AP Government: వైసీపీకి డేంజర్‌ బెల్స్‌..! IPS సునీల్‌పై వేటుతో గుబులు మొదలు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,682FansLike
57,764FollowersFollow

AP Government: పది రోజులుగా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయా..? వైసీపీ నేతల అరెస్టుతో రాజీకీయాలు మారుతున్నాయా..? మరింత మంది పేర్లు చట్టం లిస్టులో చేరబోతున్నాయా..? గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష టీడీపీ నేతలపై తిట్ల వర్షం కురిపించిన నేతల గుండెల్లో గుబులు మొదలైందా..? నాటి ప్రభుత్వ హయాంలో పెద్దల అండతో రెచ్చిపోయిన అధికారుల్లో కూడా వణుకు మొదలవుతోందా..? మొత్తంగా మంత్రి లోకేష్‌ రెడ్‌ బుక్‌ ఓపెన్‌ అవుతోందా..?? మొన్న వల్లభనేని, నిన్న పోసాని అరెస్టు.. నేడు సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్ తో కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచిందా..??? ప్రస్తుత పరిస్థితులు ఔననే సమాధానం ఇస్తున్నాయి.

అధికారంలో ఉన్నామనే ధైర్యంతో నోరుపారేసుకున్న వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి.. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలు నిర్ధారణ కావడంతో సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్.. అటు రాజకీయ నేతలు, ఇటు అధికారులు పూర్తిగా ఇరకాటంలో పడ్డారు. సునీల్ కుమార్ అప్పట్లో యూఏఈ పర్యటనకు వెళ్లొస్తానని అనుమతలు తీసుకుని, తర్వాత ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వివిధ దేశాలలో పర్యటించారు. ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమే కావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వల్లభనేని, పోసాని నోరుపారేసుకున్న తీరు, వారి మాటలు అందరికీ తెలిసిందే. అవి రాసుకుంటూ పోతే మరో బుక్ అవుతుందనేది నిజం. అయితే.. సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్ కు కారణాలను పరిశీలిస్తే..

  • 2024 ఫిబ్రవరి.. జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని.. దుబాయ్ లో పర్యటించారు సునీల్ కుమార్.
  • 2023 సెప్టెంబర్ 2.. ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK 525 లో హైదరాబాద్ నుంచి స్వీడన్ వెళ్లి.. 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK 526లో హైదరాబాద్ తిరిగివచ్చారు.
  • 2023 ఫిబ్రవరి 1.. హైదరాబాద్ నుండి EK 525 విమానం లో దుబాయి మీదగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28న EK 524 విమానంలో అమెరికా నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్ తిరిగొచ్చారు.
  • డిసెంబర్ 14’ 2022.. నుంచి జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని డిసెంబర్ 19, 2022 వరకు దుబాయిలో పర్యటించారు.
  • 2021 అక్టోబర్ 2.. EK525 విమానంలో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లి 10,అక్టోబర్ న EK524 విమానంలో హైదరాబాద్ వచ్చారు.
  • 21 డిసెంబర్ 2019.. నుంచి 4 జనవరి 2020 వరకు అమెరికాలో పర్యటనకు అనుమతి తీసుకుని యూకేలో పర్యటించారు.

పైన పేర్కొన్న అంశాల్లో అనుమతులు తీసుకోనివి.. ఒకచోటికి అనుమతి తీసుకుని వేరుచోటికి వెళ్లారు సునీల్ కుమార్. ఇవన్నీ ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించినవే కావడం.. అవి రుజువు కావడంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కాకుండా.. ఇటీవల ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి వ్యతిరేంగా మాల సామాజిక వర్గం నేతలు ఒంగోలులో నిర్వహించిన సభకు సునీల్‌ కుమార్‌ హాజరై సభలో ప్రసంగించారు సునీల్ కుమార్. ఎస్సీ విభజనకు ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, దానిపై పోరాటం చేయాలని.. శాసనసభను ముట్టడించాలని సూచించారు. దీనిపైనా ప్రభుత్వం త్వరలో విచారణ జరుపనుందని తెలుస్తోంది.

సినిమా

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

పోచమ్మ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన ఆహా

తెలుగు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ aha మరో కొత్త వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన “పోచమ్మ” సిరీస్‌కు సంబంధించిన...

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి హృదయాన్ని తాకే ‘సంచారమే’ పాట...

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ పాటను చిత్ర బృందం విడుదల...

‘మిరాకిల్’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్: హెబ్బా పటేల్

తెలుగు సినీ పరిశ్రమలో వినూత్న కథతో రూపొందుతున్న మిరాకిల్ సినిమా ఒక్కసారిగా ఆసక్తిని పెంచుతోంది. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ చిత్రాన్ని తన కెరీర్‌లో...

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

రాజకీయం

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

డోన్ సభలో ఫిర్యాదు.. వేదికపైనే అధికారులకు చంద్రబాబు వార్నింగ్

కర్నూలు జిల్లా డోన్‌లో జరిగిన బహిరంగ సభలో ఒక రైతు తన భూమి సమస్యను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమక్షంలోనే అధికారులను ప్రశ్నిస్తూ సమస్య...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

సభ్యత్వాల కోసం ‘సాధక్’లకు సహకరించండి: నాగబాబు పిలుపు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు పిలుపునిచ్చారు. సభ్యత్వాలు నమోదు చేసే ‘సాధక్’లకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు....

ఎక్కువ చదివినవి

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

అందరూ కూటమి ఎమ్మెల్యేలే.! చంద్రబాబు స్వీట్ వార్నింగ్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, చంద్రబాబు వ్యాఖ్యల్ని సంచలన ప్రకటనగా చూడాల్సి వుంటుంది. అదీ, కూటమి...

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్ చరణ్

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్ లా బ్లాస్ట్ అయింది. ప్రతిఒక్కరూ రామ్...

Gaddar Awards-2026: గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Gaddar Awards-2026: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2025లో విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్), ఉత్తమ దర్శకుడిగా సాయిలు...

సభ్యత్వాల కోసం ‘సాధక్’లకు సహకరించండి: నాగబాబు పిలుపు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు పిలుపునిచ్చారు. సభ్యత్వాలు నమోదు చేసే ‘సాధక్’లకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు....