ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు అన్నీ మూసివేశారు. ఈ నెలాఖరు నుండి లాక్ డౌన్ ను విడతల వారీగా ఎత్తివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ ఎత్తేసినా కానీ థియేటర్లు అయితే ఇప్పుడిప్పుడే ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే భారీగా నష్టపోయిన నిర్మాతలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపు చూస్తున్నారు. ముందుగా ఓటిటి రిలీజ్ అంటే మన నిర్మాతలు జంకినా క్రమంగా పరిస్థితిలో మార్పు వస్తోంది. ఇప్పటికే వివిధ భాషలకు చెందిన సినిమాలు దాదాపు 7 వరకూ ప్రైమ్ లో విడుదలవుతున్నట్లు అధికారికంగా వెల్లడైంది. మరిన్ని చిత్రాలు ఇప్పుడు ఈ బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం త్వరలోనే ఓటిటిలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ముందుగానే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నిశ్శబ్దం నిర్మాతలను సంప్రదించినా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే థియేటర్లు ఓపెన్ అవ్వడానికి మరో మూడు నెలలైనా పట్టే అవకాశమైనా ఉండడంతో పరిస్థితిలో మార్పు వస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ నిశ్శబ్దం చిత్రాన్ని దాదాపు 26 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ లో అన్ని భాషలు వస్తాయి. నిశ్శబ్దం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కింది.
మరి నిశ్శబ్దం ఎప్పుడు విడుదలవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
993347 300004This internet site is my breathing in, extremely wonderful layout and perfect content material material . 265474
909151 374286Strategies for dilution antimicrobial susceptibility beadlets for beagles that grow aerobically-fifth edition. 119782
423457 898067This is a good topic to speak about. Usually when I find stuff like this I stumble it. This write-up probably wont do effectively with that crowd. I will likely be certain to submit something else though. 800858