విజయమ్మ వైసీపీకి రాజీనామా చేశారని చెబితే అరెస్ట్ చేస్తారా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు రాజీనామా చేసినట్లుగా ఓ ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా టీడీపీ మద్దతుదారుడైన గార్లపాటి వెంకటేశ్వరరావు చేశారట. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు...