న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా అంటే సుందరానికీ. ఈ చిత్రానికి డీసెంట్ రివ్యూస్ వచ్చినా కానీ కలెక్షన్స్ విషయంలో బాగా వెనుకపడింది. తొలి వీకెండ్ ముగిశాక ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో బాగా వెనకపడింది. మొత్తానికి తొలి వారం కూడా పూర్తవ్వకుండానే అంటే సుందరానికీ బాగా డల్ అవ్వడం కొసమెరుపు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూశారు.
ఇక అంటే సుందరానికీ ఓటిటి రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఆరాలు తీస్తున్న ప్రేక్షకుల గురించి ఈ వార్త. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది. జులై 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. నజ్రియా హీరోయిన్ గా నటించింది.