సీఎం జగన్‌ నిర్ణయాలపై అధికారుల పెదవి విరుపులు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,669FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అధికార యంత్రాంగం నుంచి ముందు ముందు సహాయ నిరాకరణ తప్పదా.? పరిస్థితి మరీ అంత వరకూ వెళ్ళకపోవచ్చుగానీ, జగన్‌ తీసుకునే అన్ని నిర్ణయాల్నీ అధికారులు సమర్థించే పరిస్థితి మాత్రం వుండకపోవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి అవుతూనే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి తన వేవ్‌ లెంగ్త్‌కి మ్యాచ్‌ అయ్యే అధికారుల్ని కీలకమైన విభాగాల కోసం ఎంచుకున్నారు.

మాజీ ఐఏఎస్‌ అధికారుల్ని సలహాదారులుగా నియమించుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని సమర్థవంతంగా అమలు చేసేందుకోసం టీమ్‌ని పెర్‌ఫెక్ట్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఇకనేం, ఆల్‌ ఈజ్‌ వెల్‌ అని వైసీపీ శ్రేణులు భావించాయి. అయితే, వంద రోజుల పాలన ముగిసేసరికి, అధికారులకీ ముఖ్యమంత్రికీ గ్యాప్‌ వచ్చేసిందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు షురూ అయ్యాయి. ప్రభుత్వానికి సంబంధించి అంతర్గత వివరాలు లీక్‌ అవడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. ప్రధానంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి విషయాలపై అధికారులు, ముఖ్యమంత్రి నిర్ణయాలతో విభేదిస్తున్నారట.

Also Read: టీడీపీ ట్రెండింగ్‌: వైఎస్‌ జగన్‌ ‘ఫెయిల్డ్‌ సీఎం’

కొన్ని విభాగాలకు సంబంధించి ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా జవాబుదారీగా వ్యవహరించాల్సి వస్తుంది. ఇక్కడే వ్యవహారం తేడా కొడుతోంది. పోలవరం విషయమై కేంద్రం అడుగుతున్న వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందించలేకపోతున్నారట. ‘ముఖ్యమంత్రి ఆలోచనలు కేంద్రం ఆలోచనలకు పూర్తి భిన్నంగా వున్నాయి. ఈ పరిస్థితి రాష్ట్రానికి అస్సలేమాత్రం మంచిది కాదు.’ అంటూ ఓ సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారంటూ మీడియాలో కథలు గుప్పుమంటోన్న విషయం విదితమే.

ఇదొక్కటే కాదు, రాష్ట్ర పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా సంక్షేమ పథకాల్ని కుప్పలు తెప్పలుగా తీసుకొస్తే ఎలా.? అని మరో సీనియర్‌ అధికారి తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారనే వాదన బయటకొచ్చింది. పవర్‌ కొనుగోళ్ళ ఒప్పందాల వ్యవహారంపైనా అధికారులకీ, రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య సఖ్యత కన్పించడంలేదట. అయితే, ఇదంతా ప్రభుత్వమ్మీద జరుగుతున్న దుష్ప్రచారమేనని అధికార పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నారు. మరోపక్క 100 రోజుల పాలనకే పరిస్థితి ఇలా తయారైతే, తొలి ఏడాదిని ముఖ్యమంత్రి ఎలా పూర్తి చేస్తారు.? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు.

4 COMMENTS

సినిమా

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి...

Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని...

రాజకీయం

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

పైకి సింగిల్‌ సింహం… లోపల డబుల్‌ గేమ్‌?

రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్‌గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi-Suhasini: మణిరత్నం సినిమాలో ఆ సన్నివేశానికి చిరంజీవే స్ఫూర్తి: సుహాసిని

Chiranjeevi-Suhasini: తెలుగులో అత్యధిక సినిమాల శతదినోత్సవాలు జరిపిన హీరోగా మెగాస్టార్ చిరంజీవిదే రికార్డు. విజేత మొదలు ఎన్నో సినిమాలకు ఆయన అనేక పట్టణాలు, నగరాల్లో తన సక్సెస్ సినిమాలకు శతదినోత్సవాలు జరిపారు. గ్యాంగ్...

”వంద ఇస్తామని పిలిచారు.. వచ్చాం”: చావుల వద్ద కూడా తరలింపా?!

రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. వంద నుంచి రెండు వేల రూపాయల దాకా ఒక్కో మనిషి మీదా ఖర్చు చేస్తే తప్ప, రాజకీయాలు చేయలేని దుస్థితి. ఇంకెవరూ రాజకీయం చేయడం లేదా.? వైఎస్ జగన్...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’ చర్చ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. విద్యార్థుల ప్రోత్సాహం కోసం నిర్వహించిన ఈ...

గోదావరిలో అసలు ఏం జరుగుతోంది?.. అధికారులపై పవన్ ఆగ్రహం

పవిత్ర గోదావరి నది కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నీటిలో ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు ఉన్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ల్యాబ్ నివేదికలో...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...