ఏపీలో నగ్న వీడియోల కలకలం మళ్లీ రేగుతోంది. అప్పట్లో వైసీపీ లీడర్ కు చెందిన నగ్న వీడియో దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం రేపింది. ఇప్పుడు తాజాగా ఏపీ బీజేపీకి చెందిన ఓ ప్రముఖ నేతకు సంబంధించిన వీడియో కాల్ ఒకటి నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరుకు చెందిన ఈ నేత.. తమ పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడారు. అయితే ఆయన ఇందులో నగ్నంగా ఉండి మాట్లాడుతున్న వీడియో కాస్త లీక్ అయింది. అది నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాంతో ఈ విషయం కాస్తా పార్టీ పెద్దల దృష్టికి వెళ్లింది. రెండు రోజుల క్రితమే ఇదే జిల్లాకు చెందిన ఓ లీడర్ నగ్న వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పుడు మరో నేత వీడియో కూడా వైరల్ కావడంతో పార్టీ అగ్ర నాయకత్వం ఉలిక్కిపడింది. దీంతో పార్టీ మీడియా వ్యవహారాలు చూసుకునే ఓ నేత ఈ విషయంపై విచారణ జరిపి నివేదికను అగ్ర నాయకత్వానికి పంపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియోల లీకేజ్ వెనక సొంత పార్టీ నేతల హస్తం ఉన్నట్టు పార్టీ నాయకత్వం అనుమానిస్తోంది. వారి మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇలా లీక్ చేశారని అంటున్నారు.
ఈ అంశంపై అటు ప్రతిపక్ష నేతలు కూడా భగ్గుమంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనపై బీజేపీ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అటు ప్రభుత్వం నుంచి కూడా ఎవరూ దీనిపై నోరు విప్పలేదు. మరి సదరు నేత దీనిపై క్లారిటీ ఇస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.