Switch to English

ఫ్లాష్ న్యూస్: కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్‌ అరుదైన రికార్డు

కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్‌ అరుదైన రికార్డు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా గాంధీ హాస్పిల్‌ను కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో నమోదు అయ్యే పాజిటివ్‌ కేసులన్నీ కూడా గాంధీలో చికిత్స పొందుతున్నారు. పిల్లలు, వృద్దులు మహిళలతో పాటు గర్బిణిలు కూడా వైరస్‌ బారిన పడి గాంధీ హాస్పిటల్‌కు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గాంధీలో ఒక గర్బవతి అయిన మహిళకు డెలవరీ చేసినట్లుగా మంత్రి ఈటెల ప్రకటించిన విషయం తెల్సిందే.

తాజాగా మరోసారి కరోనా పాజిటివ్‌ మహిళకు ఆపరేషన్‌ నిర్వహించి బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. డెలవరీ అయిన మహిళ గత పది రోజులుగా కరోనాతో బాధపడుతుంది. అయితే ఆమెకు జన్మించిన శిషువుకు మాత్రం కరోనా లేదు. గాంధీ హాస్పిటల్‌లో నిర్వహించిన ఈ అరుదైన ఆపరేషన్‌ పై జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.

ఆర్టీసీ బస్సుల్లో సామాజిక దూరం ఇలా

ఫ్లాష్ న్యూస్: ఆర్టీసీ బస్సుల్లో సామాజిక దూరం ఇలా

గత రెండు నెలలుగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తప్పని సరి పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. 45 రోజుల లాక్ డౌన్ తో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. అన్ని రంగాల్లో కుదేలయ్యాయి. దాంతో ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ ని కూడా పునరుద్ధరించే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి.

ఈ నెల 18 నుండి ఏపీ లో ఆర్టీసీ బస్సులు తిరగడం ఖాయంగా ఉంది. అందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా కొన్ని సీట్లను తగ్గిస్తున్నారు. సాధారణంగా బస్సుల్లో ఒక వైపు మూడు మరోవైపు రెండు సీటింగ్ సదుపాయం ఉంటుంది. మూడు సీట్లు ఉన్న వైపు మధ్య సీటును మార్క్ చేశారు.

మరో వైపు రెండు సీట్లలో ఒక సీట్ ను మార్క్ చేశారు. ఆ సీట్స్ లో ఎవరు కూర్చోకూడదు అనేది నిబంధన. ఇక సీట్లు ఉన్నవరకె ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి జనాలను బస్సులో ఎక్కించుకోరు. మరి ఇలాంటి జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందా అంటే అనుమానమే అంటూ జనాలు పెదవి విరుస్తున్నారు.

నీచం: చచ్చిన తర్వాత కూడా వదలని కులం
ఫ్లాష్ న్యూస్: దారుణం : భర్తను కాపాడబోయిన భార్య.. ఇద్దరూ మృతి
బతికి ఉన్నప్పుడు ఎన్నో రాజకీయాలు, కులాలు, మతాలు, కుట్రలు, కుతంత్రాలు చూస్తున్న సామాన్యులు చనిపోయిన తర్వాత కూడా వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికి చాలా ప్రాంతాల్లో కులాల పేరుతో కొందరిని అంత్యంత దారుణంగా చూస్తున్నారు. తాజాగా చనిపోయిన తన అన్నయ్య అంత్యక్రియల విషయంలో కుల రాజకీయాలు చేయడంతో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఒక వ్యక్తి చనిపోవడంతో అతడి డెడ్ బాడీని కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం స్థానిక స్మశాన వాటికకు తరలించారు. అయితే ఆ స్మశాన వాటికలో అంత్యక్రియలకు ఒక కుల పెద్దలు ఒప్పుకోలేదు. అది మా కులానికి చెందిన సొంత స్మశాన వాటిక. దానిలోకి వేరే కులం వారు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒప్పుకొము అంటూ చెప్పడంతో మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మృతుడి తమ్ముడు నిరసనగా సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు ఈ విషయంలో కలుగ జేసుకుని అతడికి సర్ది చెప్పి కిందకు దించారు.

దారుణం : భర్తను కాపాడబోయిన భార్య.. ఇద్దరూ మృతి

క్రైమ్ న్యూస్: లాక్‌డౌన్‌ మళ్లీ పెంచడంతో యువతి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన దారావత్‌ శంకర్‌ మరియు ఆయన భార్య మరోనిబాయీ కరెంట్‌ షాక్‌ కొట్టి మృతి చెందారు. భర్త శంకర్‌ను కాపాడబోయిన మారోనిబాయీకి కూడా షాక్‌ రావడంతో ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి శంకర్‌ ఒక తోటలో పని చేస్తున్నాడు. ఆ తోటలోనే ఉండే ఒక రేకుల షెడ్డులో ఉంటూ పని చేసుకుంటున్నారు. తోట చుట్టు ఉండే ఇనుక కంచెపై కరెంట్‌ తీగ పడటంను శంకర్‌ గుర్తించలేదు.

కంచె సమీపంలో శంకర్‌ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్త ఆ కంచెకు చేయి ఆనించాడు. అంతే అతడికి విధ్యుత్‌ షాక్‌ తగిలింది. శంకర్‌ కొట్టుకోవడం చూసిన భార్య ఏమయ్యింది అంటూ అతడిని పట్టుకుంది. దాంతో ఆమెకు కూడా కరెంట్‌ షాక్‌ తగిలింది. వారి కూతురు కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. కాని కరెంట్‌ షాక్‌గా భావించి దూరం ఉండి పోయింది. దాంతో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పింది.

కరోనాను జయించిన పిల్లలకు సరికొత్త సమస్య

ఫ్లాష్ న్యూస్: రికార్డ్‌ – ఆ బామ్మ కరోనాపై విజయం సాధించింది

ప్రపంచ వ్యాప్తంగా పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు వృద్దులు కూడా కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్న విషయం తెల్సిందే. కరోనా నుండి కోలుకుంటున్న వారు కూడా భారీగానే ఉన్నారు. పిల్లలు ఎక్కువ శాతం కరోనా జయిస్తున్నట్లుగా రిపోర్ట్‌ అందుతుంది. పిల్లలకు కరోనా సోకినా మూడు వారాల్లో వారు నెగటివ్‌కు వచ్చేస్తున్నారు. ప్లిల మరణాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అయితే కరోనాను జయించిన పిల్లలు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు.

అమెరికా న్యూయార్క్‌లోని వంద మంది పిల్లలకు కవాసాకీ అనే చిత్రమైన రోగం వచ్చింది. ఇప్పటికే ఆ రోగంతో అయిదుగురు పిల్లలు మృతి చెందారు. అయితే ఈ జబ్బు బారిన పడుతున్న పిల్లల్లో ఎక్కువ శాతం మంది కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారే. అంటే కరోనాను జయించిన పిల్లలకు ఈ సరికొత్త వ్యాధి వస్తుందని వారు అంటున్నారు. అజాగ్రత్తగా ఉంటే పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలంటూ న్యూయార్స్‌ మేయర్‌ సూచించారు.

ఈ జబ్బుతో బాధపడుతున్న పిల్లలు జ్వరంను కలిగి ఉండటం, నీరసంగా ఉండటం, ఆకలి వేయక పోవడం, దురదలు రావడం, పొట్టలో నొప్పి రావడం, వాంతులు చేసుకోవడం వంటివి చేస్తారు. ఈలక్షణాలు ఉంటే వెంటనే వారిని చికిత్సకు తరలించడం మంచిది అంటూ వైధ్యులు సూచిస్తున్నారు.

రికార్డ్‌ – ఆ బామ్మ కరోనాపై విజయం సాధించింది

ఫ్లాష్ న్యూస్: హీరో అనిపించుకోవానుకున్న పోలీస్‌కు ఫైన్‌

కరోనా మహమ్మారి వృద్దులపై అధికంగా ప్రభావం చూపుతుందనే విషయం అందరికి తెల్సిందే. గుండె సంబంధిత సమస్యలు మరియు డయాబెటీస్‌తో బాధపడుతున్న వారు ఎంతో మంది కరోనా బారిన పడి మృతి చెందిన దాఖలాలు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారిలో అత్యధికులు వృద్దులు అనే విషయం తెల్సిందే. ఆ కారణంగానే వృద్దులను అస్సలు బయటకు రానివ్వకూడదని అందరు దేశాధినేతలు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కొన్ని దేశాలు 70 ఏళ్లు దాటిన వృద్దులకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వడమే మానేశాయి. కాని స్పెయిన్‌లో మాత్రం 113 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించింది.

స్పెయిన్‌కు చెందిన మారియా బ్రన్యాస్‌కు 113 ఏళ్లు. ఇటీవల ఆమె అనారోగ్యం పాలవ్వడంతో వైధ్యులు ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ అని వచ్చింది. ఆమెకు ప్రత్యేకమైన వార్డులో ఉంచి చికిత్స అందించారు. ఆమెకు కరోనా చికిత్స అందించిన వైధ్యులు ఆమె తాజాగా కరోనాను జయించిందంటూ ప్రకటించారు. ఇటీవల బ్రిటన్‌కు చెందిన 107 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించినట్లుగా ప్రకటించారు. అత్యధిక వయసు ఉన్న మహిళ కరోనా జయించింది అంటూ ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా 113 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించినట్లుగా ప్రకటించారు. ఇది ప్రపంచ రికార్డుగా చెప్పుకొచ్చాడు.

హీరో అనిపించుకోవాలనుకున్న పోలీస్‌కు ఫైన్‌

హీరో అనిపించుకోవానుకున్న పోలీస్‌కు ఫైన్‌

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ఒక సినిమాలో రెండు బైక్‌లపై ఒక్కో కాలు వేసి చేసిన స్టంట్‌ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో అజయ్‌ దేవగన్‌ స్టంట్‌ను అప్పట్లో యువత తెగ అనుసరించే వారు. కాని కొందరు ప్రమాదాల భారిన పడటంతో పోలీసులు వాటిని బ్యాన్‌ చేశారు.

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఒక వ్యక్తి ఆ స్టంట్‌ను చేయడంతో అది కాస్త వైరల్‌ అయ్యింది. పోలీసులు ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి ఏకంగా అయిదు వేల రూపాయల ఫైన్‌ విధించడంతో పాటు మరోసారి ఇలాంటి సంఘటనలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్టంట్‌ చేసింది ఒక పోలీసు అవ్వడంతో మరింత చర్చకు తెర లేచినట్లయ్యింది. అతడు పోలీసు అవ్వడం వల్ల బాధ్యత లేదా అంటూ విమర్శలు గుప్పించారు.
మద్యప్రదేశ్‌కు చెందిన ఈ పోలీసు ఆఫీసర్‌ తన సాహస చర్యను ప్రదర్శించాడు. రెండు కార్ల మద్యలో నిల్చుని దాదాపు అయిదు కిలోమీటర్లు ప్రయాణించాడు. దాంతో ఇప్పుడు అతడిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టంట్స్‌ చేయవద్దని చెప్పాల్సిన పోలీసులు ఇలా చేస్తే ఎలా అంటూ కాస్త సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇదే సమయంలో ఆయనకు అయిదు వేల ఫైన్‌ను విధించారు.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

రివ్యూ : పాతాళ్ లోక్ (వెబ్ సిరీస్)

చీకటి రాజ్యపు నెత్తుటి మరకలతో “పాతాళ్ లోక్” ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతబడి ఓటీటీ ప్లాట్ ఫాంలు కళకళలాడుతున్నాయి. అదే బాటలో అమెజాన్ ప్రైమ్...

బ్రేకింగ్‌ గాసిప్‌: ఢిల్లీకి జగన్‌.. తన సమస్యలకి పరిష్కారం దొరికేనా?

రాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్‌ గాసిప్‌ జోరుగా చక్కర్లు కొడుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల ఢిల్లీ పెద్దలు అసహనంతో...

బాలకృష్ణ అలా అనడం కరెక్ట్ కాదు – తమ్మారెడ్డి భరద్వాజ్

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రముఖులంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరుపుతున్న విష్యం తెలిసిందే. జనవరి...

చరణ్ తో సినిమా చేయట్లేదన్న యంగ్ డైరెక్టర్.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపేసిన ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ నుంచి సినిమా...

తెలంగాణలో భయపెడ్తున్న ‘కరోనా’ మరణాలు

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువే వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి చూసినప్పుడు తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. కరోనా పరీక్షలు తక్కువగా చేస్తుండడంపై...