ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు: లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh శాసనసభలో తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ సిటీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వర్సిటీలోని వసతి గృహాలు, విభాగాల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన సిబ్బంది, ఎన్ఎంఆర్, 28 రోజుల వేతన ఉద్యోగులను కనీస వేతన శ్రేణి ఉద్యోగులుగా పరిగణించి, దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన మంత్రి లోకేష్, గత ఐదేళ్లలో ఏపీలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా వివిధ పోస్టుల్లో నియమించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే 30 రోజుల్లో ఆడిట్ పూర్తి చేసి, అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్, ఎంటిఎస్ సిబ్బంది రెగ్యులరైజేషన్ అంశాన్ని మ్యాన్ పవర్ ఆడిట్ అనంతరం ఫైనాన్స్ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవకతవకలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని, ఆ నివేదిక 45 రోజుల్లో రానుందని వెల్లడించారు. నివేదిక వచ్చిన వెంటనే తగిన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉండగా, 2023 నాటికి 76వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిని మెరుగుపరచి 41వ ర్యాంకుకు తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పుడు టాప్-10లోకి తీసుకురావాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామని వివరించారు. యూనివర్సిటీ కేటగిరీలో కూడా 2019లో 16వ ర్యాంక్‌లో ఉన్న ఏయూ, 2023లో 43వ స్థానానికి పడిపోయిందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2025 నాటికి 23వ ర్యాంకుకు తీసుకొచ్చామని వెల్లడించారు.

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సభ్యులు కోరగా, రేపు విశాఖ పర్యటనలో వీసీని కలిసి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షిస్తానని మంత్రి లోకేష్ తెలిపారు. సభ్యులు తమ సూచనలు అందిస్తే శతాబ్ది వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచడం, విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో మరింతగా నిలబెట్టడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

సినిమా

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది....

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

87వ రోజు ప్రజాదర్బార్‌లో లోకేష్‌కు వినతుల వెల్లువ

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మరోసారి ప్రజా సమస్యలకు వేదికైంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 87వ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సామాన్యులు, పార్టీ కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల...

“డెకాయిట్ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్… అందులో డౌట్ లేదు”: వెంకటేష్

పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అడివి శేష్ ఇప్పుడు ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. యాక్షన్, ప్రేమ, భావోద్వేగాలను కలగలిపిన ఈ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి....

అడివి శేష్ కొత్త గేమ్ ప్లాన్.. రెండు ప్రాజెక్ట్స్‌తో సర్‌ప్రైజ్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక కథల ఎంపికతో గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ (Adivi Sesh), మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, శేష్ రెండు...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా,...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...