Annana pathiya: సోషల్ మీడియాతోపాటు యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో ఇటివల బాగా వైరల్ అవుతున్న ‘అన్నన పాథియే (Annana pathiya appata ketiya) అనే థాయ్ ల్యాండ్ పాట గురించి తెలిసిందే. 1.02 నిమిషాలున్న పాటలో పదాలు, రిధమ్ బాగుండటంతో అందరి నోటా ఇదే పాట.
థాయ్ ప్రజలు ఎదుటి వ్యక్తిపై ప్రేమను వ్యక్తం చేసే సందర్భంలో పాడే పాట ఇది. సాక్ పక్నం అనే థాయ్ గాయకుడు తొలిసారి ‘టోంగ్ బావో క్రాహ్మోమ్’ ఆల్బమ్ కోసం ఈ పదాలను ఉపయోగించి కాస్త స్టైలిష్ గా పాడటంతో పాపులర్ అయింది. అనంతరం 2010లో వచ్చిన ‘ది హోలీ మ్యాన్ 3 సినిమాలో ఉపయోగించడంతో మరింత పాపులర్ అయింది.
ఇటీవల ఈపాట మరింత వైరల్ కావడానికి ఇండోనేషియాకు చెందిన నికెన్ సలింద్రి అనే యువ గాయని కారణం. అనేక ప్రదర్శనల్లో భాగంగా ‘అన్నన పాథియే’ పాట పాడుతూ స్టేజీపై డ్యాన్స్ చేయడంతో యూట్యూబ్ లోనూ ట్రెండింగ్లో వచ్చి మరింత పాపులర్ అయింది. తెలుగులోనూ శ్రీముఖి, అవినాష్ ఈ పాటపై చేసిన రీల్స్ కూడా వైరల్ అయ్యాయి.
