Switch to English

ఏపీ బీజేపీ.. అంతా అయోమయమే!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని, ఆ పార్టీ స్థానాన్ని ఆక్రమించుకోవాలని తహతహలాడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతలతోనే ఇబ్బంది కలుగుతోంది. ఏ అంశంలోనైనా ఒక్కొక్కరూ ఒక్కో విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం అయోమయానికి తావిస్తోంది. పార్టీ వైఖరికి నేతల స్పందనకు సంబంధం ఉండటంలేదు. పార్టీ మూడు గ్రూపులుగా విడిపోయినట్టు కనిపిస్తోంది. ఇందులో ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండగా.. మరో వర్గం వైసీపీ అనుకూల ధోరణి వ్యక్తంచేస్తోంది. మిగిలినవారు ఎటూ మొగ్గు చూపకుండా సైలెంట్ గా ఉంటున్నారు.

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తొలి నుంచీ వైసీపీకి గట్టి వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మద్దతు పలుకుతున్నారు. మూడు రాజధానుల అంశాన్ని సుజనా తీవ్రంగా వ్యతిరేకించగా.. కన్నా ఆయన బాటలోనే నడిచారు. ఇక బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసిరంహారావు మాత్రం కాస్త వైసీపీ అనుకూల గొంతు వినిపిస్తున్నారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, ఇందులో కేంద్రం జోక్యం ఉండబోదని తొలి నుంచీ ఆయన చెబుతున్నారు. దానికి తగినట్టుగానే కేంద్రం ఇటీవల తన వైఖరి అదేనని స్పష్టంచేసింది.

ఎన్నికల ముందు టీడీపీ చంద్రబాబుకు వ్యతిరేకంగా జీవీఎల్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక విధంగా వైసీపీకి అనుకూలంగా మారింది. ఎన్నికల తర్వాత కూడా జీవీఎల్ అదే విధంగా ముందుకెళ్తున్నారు. దీంతో ఆయన వైసీపీతో లోపాయకారీ అవగాహన కుదుర్చుకుని వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఆశ్చర్యకరంగా టీడీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేశారు. అయితే, తాను పార్టీ విధానం మేరకే మాట్లాడుతున్నానని.. ఎవరు ఏం మాట్లాడినా తాను చెప్పిందే ఫైనల్ అని జీవీఎల్ ఓ సందర్భంగా స్పష్టంచేశారు. కానీ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దియోధర్ మాత్రం పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పిందే పార్టీ అభిప్రాయమని పేర్కొన్నారు.

ఇక తాజాగా కేంద్రంలో బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు కుదరబోతోందంటూ జరుగుతున్న ప్రచారంలో కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర పార్టీకి ఎలాంటి సమాచారం లేదని కన్నా చెప్పగా.. సునీల్ దియోధర్, పురందేశ్వరి వంటి నేతలు మాత్రం అలాంటిది ఏమీ లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరి ఏమిటనేది తెలియక పలువురు గందరగోళానికి గురవుతున్నారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆస్తులను ఇప్పటికే వేలం వేసేందుకు...

పిక్ ఆఫ్ ది డే: కొమరం భీమ్ కి రామరాజు బర్త్ డే విషెస్.!

మన నవతరం అల్లూరి సీతారామరాజు అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా కొమరం భీమ్ అలియాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ బర్త్ డే టీజర్ ని...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

ఫ్లాష్ న్యూస్: మాస్కుల్లో ఈ మాస్క్ వేరయా..

లాక్ డౌన్ ఆంక్షలు కొద్దిగా తొలగడంలో ప్రజలంతా బయటకి వస్తున్నారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతున్నారు. కానీ.. మాస్క్ లేకుండా ఎవరూ రావటం లేదు....

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...