Switch to English

క్రైమ్ న్యూస్: భార్యను కాపురానికి పంపడం లేదని అత్తని చంపేసిన అల్లుడు

భార్యను కాపురానికి పంపడం లేదని అత్తని చంపేసిన అల్లుడు

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భార్య కాపురంకు రాకపోవడంకు కారణం అత్త అనే ఉద్దేశ్యంతో ఆమెను అల్లుడు కత్తితో నరికి చంపాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఏఎస్ పేట మండలం చౌట భీమవరం గ్రామానికి చెందిన పొలమ్మ కూతురు దొరసానమ్మ. పాతికేళ్ల క్రితం దొరసానమ్మకు తిరుపాల్ కు వివాహం అయ్యింది. పెళ్లి అయినప్పటి నుండి కూడా తాగి గొడవ చేస్తున్న కారణంగా తిరుపాల్ ను వదిలేసి దొరసానమ్మ అమ్మగారింటికి వెళ్ళిపోయింది.

ఏడు సంవత్సరాలుగా భార్య కాపురానికి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న తిరుపాల్ తాజాగా మరోసారి అత్తవారింటికి వెళ్ళాడు. అక్కడ భార్య మరియు అత్త పొలమ్మతో గొడవ పడ్డాడు. గొడవ తీవ్రం అవ్వడంతో సహనం కోల్పోయిన తిరుపాల్ అత్త పొలమ్మను కత్తితో నరికి చంపేశాడు. తల్లిని కళ్ళముందే చంపడంతో దొరసానమ్మ షాక్ అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తిరుపాల్ ను అరెస్ట్ చేసేందుకు వేడుకుంటున్నారు.

భర్తను చంపి మూడు రోజులు శవంతో గడిపిన భార్య

క్రైమ్ న్యూస్: లాక్‌డౌన్‌ మళ్లీ పెంచడంతో యువతి ఆత్మహత్య

మతి స్థిమితం లేని భార్య తన భర్తను చంపి ఆ శవంతో మూడు రోజులపాటు అలాగే ఒంటరిగా ఉన్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపుతోంది. శకుంతల అనే మహిళకు ప్రతి రోజు మాదిరిగానే పాలవాడు పాలు పోసేందుకు వెళ్ళాడు. ఆ సమయంలో తన భర్త చనిపోయాడు. డెడ్ బాడీని తీసుకు పోవా అంటూ కోరింది. ఆమె మాటలకు భయపడిన పాలవాడు స్థానికులకు సమాచారం ఇచ్చాడు.

చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు శకుంతల ఇంటికి వెళ్లారు. అప్పటికి ఆమె తలుపు వేసుకుని ఉంది ఎంత పిలిచినా తలుపు తీయలేదు. దాంతో తలుపు బద్దలు కొట్టారు. తలుపు తెరచిన వెంటనే భర్త లింబా రెడ్డి మృతి చెంది కనిపించాడు. అతడి పక్కన రక్తపు మడుగులో ఆమె ఉంది. మతిస్థిమితం లేకనే శకుంతల చంపి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శకుంతల, లింబా రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు హైదరాబాద్ లో ఉంటున్నాడు, కూతురు లండన్ లో ఉంటోంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో విషాదం.!

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది....

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్...

దారుణం: వలస కూలీల బస్సు బోల్తా – 33మందికి గాయాలు.!

ఈ కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ వలన అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది మాత్రం వలస కూలీలే అని చెప్పాలి. ఉన్న చోట తిండి లేక కొందరు, కాలినడకన కొందరు, మార్గ...

ఫ్లాష్ న్యూస్: మానవత్వానికే మచ్చ.. కరోనా భయంతో నర్సును అలా వదిలేశారు

కరోనా బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు వైద్యులు. వారితోపాటు నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. కానీ.. అదే పారా...