తమిళ సినిమాల్లో కథానాయికగా పేరున్న ఆండ్రియా న్యూడ్ సీన్లో నటించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అండ్రియా నటించిన ‘పిశాసు-2’ చిత్రంలో ఇలా నటించినట్టు తెలుస్తోంది. మిష్కిన్ దర్శకత్వంలో 2016లో విడుదలైన ‘పిశాసు’ చిత్రానికి ఇది రెండో భాగంగా తెరకెక్కుతోంది. పూర్ణ, రాజ్‌కుమార్, పిచ్చుమణిలతోపాటు స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమధ్య షూటింగ్ పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయాయి.
కథ డిమాండ్ మేరకు ఆండ్రియా నగ్నంగా నటించినట్టు తెలుస్తోంది. దర్శకుడు మిష్కిన్ సన్నివేశం వివరించడంతో ఆండ్రియా ఈ సాహసం చేసినట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో లొకేషన్లో అతికొద్దిమంది మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. 2019లో ‘ఆడై’ చిత్రంలో అమలాపాల్ కూడా నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఆండ్రియాకు తమిళంలో నటిగా, గాయనిగా మంచి గుర్తింపు ఉంది. ఈ సినిమాకు కార్తీక్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.
632055 878513I enjoy this internet site, will undoubtedly arrive back. Make positive you carry on writing high quality posts. 519242
637426 925307I discovered your weblog site on google and check a few of your early posts. Continue to keep up the really very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading much more from you later on! 966989