Anil Ravipudi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన 69వ సినిమా తెలుగులో హిట్టయిన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా రీమేక్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది. దీనిపై తమిళ నటుడు గణేశ్ శనివారం జరిగిన ఓ ఈవెంట్లో విషయాన్ని ప్రస్తావించగా.. ఇప్పుడా విషయం ప్రస్తావించొద్దని అనిల్ కోరినా గణేశ్ వినకపోవడం వైరల్ అయింది.
గణేశ్ మాట్లాడూ.. ‘ఆరు నెలల క్రితం నేను చెన్నైలో విజయ్ ను కలిశా. మాటల్లో నాకు, అనిల్ రావిపూడితో మంచి అనుబంధం ఉందని తెలుసుకున్నారు. భగవంత్ కేసరి సినిమా 5సార్లు చూశానన్నారు. సినిమా రీమేక్ చేద్దాం.. దర్శకత్వం చేయమని అనిల్ ను విజయ్ కోరితే చేయనన్నార’ని అనిల్ అన్నారు.
అనిల్ స్పందిస్తూ.. విజయ్ సర్ నన్ను పిలిచారు. కానీ.. మా ఇద్దరి మధ్యా వేరే టాపిక్ నడిచింది. ఆయన సినిమాకు డైరక్షన్ చేయననలేదు. ఆయన 69వ సినిమా ఏంటనేది వారే చెప్తారు. ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. గణేశ్ కు నాపై అభిమానం ఎక్కువ’ని అన్నారు.