Switch to English

AP Election Results-2024: ఏపీ ఎన్నికల ఫలితాలు – కూటమి ప్రభంజనం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,556FansLike
57,764FollowersFollow
Assembly(175/175) Loksabha (25/25)
LEAD WIN LEAD WIN
TDP 135 16
JANASENA 21 2
YSRCP 11 4
BJP 8 3

 

20.31 P.M: సత్తెనపల్లి అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ విజయం

20.12 P.M: పుట్టపర్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి పల్లె సింధూరా రెడ్డి విజయం

20.10 P.M: ఆత్మకూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి ఆనం రాంనారాయణ రెడ్డి విజయం

20.02 P.M: నరసాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్ధి బొమ్మిడి నాయకర్ విజయం

19.59 P.M: నరసారావుపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు విజయం

19.48 P.M: మాడుగుల అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి బండారు సత్యనారాయణ మూర్తి విజయం

19.47 P.M: రేపల్లె అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి అనగాని సత్య ప్రసాద్ విజయం

19.44 P.M: గుంటూరు పశ్చిమ అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి పిడుగురాళ్ల మాధవి విజయం

19.40 P.M: మంగళగిరి నుంచి నారా లోకేశ్ భారీ విజయం.. 91వేలకు పైగా మెజారిటీతో గెలుపు

19.37 P.M: యర్రగొండపాలెం అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధి తాటిపర్తి చంద్రశేఖర్ గెలుపు

19.35 P.M: పార్వతీపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి బోనెల విజయ్ చంద్ర గెలుపు

19.33 P.M: గూడురు అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి పాశం సునీల్ కుమార్ గెలుపు

19.32 P.M: జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ

19.30 P.M: నరసారావుపేట ఎంపీ టీడీపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం

19.28 P.M: నంద్యాల ఎంపీ టీడీపీ అభ్యర్ధి బైరెడ్డి శబరి విజయం

19.27 P.M: విజయవాడ ఎంపీ టీడీపీ అభ్యర్ధి కేశినేని చిన్ని ఘన విజయం

19.26 P.M: విజయనగరం ఎంపీ టీడీపీ అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడు విజయం

19.24 P.M: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జగన్

19.23 P.M: ఏలూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి బడేటి రాధాకృష్ణ విజయం

19.22 P.M: రాజోలు అసెంబ్లీ జనసేన అభ్యర్ధి దేవా వర ప్రసాద్ విజయం

19.21 P.M: ఆధిక్యంలో తిరుపతి ఎంపీ వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి

19.20 P.M: తాడిపత్రి అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి అస్మిత్ రెడ్డి గెలుపు

19.19 P.M: రాయదుర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి కాల్వ శ్రీనివాసులు గెలుపు

19.18 P.M: శ్రీశైలం అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్ రెడ్డి విజయం

19.16 P.M: నూజివీడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారధి విజయం

19.15 P.M: నరసన్నపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి బగ్గు రమణమూర్తి విజయం

19.14 P.M: ఒంగోలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనార్ధన్ రావు విజయం

19.13 P.M: మార్కాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి కందుల నారాయణ రెడ్డి విజయం

19.09 P.M: ఆధిక్యంలో చిత్తూరు ఎంపీ టీడీపీ అభ్యర్ధి దగ్గుమళ్ల ప్రసాదరావు

19.08 P.M: కావలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి విజయం

19.07 P.M: అనకాపల్లి ఎంపీ బీజేపీ అభ్యర్ధి సీ.ఎం.రమేశ్ విజయం

19.06 P.M: భీమిలీ టీడీపీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు విజయం

19.04 P.M: అనపర్తి ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం

19.03 P.M: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్ధి నంద్యాల వరదరాజులు రెడ్డి విజయం

18.55 P.M: ఏలూరు ఎంపీ టీడీపీ అభ్యర్ధి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ కు ఆధిక్యం

18.52 P.M: పోలవరం అసెంబ్లీ జనసేన అభ్యర్ధి చిర్రి బాలరాజు విజయం

18.50 P.M: యలమంచిలి అసెంబ్లీ జనసేన అభ్యర్ధి సుందరపు విజయ్ కుమార్ విజయం

18.48 P.M: పాడేరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధి మత్స్యరాస విశ్వేశ్వర రాజు విజయం

18.46 P.M: కోవూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజయం

18.45 P.M: దెందులూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్ విజయం

18.43 P.M: బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్ధి టి.కృష్ణప్రసాద్ గెలుపు

18.42 P.M: అద్దంకి టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధి గొట్టిపాటి రవికుమార్ గెలుపు

18.41 P.M: అరకు వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధి రేగం మత్స్య లింగం గెలుపు

18.40 P.M: పర్చూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు గెలుపు

18.38 P.M: పాణ్యం అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధి గౌరు చరితా రెడ్డి గెలుపు

18.37 P.M: కుప్పం అసెంబ్లీ టీడీపీఅభ్యర్ధి చంద్రబాబునాయుడు గెలుపు

18.36 P.M: విశాఖపట్నం ఎంపీ టీడీపీ అభ్యర్ధి ఎం.భరత్ గెలుపు

18.35 P.M: నందికొట్కూరు అభ్యర్ధి టీడీపీ గిత్తా జయసూర్య గెలుపు

18.34 P.M: ఆధిక్యంలో పుంగనూరు వైసీపీ అభ్యర్ధి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

18.33 P.M: కొవ్వూరు టీడీపీ అభ్యర్ధి ముప్పిడి వెంకటేశ్వర రావు విజయం

18.31 P.M: చింతలపూడి టీడీపీ అభ్యర్ధి సొంగా రోషన్ కుమార్ విజయం

18.29 P.M: విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్ధి వంశీకృష్ణ యాదవ్ విజయం

18.28 P.M: తాడికొండ టీడీపీ అభ్యర్ధి తెనాలి శ్రావణ్ కుమార్ విజయం

18.27 P.M: గురజాల టీడీపీ అభ్యర్ధి యరపతినేని శ్రీనివాస్ విజయం

18.26 P.M: సంతనూతలపాడు టీడీపీ అభ్యర్ధి బి.ఎన్.విజయ్ కుమార్ విజయం

18.25 P.M: తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్ విజయం

18.21 P.M: తుని టీడీపీ అభ్యర్ధి యనమల దివ్య విజయం

18.20 P.M: జగ్గంపేట టీడీపీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ విజయం

18.18 P.M: బనగానపల్లె టీడీపీ అభ్యర్ధి బీ.సీ.జనార్ధన రెడ్డి విజయం

18.17 P.M: రాప్తాడు టీడీపీ అభ్యర్ధి పరిటాల సునీత విజయం

18.16 P.M: శింగనమల టీడీపీ అభ్యర్ధి బండారు శ్రావణి శ్రీ విజయం

18.13 P.M: మదనపల్లి టీడీపీ అభ్యర్ధి షాజహాన్ భాషా విజయం

18.10 P.M: మార్కాపురం టీడీపీ అభ్యర్ధి కందుల నారాయణ రెడ్డి విజయం

18.09 P.M: పలమనేరు టీడీపీ అభ్యర్ధి ఎన్. అమర్నాధ్ రెడ్డి విజయం

18.08 P.M: కొండపి టీడీపీ అభ్యర్ధి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి విజయం

18.06 P.M: పెడన టీడీపీ అభ్యర్ధి కాగిత కృష్ణ ప్రసాద్ విజయం

18.05 P.M: ఆధిక్యంలో అరకు వైసీపీ అభ్యర్ధి గుమ్మా తనూజ రాణి

18.03 P.M: ఆంధ్రప్రదేశ్ లో ఖాతా తెరవని కాంగ్రెస్.. పని చేయని వైఎస్ షర్మిల ప్రయత్నాలు

18.02 P.M: కడప నుంచి టీడీపీ అభ్యర్ధి ఆర్.మాధవీ రెడ్డి విజయం

18.01 P.M: విశాఖ తూర్పు టీడీపీ అభ్యర్ధి వెలగపూడి రామకృష్ణబాబు విజయం

18.00 P.M: భీమిలి టీడీపీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావుకు ఆధిక్యం

17.59 P.M: గంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్ధి వీ.ఎమ్.థామస్ విజయం

17.58 P.M: ఆముదాలవలస నుంచి టీడీపీ అభ్యర్ధి కూన రవికుమార్ గెలుపు

17.57 P.M: చిలకలూరిపేట టీడీపీ అభ్యర్ధి పత్తిపాటి పుల్లారావు విజయం

17.56 P.M: జనసేనకు 100 శాతం స్ట్రైక్ రేట్

17.53 P.M: అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అఖండ విజయం.. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపు

17.52 P.M: చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం.. ఎన్డీయేతో భేటీలో పాల్గొనే అవకాశం

17.46 P.M: శృంగవరపు కోట టీడీపీ అభ్యర్ధి కోళ్ల లలిత కుమారి విజయం

17.45 P.M: నెల్లిమర్ల జనసేన అభ్యర్ధి లోకం నాగ మాధవి విజయం

17.44 P.M: సాలూరు టీడీపీ అభ్యర్ధి గుమ్మడి సంధ్యారాణి విజయం

17.41 P.M: బొబ్బిలి టీడీపీ అభ్యర్ధి బేబి నాయన విజయం

17.38 P.M: మడకశిర టీడీపీ అభ్యర్ధి ఎంఎస్ రాజు విజయం

17.35 P.M: పుంగనూరులో నిలిచిన కౌంటింగ్.. 4ఈవీఎంల సీల్ ఓపెన్.. అభ్యంతరం తెలిపిన టీడీపీ

17.32 P.M: మంగళగిరి పార్టీ ఆఫీసులో చంద్రబాబు.. అభిమానులు, కార్యకర్తల కోలాహలం

17.31 P.M: కడప లోక్ సభ వైసీపీ అభ్యర్ధి అవినాశ్ కు 65వేల మెజారిటీ

17.30 P.M: శ్రీకాకుళం లోక్ సభ టీడీపీ అభ్యర్ధి కె. రామ్మోహన్నాయుడు 3.06లక్షల ఓట్లతో గెలుపు

17.25 P.M: చోడవరంలో టీడీపీ అభ్యర్ధి కేఎస్ఎన్ రాజు విజయం

17.24 P.M: ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్ధి సత్యప్రభ విజయం

17.22 P.M: అమలాపురంలో టీడీపీ అభ్యర్ధి ఆనందరావు విజయం

17.18 P.M: అభిమానుల కోలాహలం మధ్య ఉండవల్లి నుంచి బయలుదేరిన చంద్రబాబు

17.15 P.M: పాయకరావుపేటలో టీడీపీ అభ్యర్ధి అనిత విజయం

17.02 P.M: పవన్ ను గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ది మ్యచ్ అంటుంటే గర్వంగా ఉందన్న చిరంజీవి

17.02 P.M: పవన్ ను గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ది మ్యచ్ అంటుంటే గర్వంగా ఉందన్న చిరంజీవి

16.34 P.M: పవన్ కల్యాణ్, చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

16.34 P.M: హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్.. మంగళగిరి పార్టీ ఆఫీస్ కు..

16.32 P.M: బాపట్లలో టీడీపీ అభ్యర్ధి నరేంద్ర వర్మ గెలుపు

16.31 P.M: విజయనగరంలో టీడీపీ అభ్యర్ధి పూసపాటి అదితి గజపతి రాజు గెలుపు

16.28 P.M: రాజాంలో టీడీపీ అభ్యర్ధి కోండ్రు మురళీ గెలుపు

16.27 P.M: పాలకొండలో జనసేన అభ్యర్ధి నిమ్మక జయకృష్ణ గెలుపు

16.25 P.M: 15వ రౌండ్ ముగిసేసరికి 70వేలకుపైగా మెజారిటీలో నారా లోకేశ్

16.23 P.M: చంద్రబాబు, పవన్ నివాసాల్లో సంబరాలు.. కుటుంబసభ్యులు, కార్యకర్తల ఆనందోత్సాహాలు

16.22 P.M: జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్ధి ఆదినారాయణ రెడ్డి గెలుపు

16.21 P.M: ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ విజయం

16.19 P.M: చీపురుపల్లిలో మంత్రి బొత్సపై టీడీపీ నేత కళా వెంకట్రావు విజయం

16.17 P.M: పూతలపట్టులో టీడీపీ అభ్యర్ధి మురళీ మోహన్ 14,948 ఓట్ల మెజారిటీతో గెలుపు

16.15 P.M: రాజంపేటలో వైసీపీ అభ్యర్ధి ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి విజయం

16.13 P.M: పెదకూరపాడులో టీడీపీ అభ్యర్ధి భాష్యం ప్రవీణ్ 21వేల మెజారిటీతో గెలుపు

16.08 P.M: మైదకూరులో టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపు

16.07 P.M: సీఎం జగన్ కు 61వేల మెజారిటీ.. 2019తో పోలిస్తే 28వేలు తగ్గిన జగన్ మెజారిటీ

16.03 P.M: సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ వైసీపీకి ఎదురుదెబ్బ

16.02 P.M: బందరులో పేర్ని నాని కుమారుడి ఓటమి

15.58 P.M: హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం

15.53 P.M: జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్ధి శ్రీరామ్ తాతయ్య విజయం

15.52 P.M: పులివెందులలో సీఎం జగన్ గెలుపు.. 61వేల మెజారిటీ

15.49 P.M: ఉరవకొండలో టీడీపీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్ గెలుపు

15.47 P.M: రాజానగరంలో జనసేన అభ్యర్ధి బత్తుల రామకృష్ణ విజయం

15.46 P.M: తణుకులో మంత్రి కారుమూరి దారుణ ఓటమి.. టీడీపీ అభ్యర్ధికి 71వేల మెజారిటీ ఓ రికార్డు

15.45 P.M: చంద్రబాబుకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు..

15.42 P.M: కురుపాం టీడీపీ అభ్యర్ధి జగదీశ్వరి గెలుపు

15.36 P.M: తిరువూరులో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు 21వేల మెజారిటీతో గెలుపు

15.33 P.M: పెద్దాపురంలో టీడీ అభ్యర్ధి చినరాజప్ప విజయం

15.31 P.M: ఓటమి దిశగా ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం

15.25 P.M: సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం

15.18 P.M: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంత, ప్రకాశం, శ్రీకాకుళం, తూ.గోదావరిలో టీడీపీ క్లీన్ స్వీప్

15.11 P.M: మైలవరంలో టీడీపీ అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్ విజయం

15.05 P.M: ఏలూరు జిల్లా దొరసానిపాడులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

14.57 P.M: 39ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీకి విజయం.. భారీ మెజారిటీ దిశగా నారా లోకేశ్

14.55 P.M: తణుకు టీడీపీ అభ్యర్ధి రాధాకృష్ణ విజయం

14.45 P.M: డోన్ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఓటమి.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుపు

14.42 P.M: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఘన విజయం.. గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ

14.38 P.M: కాసేపట్లో అమరావతికి జనసేన అధినేత పవన్ కల్యాణ్

14.35 P.M: పాలకొల్లులో నిమ్మల రామానాయుడు వరుసగా 3వసారి గెలుపు

14.23 P.M: తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్ధి బొలిశెట్టి శ్రీనివాస్ కు 66వేల మెజారిటీ

14.10 P.M: ఏలూరు లోక్ సభ టీడీపీ అభ్యర్ధి మహేశ్ కు 80వేల మెజారిటీ

14.06 P.M: మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్ధి బాలశౌరికి 90వేల మెజారిటీ

14.03 P.M: భీమవరంలో జనసేన అభ్యర్ధి రామాంజనేయులు విజయం

13.49 P.M: పిఠాపురంలో 11 రౌండ్లలో లెక్కింపు పూర్తి.. 50,651 ఓట్ల మెజారిటీలో పవన్ కల్యాణ్

13.41 P.M: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా

13.20 P.M: టీడీపీ ఎంపీ అభ్యర్దులు కొందరికి 1.50లక్షలకు పైగా మెజారిటీ..

13.06 P.M: ఈరోజు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేసే అవకాశం

12.57 P.M: పోటీ చేసిన 21 స్థానాల్లోనూ లీడింగ్ లోకి వచ్చేసిన జనసేన

12.47 P.M: 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీకి నేడు 14.. నాడు 1చోటే గెలిచిన జనసేనకు నేడు 20

12.31 P.M: నాలుగోసారి సీఎంగా చంద్రబాబు.. జూన్ 9న అమరావతిలో ప్రమాణ స్వీకారానికి అవకాశం

12.21 P.M: అఖండ విజయం నుంచి 5ఏళ్లలో అగాధంలో పడిపోయిన వైసీపీ గ్రాఫ్

12.10 P.M: వైసీపీకి ప్రతిపక్ష హోదా గల్లంతయ్యే అవకాశం..

12.01 P.M: టీడీపీకి 46శాతం ఓట్లు.. కూటమితో కలిపి దాదాపు 55శాతం ఓట్లు..

11.55 A.M: పిఠాపురంలో 8 రౌండ్లు పూర్తయ్యే సరికి పవన్ కల్యాణ్ కు 40వేల మెజారీటీ

11.46 A.M: శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్

11.35 A.M: తొలి గెలుపు.. రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరి 61వేల ఓట్లతో విజయం

11.29 A.M: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

11.22 A.M: రాజమండ్రి రూరల్ లో 50వేలకు పైగా మెజారిటీలో టీడీపీ అభ్యర్ధి బుచ్చయ్య చౌదరికి ..

11.16 A.M: ఉమ్మడి కృష్ణా, విజయనగరం జిల్లాల్లో స్వీప్ దిశగా కూటమి

11.08 A.M: డీలా పడిన వైసీపీ.. కౌంటింగ్ సెంటర్లను వీడుతున్న మంత్రులు

10.59 A.M: పాడేరు, అరకు మినహా 34 స్థానాలకు 32 చోట్ల కూటమి ఆధిక్యం

10.52 A.M: పొన్నూరులో టీడీపీ ధూళిపాళ్ల నరేంద్ర విజయం

10.43 A.M: ఓటమి దారిలో మెజారిటీ మంత్రులు

10.33 A.M: పలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ దిశగా కూటమి

10.28 A.M: రాయలసీమలో కూడా కూటమి జోరు

10.22 A.M: ఉత్తరాంధ్రలో కూటమి హవా

10.15 A.M: మంగళగిరిలో నారా లోకేశ్ ముందంజ

09.55 A.M: ప్రస్తుత ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి

09.50 A.M: నెల్లూరులో టీడీపీ అభ్యర్ధి నారాయణ ముందంజ

09.42 A.M: నగరిలో వైసీపీ అభ్యర్ధి రోజా వెనుకంజ

09.35 A.M: రాజమండ్రి అర్బన్ లో టీడీపీ అభ్యర్ధి ఆదిరెడ్డి వాసు ముందంజ

09.33 A.M: విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరికి 2000 ఓట్ల ఆధిక్యం

09.25 A.M: మాచర్లలో టీడీపీ అభ్యర్ధి జూలకంటి బ్రహ్మారెడ్డి ముందంజ

09.20 A.M: మంగళగిరిలో నారా లోకేశ్ ముందంజ

09.15 A.M: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ముందంజ

09.10 A.M: గుడివాడలో కొడాలి నాని వెనుకంజ

09.05 A.M: జనసేన పార్టీ 3 స్థానాల్లో ముందంజ

09.01 A.M: లీడ్ లో టీడీపీకి పెరుగుతున్న స్థానాలు..

08.50 A.M: తెనాలిలో నాదండ్ల మనోహర్ ముందంజ..

08.45 A.M: రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరి ముందంజ..

08.30 A.M: ఈవీఎం ఓట్ల లెక్కింపు

08.00 A.M: ప్రారంభమైన పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు

దాదాపు రెండు నెలలు క్రితం మొదలైన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తుది సమరం మాత్రమే మిగిలుంది. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే కౌంటింగ్ తో అభ్యర్ధుల జయాపజయాలు.. పార్టీల భవితవ్యం.. తేలనుంది. పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న బీజేపీ మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఆకాంక్ష.. అధికారంలోకి వచ్చి సత్తా చాటాలని కాంగ్రెస్ ఆశలు మరికొన్ని గంటల్లో తేలిపోబోతున్నాయి.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఒకెత్తయితే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం వేరు. తీవ్ర సంచలనాలకు దారి తీసిన ఏపీ-2024 ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ, అధికారంలోకి రావాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రయత్నిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన ఎన్నికలు, కొన్ని సంఘటనలు మరింత సంచలనం రేపాయి. దీంతో కౌంటింగ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఒక్క ఏపీలోనే 45వేల మంది పోలీసులను వివిధ రాష్ట్రాల నుంచి రప్పించి భద్రత ఏర్పాటు చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇంతటి ఉద్విగ్న పరిస్థితుల మధ్య జరుగుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ‘టీమ్ తెలుగు బులెటిన్’ ఉదయం నుంచీ మీకు సవివరంగా అందించబోతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నుంచి 8.30గంటలకు ప్రారంభయ్యే వీవీప్యాట్ ల కౌంటింగ్ మొదలు చివరి ఫలితం వచ్చే వరకూ అప్డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. పైన ఇచ్చిన బాక్సుల్లో ఎప్పటికప్పుడు ఫలితాలను చూడొచ్చు.

754 COMMENTS

సినిమా

సూర్య 46 షూటింగ్ స్టార్ట్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్...

కుబేర మూవీని అందరూ ఎంజాయ్ చేస్తారు.. నాగార్జున, ధనుష్‌ కామెంట్స్

కుబేర మూవీ చాలా స్పెషల్ గా ఉంటుందని.. అందరూ ఎంజాయ్ చేస్తారని హీరోలు నాగార్జున, ధనుష్‌ అన్నారు. ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబోలో...

Ustad Bhagat Singh: గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్...

Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. శ్రీలీల హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో...

Balakrishna Birthday special: ‘హ్యాపీ బర్త్ డే బాలయ్యా..’ ఆ అరుదైన...

Balakrishna Birthday special: నందమూరి బాలకృష్ణ.. ఎనభై, తొంబై, మిలినియం దశకాల్లో తెలుగు సినిమా సూపర్ స్టార్స్ లో ఒకరు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు...

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’ విడుదలపై చిత్ర బృందం...

Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పిరియాడిక్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. 2020లోనే ప్రారంభమైన సినిమా సుదీర్ఘ కాలం సెట్స్...

రాజకీయం

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి...

సాక్షిపై దాడి.! టీడీపీ కార్యాలయంపై దాడి.! అభిమానస్తుల బీపీ, షుగర్.. వల్లే కదా జగన్.!

వైసీపీ హయాంలో, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ కార్యాలయ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తమోడుతున్న టీడీపీ కార్యాలయ...

సంకర తెగ: వైసీపీ వర్సెస్ అమరావతి.!

అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి అంటే, ఎందుకంత అసహ్యం.? నో డౌట్, వైసీపీ గత కొన్నేళ్ళుగా అమరావతిపై అసహ్యం పెంచుకుంటూనే పోతోంది. కారణాలేంటి.? అన్నది వైసీపీ శ్రేణులకే అర్థం కాని పరిస్థితి. రాజకీయాల్లో...

కొమ్మినేని అరెస్ట్.! రెడ్ బుక్ అంటూనే, పోలీసులపై ప్రశంసలు.!

ఆయనో సీనియర్ జర్నలిస్ట్.. కానీ, రాజకీయ నాయకుడిలా రాజకీయ విమర్శలు చేస్తాడేంటి.? ఇదే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద, ‘అమరావతి మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు’ అంటూ...

జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

రాజధాని ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నగరంలోని జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు, కొమ్మినేని శ్రీనివాసరావును...

ఎక్కువ చదివినవి

అమరావతి ‘వైసీపీ విషం’.! ఏళ్ళ తరబడి నడుస్తున్న తతంగం.!

ఆయనెవరో జర్నలిస్టు అట.! ఆయన సాక్షిలో ఏదో మాట్లాడితే వైసీపీకి ఏంటి సంబంధమట.? ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వేశ్యల రాజధాని అమరావతి’ వివాదంపై స్పందించిన తీరు. సాక్షి మీడియా ఎవరిది.? అసలు, ఆ...

సూర్య 46 షూటింగ్ స్టార్ట్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర...

జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

రాజధాని ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నగరంలోని జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు, కొమ్మినేని శ్రీనివాసరావును...

రవితేజ కొత్త మూవీ.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఓ వైపు మాస్ జాతర సినిమా షూటింగ్ జరుగుతుండగానే తాజాగా మరో మూవీని అనౌన్స్ చేశాడు. క్లాసిక్ సినిమాల డైరెక్టర్ కిషోర్...

గడచిన ఏడాదిలో వైఎస్ జగన్ ఏం సాధించినట్లు.?

కొత్త ప్రభుత్వానికి ఆర్నెళ్ళు సమయం ఇస్తాం.. కాదు కాదు, ఏడాది సమయం ఇస్తాం.. అని ఓడిన రాజకీయ పార్టీలు, గెలిచిన రాజకీయ పార్టీల గురించి చెబుతుండడం చూస్తుంటాం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి,...