Anil Ravipudi: వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. జనవరి 14న సినిమా విడుదలకానున్న నేపథ్యంలో మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు అనిల్ రావిపూడి.
‘ఈ సినిమాతో డిఫరెంట్ జోనర్ ట్రై చేశాను. వినోదంతోపాటు క్రైమ్ రెస్క్యు ఎడ్వంచర్ లా వుంటుంది. వెంకటేశ్ గారితో యాక్షన్ సినిమా చేసినా.. ఆయనలోని ఎంటర్టైన్మెంట్ కే పెద్దపీట వేస్తాను. కథ అనుకున్నప్పుడే ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ ఫిక్సయ్యాం. ఎఫ్-2 కూడా సంక్రాంతికి వచ్చి హిట్టయ్యింది. ఈ సినిమా కూడా హిట్టవుతుందని భావిస్తున్నాం. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారిపోయింది. వాళ్లని ఆకట్టుకుని ధియేటర్లకు రప్పించాలి. సోషల్ మీడియాలో చేసిన ప్రమోషన్ సక్సెస్ అయింది’.
‘భీమ్స్ ఐడియాతో రమణ గోగులతో పాడించాం. ఆయన కూడా తన పెక్యులర్ వాయిస్ తో మ్యాజిక్ చేయడంతో.. ‘గోదారి గట్టు..’ పాట గ్లోబల్ స్థాయిలో 85 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. వెంకటేశ్ ఆయనే పాట పాడతాననడంతో షాక్ అయ్యా. 20 నిమిషాల్లో పాట పాడటంతో భీమ్స్ కూడా షాక్ అయ్యాడు. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్, బీజీఎం ఇచ్చారు. దిల్ రాజు-శిరీష్ అంటే నాకు ఫ్యామిలీ. వారితో ట్రావెల్ ఇష్టపడతాను’.
‘ఎఫ్-2, ఎఫ్-3తో వెంటకటేశ్ గారు, నేను బెస్ట్ బడ్డీస్ అయిపోయాం. వెంకటేష్ గారితో మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాను. ‘సంక్రాంతికి వస్తున్నాం..’ ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్ర. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకుంటారు. ట్రైలర్, పాటలతో సినిమాలో ఎంగేజింగ్ కంటెంట్ వుందని ఆడియన్స్ ఫిక్సయ్యారు. ధియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సరదాగా నవ్వుకుని వెళ్తారనే నమ్మకముంది. ఎఫ్4 ఖచ్చితంగా ఉంటుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫ్రాంచైజీకి స్కోప్ వుంద’ని అన్నారు.