Switch to English

బిగ్ బిగ్ 5: టాస్క్ లో ఎన్నీ మాస్టర్ ఎందుకంత హైపర్?- ఎపిసోడ్ 38

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ 5 నామినేషన్స్ వేడి ఈరోజు ఎపిసోడ్ లో కొనసాగింది. ఎవరు ఎవరి మీద ఎందుకు వేసుకున్నారో అని గ్రూపులుగా మారిపోయి డిస్కషన్స్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ అన్న న్యూటన్ సూత్రాన్ని అయినా అర్ధం చేసుకోగలం కానీ ఈ నామినేషన్స్ ను మాత్రం అర్ధం చేసుకోలేమురా బాబు అన్నది హైలైట్ గా నిలిచింది. ఇక శ్వేతా ఎప్పటిలానే తన కూల్ ను కోల్పోయింది. షణ్ముఖ్, జెస్సీ, సిరి గ్యాంగ్ ను ఉద్దేశిస్తూ గట్టిగా అరిచింది. మరోవైపు సన్నీ శ్రీరామ్, హమీదను ఇమిటేట్ చేసింది నవ్వులు తెప్పించింది.

బిగ్ బాస్ లో తదుపరి కెప్టెన్సీ టాస్క్ ను అనౌన్స్ చేసారు. బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ లో మొత్తం నాలుగు టీమ్స్ గా డివైడ్ చేసారు. బ్లూ టీమ్ లో మానస్, సన్నీ, ఎన్నీ, ఎల్లో టీమ్ లో షణ్ముఖ్, జెస్సీ, ప్రియాంక, గ్రీన్ టీమ్ లో రవి, లోబో, శ్వేతా, రెడ్ టీమ్ లో విశ్వ, శ్రీరామ్, ప్రియాలను ఎంపిక చేసారు. సిరి ఇంకా కాజల్ ను సంచాలకులుగా ఉంటారు. అలాగే ఎల్లో, బ్లూ టీమ్స్ కు మేనేజర్ గా కాజల్, మిగతా రెండు టీమ్స్ కు మేనేజర్ గా సిరి ఉంటారు.

బజర్ మోగినప్పుడు బొమ్మలకు సంబంధించి విడి సరుకులు బిగ్ బాస్ పంపిస్తారు. అవన్నీ సేకరించి ఎవరైతే ఎక్కువ బొమ్మలు చేస్తారో ఆ టీమ్ కు సంబంధించిన కంటెస్టెంట్స్ కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. అలాగే మేనేజర్ లుగా ఉన్న టీమ్స్ ను కలిపి ఎక్కువ బొమ్మలు ఏ మేనేజర్ ఉన్న టీమ్ చేస్తారో సిరి, కాజల్ లలో ఒకరు కూడా కెప్టెన్సీ పోటీదారులు అవ్వొచ్చు.

ఇక టాస్క్ మొదలయ్యాక మొదట హుషారుగా ఉన్నా కానీ తర్వాత ఎప్పటిలానే ఒకరినొకరు తోసుకోవడం, అరుచుకోవడం చేస్తూ ఉంటారు. ఇక శ్వేతా ఐతే బొమ్మలు చేయడం అయిపోయి బిగ్ బాస్ కు అనౌన్స్ చేసాక కూడా షణ్ముఖ్ టీమ్ నుండి ఒక బొమ్మను లాగేసుకుని చించేసింది. మరోవైపు రవి తన తెలివిని ఉపయోగించి సన్నీను పిలిచి అందరం కలిసి షణ్ముఖ్ టీమ్ ను నాశనం చేద్దాం. వాళ్ళది అయిపోయాక మనం మనం చూసుకుందాం అన్నాడు. కానీ అది అంత వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు.

ఇక సిరి, ఎన్నీ మాస్టర్ కు మధ్య చిన్న విషయానికి వాగ్వాదం మొదలైంది. ఎన్నీ మాస్టర్ తన కూల్ ను కోల్పోయింది. సిరిను డ్రామా క్వీన్ అంటూ సంభోదించింది. ఇక ఎపిసోడ్ ముగిసే సమయానికి మానస్ టీమ్ ఎక్కువగా 7 బొమ్మలను చేయగా సెకండ్ ప్లేస్ లో షణ్ముఖ్ టీమ్ ఆరు బొమ్మలను చేసింది. ప్రియా టీమ్ అప్పటికే తక్కువ చేయడంతో మానస్ టీమ్ కు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...