Switch to English

పిచ్చోడు కాల్చేసిన రధం.. పిల్లల కోసం విగ్రహం ధ్వంసం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

మతి స్థిమితం లేని వ్యక్తి ఓ రధాన్ని దగ్ధం చేశాడట.. పిల్లలు లేరన్న కారణంతో, మూఢ భక్తితో విగ్రహాన్ని ధ్వంసం చేసి.. విగ్రహంలో కొంత భాగాన్ని ఇంటికి తీసుకెళ్ళి పూజలు చేశాడట ఓ వ్యక్తి.. ఇదీ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రభుత్వ వివరణ.

సాక్షాత్తూ డీజీపీ, మంత్రులు, అధికార పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోంటే.. రాష్ట్ర ప్రజలకు కొత్త అనుమానాలు రాకుండా వుంటాయా.? ‘ఆకతాయిల పని..’ అంటారు, అదే సమయంలో ‘అసాంఘీక శక్తుల పని’ అంటారు.! అసలేం జరుగుతోంది రాష్ట్రంలో.

వర్షానికి నానిపోయి విగ్రహాలు ధ్వంసమవుతున్నాయనడం ఎంతవరకు సబబు.? దశాబ్దాలుగా వాన నీటిలో నానిపోయి, మండు టెండలకు ఎండిపోయి కూడా చెక్కు చెదరని విగ్రహాలు.. చిన్నపాటి వానలకు ధ్వంసమయ్యాయంటే నమ్మేదెలా.? ఏళ్ళ తరబడి ఎండలకు ఎండి, వానలకు తడిసిన రధం.. తేనె పట్టు కోసం పొగపెడితే కాలిపోవడమేంటి.? తేనె పట్టు కోసం ప్రయత్నించిన క్రమంలో రధం తగలబడిపోయిందని చెప్పిన అధికార పార్టీ నేతలు, అంతర్వేది రధం దగ్ధం కేసుని సీబీఐకి అప్పగించడంలోనే.. ప్రభుత్వ డొల్లతనం బయటపడిపోయింది.

‘వరుస ఘటనలు చూస్తోంటే తెలుగుదేశం పార్టీపైనే అనుమానాలు కలుగుతున్నాయి.. హిందుత్వ ఎజెండాగా పెట్టుకున్న బీజేపీ మీదా అనుమానాలు కలుగుతున్నాయి..’ అంటూ వైసీపీ నేతలు రాజకీయం చేస్తోంటే, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్లు.?

ఒక ఘటన జరిగితే అనుకోకుండా జరిగినదని సరిపెట్టుకోవచ్చు. కానీ, బిట్రగుంటలో ఓ రధం తగలబడింది.. ‘ఆకతాయి’ పని అనేశారు. అంతర్వేదిలో ఇంకో రధం తగలబడింది.. ఈసారి ‘తేనె పట్టు’ కథ చెప్పారు. పిఠాపురంలో దేవతా మూర్తుల విగ్రహాలు తగలబడ్డాయి.. ఆకతాయి పని అని సెలవిచ్చారు. ఇంకో చోట ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసమైతే, ‘బొమ్మే కదా.. దేవుడికి వచ్చిన నష్టమేంటి.?’ అని ఓ మంత్రిగారు చెప్పుకొచ్చారు.

ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో జరుగుతోంది. అదేంటన్నది తేల్చాల్సింది పోలీసులే. కానీ, ఆ పోలీసుల నుంచీ అధికార పార్టీ నేతలు చెబుతున్న మాటలే వస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ నోట కూడా అవే ప్రకటనలు రావడం దారుణమని విపక్షాలు మండిపడుతున్నాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...