ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని శాసనమండలిలో ఆధిక్యం ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో అధికార పార్టీ ప్రతి వ్యూహం సిద్ధం చేసుకుంది. తమ మాట నెగ్గకుంటే ఏకంగా మండలినే రద్దు చేయాలని వైఎస్సార్ సీపీ యోచిస్తోందంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. గతంలో ఎన్టీఆర్ ప్రయోగించిన ఈ అస్త్రాన్నే ఇప్పుడు వైసీపీ కూడా ప్రయోగించాలని భావిస్తోందంటూ వార్తలొచ్చాయి.
1985లో శాసనమండలిలో కాంగ్రెస్ కు 48 మంది సభ్యులున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక్క సభ్యుడూ లేరు. ఈ నేపథ్యంలో 1985 ఏప్రిల్ 30న మండలిని రద్దు చేస్తున్నట్టుగా శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం కోసం పార్లమెంటుకు పంపించారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత అదే ఏడాది జూన్ 1న ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు. అంటే కేవలం నెల రోజుల్లోనే మండలి రద్దుకు సంబంధించి ప్రక్రియ పూర్తయిపోయింది.
అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. మండలి రద్దు వల్ల తమ పార్టీ నేతలకే నష్టం అని తెలిసినా, అసెంబ్లీ తీర్మానానికి గౌరవం ఇచ్చి మండలి రద్దుకు పార్లమెంటులో ఆమోదం తెలిపింది. అప్పుడు ఎన్టీఆర్ కు ఎదురైన అనుభవమే ఇప్పుడు జగన్ కు ఎదురైంది. మండలిలో టీడీపీ సభ్యులు ఎక్కువగా ఉండటంతో శాసనసభ ఆమోదించిన బిల్లును అడ్డుకునే అవకాశం ఆ పార్టీకి లభిస్తోంది. ఈ తలనొప్పి ఉండకూడదంటే మండలి రద్దే బెటరని అధికార పార్టీ యోచనగా కనిపిస్తోంది.
అయితే, ఇందుకు కేంద్రం సహకారం కూడా కావాలి. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించాలి. ఈ విషయంలో బీజేపీ వైఖరిపైనే మండలి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ, మండలిని రద్దు చేస్తారనే ప్రచారం చేయించడం ద్వారా టీడీపీ ఎమ్మెల్సీల్లో ఆందోళన సృష్టించాలని, తద్వారా వారిని తమ దారికి తెచ్చుకోవాలన్నది అధికార పార్టీ వ్యూహమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మాకు సహకరిస్తారా.. లేక మొత్తం పదవినే కోల్పోతారా? అని వారిని భయపెట్టడం ద్వారా బిల్లుకు అనుకూలంగా వ్యవహరించేలా చేసుకోవడమే వైసీపీ లక్ష్యమని చెబుతున్నారు. మండలి రద్దు ప్రక్రియ కాస్త సమయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ అధికార పార్టీ అన్వేషిస్తోంది. ఈ విషయంలో బుధవారం జరిగే పరిణామాలతో స్పష్టత రానుంది.
402379 750004This internet website is my breathing in, truly excellent layout and perfect content material . 936966
489756 167495An intriguing discussion is worth comment. I do feel which you really should write read more about this subject, it will not be considered a taboo subject but usually every person is too few to communicate in on such topics. To an additional. Cheers 676194