చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఐదేండ్లలో ఆయన రెండు ప్రాజెక్టులను టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి అమరావతి రాజధాని, రెండోది పోలవరం. ఈ రెండింటినీ పూర్తి చేస్తే తనకు తిరుగు ఉండదని భావిస్తున్నారు. అమరావతి రాజధాని చంద్రబాబు మైండ్ లో నుంచి పుట్టింది. కాబట్టి అది ఆయన పూర్తి చేస్తే ఏపీ చరిత్రలో నిలిచిపోతారు. అలాగే ఏళ్లుగా మగ్గిపోతున్న పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తే రైతుల జీవితాల్లో చంద్రబాబుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
ఈ క్రమంలోనే ఈ రెండింటినీ పూర్తి చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన ఢిల్లీ టూర్ లో పోలవరం పెండింగ్ బకాయిలు రూ.800 కోట్లను తెచ్చుకున్నారు. దాంతో పాటు రూ.2వేల కోట్లు అడ్వాన్స్ రూపంలో గ్రాంట్ అయ్యేలా చూసుకున్నారు. ఈ నిధులతో పోలవరం డాయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. అది పూర్తి అయితే పోలవరానికి ఒక రూపం వస్తుంది. కాబట్టి వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో దాన్ని పూర్తి చేస్తే నీళ్లు నింపుకోవచ్చు. ఇక అటు అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15వేల కోట్ల సాయంతో పాటు.. కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు.
ఓ వైపు జంగిల్ క్లియరెన్స్ పనులు చకచకా జరుగుతున్నాయి. అమరావతిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో కలుపుతూ రోడ్లను ఏర్పాటు చేయాలని.. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి నగరాలతో కలుపుతూ రైలు మార్గం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఇప్పటికే కోరారు. కాబట్టి అటు అమరావతికి కూడా ఓ రూపం వచ్చింది అంటే మాత్రం చంద్రబాబు పేరు చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.