Switch to English

అంటే సుందరానికీ రివ్యూ: ఫన్ ఫ్యామిలీ డ్రామా

Critic Rating
( 3.00 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie అంటే సుందరానికి
Star Cast నాని, నజ్రియా నజీమ్
Director వివేక్ ఆత్రేయ
Producer మైత్రి మూవీ మేకర్స్
Music వివేక్ సాగర్
Run Time 2 గం 57 నిమిషాలు
Release 10 జూన్ 2022

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా అంటే సుందరానికీ. ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

సుందర్ ప్రసాద్ (నాని), లీల థామస్ (నజ్రీయ) చిన్నప్పటి నుండి స్నేహితులు. సుందర్ కు చిన్నతనం నుండే లీల అంటే ఆకర్షణ ఉంటుంది కానీ తన మనసులోనే దాచేసుకుంటాడు. పెద్దయ్యాక ధైర్యం చేసి లీల కు ప్రపోజ్ చేయగానే ఆమె ఒప్పేసుకుంటుంది.

ఇప్పుడు రెండు భిన్నమైన మతాల నుండి వచ్చిన ఈ ఇద్దరూ తమ పెద్దలను పెళ్ళికి ఎలా ఒప్పించారు. వాళ్ళు వేసిన ప్లాన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి అన్నది మెయిన్ పాయింట్.

నటీనటులు:

నాని ki ఇలాంటి రోల్స్ కొత్త కాదు. అమాయకంగా ఉంటూ అల్లరి చేసే పాత్రలు చాలానే చేసినా ఇందులో కొత్తగా కనిపిస్తాడు. ఈ చిత్రానికి తనదైన శైలిలో పెర్ఫార్మన్స్ ఇచ్చి వెన్నుముకగా నిలిచాడు. అటు కామెడీతో అలరించినా, ఇటు ఎమోషనల్ గా ఆకట్టుకున్నా కూడా నానికే చెల్లింది.

నజ్రీయ ఈ చిత్రంతోనే తెలుగులో డెబ్యూ చేసినా కానీ అదే తన తొలి సినిమాగా ఎక్కడా అనిపించదు. బబ్లీ నటనతో ఆకట్టుకుంది. నానితో ఆమె కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయింది.

ఇక హీరో హీరోయిన్లకు తల్లిదండ్రులుగా నటించిన నరేష్, రోహిణి, నదియా, పెరుమాల్ లు ఆకట్టుకున్నారు. వీరిలో నరేష్ పాత్ర ప్రత్యేకంగా అనిపిస్తుంది. హర్షవర్ధన్ చాలా కాలం తర్వాత మంచి పాత్రలో ఆకట్టుకున్నాడు.

చిన్న పాత్రలో మెరిసినా అనుపమ మెప్పిస్తుంది. మిగతావారు కూడా పాత్రలకు తగ్గట్లు నటించారు.

సాంకేతిక వర్గం:

వివేక్ సాగర్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అటు పాటలు కానీ ఇటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాకు బలంగానే నిలిచాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకా క్రీస్ప్ గా ఉండొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేసేయొచ్చు. నిర్మాణ విలువులకు డోకా లేదు.

ఇక వివేక్ ఆత్రేయ సింపుల్ కథనే తీసుకుని దానికి తనదైన శైలి నరేషన్ ను జత చేసాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే పరంగా వివేక్ ఆత్రేయ ఆకట్టుకుంటాడు.

పాజిటివ్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • పెర్ఫార్మన్స్
  • మ్యూజిక్

నెగటివ్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ సీన్స్
  • రన్ టైం

చివరిగా:

కొన్ని సీన్స్ లో ల్యాగ్ అనిపించినా కానీ మొత్తంగా చూసుకుంటే అంటే సుందరానికీ మెప్పిస్తుంది. ఈ వారంతం హాయిగా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే చిత్రమిది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

గోరంట్ల మాధవుడి లీలలు.! ఇంతకన్నా ఏం ఆశించగలం.?

ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఓ రాజకీయ విశ్లేషకుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా.. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలపైనా.! ‘అక్రమాస్తుల...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన ఫ్యాన్స్

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్...

‘గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించిన పార్టీకే ఓట్లు’ బండి సంజయ్ తో గ్రామస్థులు

తెలంగాణలో బీజేపీ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చాయ్ పే చర్చా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని తాళ్లసింగారం...

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పదేళ్ల సినీ ప్రయాణం పూర్తి

అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రనిర్మాణ సంస్థలు 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్', 'సితార ఎంటర్టైన్మెంట్స్'. ఈ రెండు నిర్మాణ సంస్థలు నేటితో పదేళ్ల సినీ ప్రయాణాన్ని...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...