అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. తొలుత అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏఎన్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అక్కినేని కుటుంబం అనంతరం అభిమానులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా 600 మందికి బట్టలు బహుకరించారు. ఈ సందర్భంగా ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్.. NFDC- నేషనల్ ఫిలిం ఆఫ్ ఇండియా తో కలిసి “ఏఎన్ఆర్ 100-కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్” పేరుతో ఫిలిం ఫెస్టివల్ ని నిర్వహిస్తోంది. ఆయన నటించిన ఐకానిక్ సినిమాలను ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.
అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో ఏఎన్ఆర్ ఐకానిక్ మూవీ “దేవదాసు” స్క్రీనింగ్ తో ఈ ఫెస్టివల్ మొదలుపెట్టారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘దేవదాసు’ (1953), ‘మిస్సమ్మ’ (1955) ‘మాయాబజార్’ (1957), ‘భార్య భర్తలు’ (1961), ‘గుండమ్మ కథ’ (1962), ‘డాక్టర్ చక్రవర్తి’ (1964), ‘సుడిగుండాలు’ (1968), ‘ప్రేమ్ నగర్’ (1971), ‘ప్రేమాభిషేకం’ (1981) ‘మనం’ (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ 10 మాస్టర్ పీస్ మూవీ ప్రింట్‌లను 4Kలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. ” నాన్న శతజయంతి సందర్భంగా ఆయన నటించిన ఐకానిక్ సినిమాలను మళ్లీ చూడబోతున్నాం. 31 సిటీలో ఫిలిం ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన పేరు మీద పోస్టల్ స్టాంప్ కూడా విడుదలవ్వడం ఆనందంగా ఉంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి నాన్న పేరు మీద అవార్డులను ఇస్తున్నాం. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించాం. ఈ విషయం చెప్పగానే ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. శతజయంతి సందర్భంగా ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని చిరంజీవి చెప్పారు. నాన్న తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంతలా అభిమానాన్ని సంపాదించుకున్నారు. మాపై ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చిన అభిమానులకు, అతిథులకు ధన్యవాదాలు” అని నాగార్జున అన్నారు.
Hey! Do you know if they make any plugins to protect against hackers?
I’m kinda paranoid about losing everything I’ve worked hard on. Any recommendations?