Switch to English

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి తెచ్చారు. ఆయనే ఎమ్మెల్సీ దీపకర్‌రెడ్డి. ఈ వ్యవహారంపై పెను దుమారం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించి, కరోనా టెస్టుల్లో పాజిటివ్‌ వస్తే.. పాజిటివ్‌ అనే అర్థమనీ.. వైరల్‌ లోడ్‌ తగ్గితే నెగెటివ్‌ వచ్చే అవకాశాలున్నాయని స్పస్టతనిచ్చింది. ఇదిలా వుంటే, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టుల్లో విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో నిజాలు నిగ్గు తేలాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నిజానికి ఇది చాలా సీరియస్‌ ఆరోపణ. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పనిచేసిన చంద్రబాబు, ఇంత సిల్లీగా ఎలా ఆరోపణలు చేస్తారు.? అందుకు తగ్గ ఆధారాలు ఆయన దగ్గర ఏమన్నా వున్నాయా.? అన్న ప్రశ్న ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ నుంచి దూసుకొచ్చింది. ‘దీన్ని చాలా సీరియస్‌గా పరిగణించాలి. కేంద్రం జోక్యం చేసుకోవాలి. కరోనా పరీక్షల్లో అనుమానాలు రావడమంటే చిన్న విషయం కాదు. ఆ టెస్టుల కోసం వినియోగిస్తున్న కిట్స్‌పైనే అనుమానాలు వ్యక్తం చేసినట్లవుతుంది. మరి, కేంద్రం, ఐసీఎంఆర్‌ ఆమోదం లేకుండానే వీటిని రాష్ట్రాలు కొనుగోలు చేసే అవకాశం వుందా.? రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు ఆరోపణలపై స్పందించాలి. తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలి..’ అని నాగేశ్వర్‌ అభిప్రాయపడ్డారు.

కరోనా పాజిటివ్‌ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి.. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసులు పెరిగాయి.. ఆంధ్రప్రదేశ్‌లో టెస్టుల్లో అక్రమాల్ని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు.? తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని నాగేశ్వర్‌ నిలదీశారు. అవును మరి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తెలంగాణలో పరిస్థితులపైనా స్పందించాలి. హైద్రాబాద్‌ని ఉద్ధరించింది తానేనని చెప్పుకుంటారు కదా.! తాను జాతీయ నాయకుడినని చెప్పుకుంటారు గనుక, దేశంలో కరోనా పరిస్థితులపైనా కేంద్రాన్ని నిలదీయగలగాలి. ‘చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత గనుక.. ఆంధ్రప్రదేశ్‌ గురించే మాట్లాడుతున్నారు..’ అని టీడీపీ నేతలు బుకాయిస్తే అది ఏమాత్రం సమర్థనీయం కాదు.

3 COMMENTS

  1. 921578 393410It was any exhilaration discovering your web site yesterday. I arrived here nowadays hunting new points. I was not necessarily frustrated. Your ideas right after new approaches on this thing have been helpful plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 156332

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...