Switch to English

ఈ విషయంలో వైఎస్‌ జగన్‌ని అభినందించాల్సిందే..

ధనిక రాష్ట్రం తెలంగాణ, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కానీ, పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రం, ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. కష్ట కాలంలో, మరింత ఉత్సాహంగా పనిచేస్తోన్న ఉద్యోగులకు ఏమాత్రం జీతాల్లో కోత విధించకూడదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, జీతం మొత్తం ఒకే దఫాలో కాకుండా, రెండు దఫాల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. ఈ విషయమై ముఖ్యమంత్రి నుంచి తమకు సమాచారం అందిందని ఏపీ ఉద్యోగులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ దెబ్బకి ప్రపంచం విలవిల్లాడుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా, ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయింది. మద్యం అమ్మకాల్లేవు.. పెట్రోలు – డీజిల్‌ అమ్మకాల్లేవు.. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా పరిస్థితేంటి.? అసలే, నిండా అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రం. విభజన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం. సాధారణ పరిస్థితుల్లోనే ఉద్యోగులకు జీతాల కోసం ఆంధ్రప్రదేశ్‌ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోంటోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా వున్నా, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనకి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

నిజానికి, కొన్ని రాష్ట్రాలు ఉద్యోగులకు.. అందునా, వైద్య రంగం సహా పలు కీలక రంగాల్లోని ఉద్యోగులకు అదనపు వేతనాలు చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. అయితే, తమ తమ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ బాటలో నడుస్తూ, ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్న ప్రభుత్వాలూ లేకపోలేదు. మిగతా రాష్ట్రాల సంగతెలా వున్నా, తెలంగాణలో జీతాల కోతపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన వెంటనే ఆందోళనకు గురైన ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఊరటనివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమే.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

‘పింజ్రాతోడ్‌’ యువతుల అరెస్ట్‌

గృహ హింసకు గురి అవుతున్న బాలికలను రక్షించి స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్న హోంకు తరలిస్తూ అందరి ధృష్టిని ఆకర్షించిన పింజ్రాతోడ్‌ సంస్థ నిర్వాహకులు అయిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేయడం ప్రస్తుతం...

క్రైమ్ న్యూస్: ప్రియుడిని చంపి తాను చావాలనుకుంది

గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుని సహజీవనం సాగిస్తున్న పవన్‌ కుమార్‌, నాగలక్ష్మి మద్య పెళ్లి వివాదంను రాజేసింది. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుండటంతో పవన్‌ కుమార్‌ ఆమెకు దూరంగా ఉంటున్నాడు....

జస్ట్‌ ఆస్కింగ్‌: టీటీడీ శ్వేతపత్రంలో ‘పింక్‌’ డైమండ్‌ వుంటుందా.?

పింక్‌ డైమండ్‌.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించి భక్తులు సమర్పించుకున్న అతి విలువైన వాటిల్లో ఇదీ ఒకటంటూ గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ప్రచారం మాత్రమే కాదు, దీని చుట్టూ జరిగిన...

నిమ్మగడ్డ ఎపిసోడ్‌: జనసేనకి వెరీ స్పెషల్‌.. ఎందుకంటే.!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించే క్రమంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘ఎన్నికల సంస్కరణల’ పేరిట ఆర్డినెన్స్‌ తీసుకురావడం, ఈ క్రమంలో పెద్దయెత్తున దుమారం చెలరేగడం తెల్సిన విషయమే. తాజాగా...

టీడీపీ మహానాడు.. కొత్త నాయకత్వమే దిక్కు.!

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందా.? ఈ ప్రశ్న ఇప్పుడు మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తోంది. నిజానికి, 2014 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తన ఉనికిని దాదాపుగా కోల్పోయింది. అయితే,...