ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. దేశం నలుమూలల నుంచి ప్రయాగ రాజ్ చేరుకుని అక్కడ కుంభమేళాలా పాల్గొంటున్నారు. ఐతే నేడు మహా కుంభమేళాకు ఏపీ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ వెళ్తున్నారు.
ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేష్ ప్రయాగ్ లో షాహి స్నాన ఘట్టానికి చేరుకుంటారని తెలుస్తుంది. 10:10 గంటల నుంచి 12:10 గంటల మధ్య మహా కుంభమేళా షాహి స్నాన ఘట్టంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:00 గంటకు అక్కడ నుంచి వారణాసికి వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 2:25 గంటలకు వాణాసిలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 3:40 గంటలకు వారణాసిలోనే కాశీ విశ్వేశర ఆలయంలో దర్శనం చేసుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంటారని తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకు విశాలాక్షి మాత ఆలయం సందర్శిస్తారు. అన్ని పనులు ముగించుకుని సాయంత్రం 5:25 గంటలకు వారణాసి నుంచి విజయవాడ తిరుగు ప్రయణం అవుతారు. నారా లోకేష్ మహా కుంభమేళాతో పాటుగా వారణాసి వెళ్లేందుకు కావాల్సిన భారీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.