Switch to English

ఏపీ ఉద్యోగులు లెంపలేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, ప్రభుత్వ ఉద్యోగులకీ మధ్య ‘జీతాల రగడ’ తారాస్థాయికి చేరింది. ‘గొప్ప పీఆర్సీ ఇచ్చేశాం..’ అని జగన్ సర్కారు చెప్పుకుంటోంది. కానీ, ‘ఆ పీఆర్సీపై ఇచ్చిన జీవో వద్దే వద్దు’ అంటున్నారు ఉద్యోగులు. పీఆర్సీ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైనప్పుడు, ‘సానుకూల ఫలితం’ వచ్చిందనే ప్రచారం జరిగింది.

అయితే, ‘ఇదెక్కడి పీఆర్సీ.? దీనికి ఉద్యోగ సంఘాలెలా హర్షం వ్యక్తం చేశాయి.?’ అన్న చర్చ ఉద్యోగుల్లోనూ, విపక్షాలకు చెందిన నేతల్లోనూ, సాధారణ ప్రజానీకంలోనూ జరిగింది. మబ్బులు విడిపోయాయ్. ఉద్యోగ సంఘాల నేతల కళ్ళు కూడా తెరచుకున్నాయ్. జరిగిన నష్టం, జరగబోతున్న నష్టమేంటో అర్థమయ్యింది. అంతే, మళ్ళీ జగన్ సర్కారు మీద పోరుబాట ప్రకటించేశారు.

ఇక్కడ వైసీపీ అధినాయకత్వం రచించిన వ్యూహం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఉద్యోగ సంఘాల నేతల్ని తొలుత మభ్యపెట్టడం, వారిని ఒప్పించడం.. చివరికి వారిని ఉద్యోగుల దృష్టిలో బదనాం చేయడం.. ఈ వ్యూహం ఓ పద్ధతి ప్రకారం నడిచింది. అలా ఉద్యోగ సంఘాల నేతలు నవ్వులపాలైపోయారు. ఉద్యోగులు చివరికి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

‘తప్పు చేశాం.. వైసీపీకి అధికారం రావడంలో మేం చేసిన తప్పు అంతా ఇంతా కాదు..’ అంటూ ఉద్యోగులు లెంపలేసుకునే పరిస్థితి వచ్చింది. ఇటీవల కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్కడే, ఉపాధ్యాయులు ‘లెంపలేసుకుని’ నిరసన తెలిపారు, ప్రభుత్వ తీరుపై. ‘కర్మ ఈజ్ బ్యాక్’ అంటే ఇదేనేమో.!

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని ఓ వైపు చెబుతున్నారు.. అబ్బే, ఆర్థిక ఇబ్బందులున్నాయంటున్నారు. ప్రభుత్వం తరఫున వస్తున్న ప్రకటనలు, కాగ్ లెక్కలు, వైసీపీ చేసుకుంటున్న ప్రచారం.. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా సాగుతోంది.

అయినా, సలహాదారుల కోసం, తమ ప్రచారం కోసం, తమ అనుకూల మీడియాని పెంచి పోషించడం కోసం వెచ్చిస్తోన్న ఖర్చుల్ని తగ్గించుకోరుగానీ, ఉద్యోగుల విషయంలో ఎందుకీ పీనాసితనం.? పైగా, దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఏపీలోనే ఉద్యోగులకు ఎక్కువ చెల్లింపులంటూ కొత్త నాటకానికి తెరలేపడమెందుకు.? ఇదే ఉద్యోగుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. అందుకే, ఉద్యోగులు లెంపలేసుకుంటున్నారు.. తాము చేసిన తప్పులకు చింతిస్తూ.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సన్నాఫ్‌ ఇండియా మళ్లీ వచ్చేశాడు… చూస్తారా?

మంచు ఫ్యామిలీ ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వారు వార్తల్లో నిలిచిన ప్రతి సారి సోషల్‌ మీడియాలో వారిపై జోకులు.. మీమ్స్...

బాలయ్య సినిమాలో మాస్ ఖిలాడీ ఐటెం సాంగ్‌

అఖండ సినిమాతో సక్సెస్‌ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా...

శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు...

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది....

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి...

రాజకీయం

గెలిచిన ఏబీవీ.! వీగిపోయిన వైసీపీ అహం.!

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనీయర్ ఐపీఎస్ అధికారి మీద వైసీపీ అధికారంలోకి వస్తూనే సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, ఏకంగా...

సీట్లు ఇచ్చినంత మాత్రాన వైకాపాను బీసీలు నమ్మేనా?

వైకాపా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు ఇచ్చామని.. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తూ వారికి గౌరవంను గుర్తింపును ఇవ్వడంతో పాటు వారి...

పార్టీలన్నీ బీజేపీ అనుబంధ పార్టీలే : పాల్‌

గత ఎన్నికల్లో ఏపీలో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ ఈసారి తెలంగాణలో హడావుడి చేస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో...

ఏపీ రాజ్యసభకి తెలంగాణ రంగు: ఆ ఇద్దరూ ఏపీ తరఫున నిలబడతారా.?

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు...

సోది ఆపండి.! ప్రజలు పారిపోతున్నారు ముఖ్యమంత్రిగారూ.!

డబ్బులిచ్చి జనాన్ని తీసుకొస్తే మాత్రం, నాయకులు చెప్పే పనికిమాలిన సోది వింటూ కూర్చుంటారా.? ఛాన్సే లేదు. గతంలో చాలామంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిథులు, కీలక పదవుల్లో వున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే...

ఎక్కువ చదివినవి

విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు..! కోస్తా, రాయలసీమలో వర్షాలు

దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రాబోయే రెండు రోజుల్లో మరింతగా విస్తరించి దక్షిణ బంగాళాఖాతంతోపాటు అండమాన్ సముద్రం, దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు...

రాశి ఫలాలు: ఆదివారం 15 మే 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ.5:33 సూర్యాస్తమయం: సా.6:15 తిథి: వైశాఖ శుద్ధ చతుర్దశి మ.12:21 వరకు తదుపరి వైశాఖ శుద్ధ పౌర్ణమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: స్వాతి మ.3:10 వరకు...

రాశి ఫలాలు: శుక్రవారం 13 మే 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ.5:36 సూర్యాస్తమయం: సా.6:22 తిథి: వైశాఖ శుద్ధ ద్వాదశి మ.2:34 వరకు తదుపరి వైశాఖ శుద్ధ త్రయోదశి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: హస్త సా.4:25 వరకు...

సీట్లు ఇచ్చినంత మాత్రాన వైకాపాను బీసీలు నమ్మేనా?

వైకాపా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు ఇచ్చామని.. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తూ వారికి గౌరవంను గుర్తింపును ఇవ్వడంతో పాటు వారి...

‘దత్త పుత్రుడి’ ఎఫెక్ట్: వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమేనా.?

ముఖ్యమంత్రిగా వున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, భారతీయ జనతా పార్టీతో నాలుగేళ్ళు అంటకాగి, అదే పార్టీ మీద ఆ తర్వాత విమర్శలు చేసిన విషయం విదితమే. బీజేపీని, తెలంగాణ రాష్ట్ర సమితిని...