క్రికెట్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మజానే వేరు. దశాబ్దాలు గడుస్తున్నా ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ఇచ్చే కిక్కే వేరు. ఇప్పుడూ అదే జరిగింది. నిన్న పాకిస్థాన్ పై భారత్ సాధించిన విజయంతో దేశం యావత్తు పులకించిపోతోంది. భారత్ ను గెలుపు తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీకి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ భార్య, హీరోయిన్ అనుష్క శర్మ ఇన్ స్టాలో భర్తపై ప్రేమను రాసుకొచ్చింది.
నీవెంత అద్భుతమో మరోసారి నిరూపించావు. అందరికీ ఒకరోజు ముందే దీపావళి సంతోషం నింపావు. నీ కష్టం వృధా పోలేదు. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ్ మ్యాచ్ ల్లో ఇదొకటి. మ్యాచ్ ముగిసాక ఆనందంలో నేను డ్యాన్స్ చేస్తుంటే నేనెందుకు డ్యాన్స్ చేస్తున్నానో మన అమ్మాయికి.. అర్ధం కాలేదు. ఏదొక రోజు తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని తెలుసుకుంటుంది. క్లిష్ట పరిస్థితులు దాటి నా భార్త మళ్లీ తానేంటో నిరూపించుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని పేర్కొంది.
https://www.instagram.com/p/CkDnA-npJi9/?utm_source=ig_web_copy_link