Switch to English

ఫ్లాష్ న్యూస్‌ : కరోనా భయంతో యువతిపై గ్రామస్తుల దాడి

కరోనా భయంతో యువతిపై గ్రామస్తుల దాడి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రతిఒక్కరికి భయ బ్రాంతులకు గురి చేస్తోంది. కాస్త అనుమానంగా ఎవరు కనిపించినా కూడా వారికి ఏమైనా కరోనా ఉందేమో అనే భయం ఎందరిలో వ్యక్త అవుతోంది. ఆ భయంతోనే 20 ఏళ్ల ఒక యువతిని హరియాణలో కొందరు కొట్టి గాయపరిచారు. బాధిత యువతి ఎంత చెప్పినా వినకుండా కొట్టారట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చోంగ్ హోయి మీసావో అనే యువతి ఇటీవల పైజాపూర్ కు స్నేహితురాలిని కలిసేందుకు వెళ్ళాను. అక్కడ కొందరు నన్ను అనుమానంగా చూసారు. అయినా నేను పట్టించుకోకుండా సామాజిక దూరం పాటించి అక్కడ భోజనం చేసి వచ్చాను. కానీ కొందరు నన్ను వైరస్ ను వ్యాప్తి చెందిస్తున్నావా అంటూ గొడవకు దిగారు. అదే సమయంలో మరి కొందరు నన్ను కొట్టేందుకు కర్రలతో వచ్చారు. నన్ను వారు కొడుతుండగా నేను అక్కడ నుండి వచ్చేశాను అంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఏంకౌరీ చేస్తున్నారు.

మెరీకోమ్ ను ఆశ్చర్యపర్చిన ఢిల్లీ పోలీసులు

ఫ్లాష్ న్యూస్‌ : బైక్ యాక్సిడెంట్: బొత్స మేనల్లుడి కొడిక్కి గాయాలు.!

భారత బాక్సింగ్ దిగ్గజం మెరీకోమ్ ను ఢిల్లీ పోలీసులు ఆశ్చర్యపర్చారు. కరోనా నియంత్రణ డ్యూటీలో తలమునకలై ఉన్న పోలీసులు మెరీకోమ్ ఇంటికి కేక్ తీసుకుని వెళ్లారు. లాక్ డౌన్ కారణంగా అన్నిచోట్లా బంద్ వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో మెరీకోమ్ చిన్న కొడుకు పుట్టిన రోజు అవ్వడంతో అతడికి కేక్ లేకుండా అయ్యింది. అతడి బర్త్ డే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేక్ పట్టుకుని మరి వెళ్లారు.

పోలీసుకు కేక్ పట్టుకు వచ్చి తన కొడుకు పుట్టిన రోజు నిర్వహించడంపై మెరీకోమ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పుట్టిన రోజు మళ్ళీ రాదు. అతడికి ఇది ప్రత్యేకమైన పుట్టిన రోజు అంటూ మెరీకోమ్ ట్వీట్ చేశారు. రాజ్య సభ సభ్యురాలిగా ఉన్న మెరీకోమ్ ప్రస్తుతం ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో ఉంటున్నారు. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్ కోసం మెరీకోమ్ ఎదురు చూశారు. కానీ కరోనా కారణంగా అవి కాస్త క్యాన్సిల్ అయ్యాయి.

బైక్ యాక్సిడెంట్: బొత్స మేనల్లుడి కొడిక్కి గాయాలు.!

ఫ్లాష్ న్యూస్‌ : బోర్డర్‌ చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎమ్మార్వో, ఆర్‌ఐలకు తీవ్ర గాయాలు

లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు టీవీల్లో, పేపర్లలో, నెట్లో యాక్సిడెంట్ కారణంగా జరిగే ఘోరాలను తక్కువగా చూస్తున్నాం. కానీ లాక్ డౌన్ సడలింపులు కారణంగా రోడ్ల మీద యాక్షిడెంట్లు మళ్ళీ ఎక్కువవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో బైక్ పై వెళ్తున్న యువకులు అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ పడిన దగ్గరి నుంచి చాలా దూరం జారుకుంటూ వెళ్లడం వలన వారికి బాగానే గాయాలయ్యాయి.

అందులో ముఖ్యంగా ఒకతనికి మాత్రం గాయాలు ఎక్కువగా తగలడంతో రక్త స్రావం ఎక్కువగా జరగడంతో అక్కడి స్థానికులు వారిని వెంటనే దగ్గర్లోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కి తరలించగా, అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ యువకుల్లో ఒకరు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ కుమారుడని సమాచారం.

బోర్డర్‌ చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎమ్మార్వో, ఆర్‌ఐలకు తీవ్ర గాయాలు

బోర్డర్‌ చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎమ్మార్వో, ఆర్‌ఐలకు తీవ్ర గాయాలు

తెలంగాణలోకి వస్తున్న వలస కార్మికులను మరియు ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా పరీక్షించి స్క్రీనింగ్‌ టెస్టును నిర్వహించి మరీ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దు అశ్వరావు పేట వద్ద బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ను ఏర్పాటు చేసి వలస కార్మికులను పరీక్షిస్తున్నారు. ఉదయం సాయంత్రం ఎమ్మార్వో స్థాయి అధికారి మరియు పోలీసు శాఖ వారు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. నేడు తెల్లవారు జామున కూడా అక్కడ చెక్‌ పోస్ట్‌ వద్ద ఎమ్మార్వో మరియు ఆర్‌ఐ తోపాటు పోలీసులు డ్యూటీ నిర్వహిస్తున్నారు.

ఆ సమయంలో ఒక లారి అదుపు తప్పి అధికారులు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ టెంట్‌ వద్దకు దూసుకు వచ్చింది. ప్రమాదంను కొన్ని క్షణాల ముందు గుర్తించిన ఎమ్మార్వో మరియు ఆర్‌ఐలు అక్కడ నుండి దూరంగా పరుగులు పెట్టారు. అదే సమయంలో అక్కడ వలస కూలీలు కూడా ఉన్నారు. వారిలో కొందరు కూడా లారీ దూసుకు వస్తుండటంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఎవరు మృతి చెందలేదు, కాని ఎమ్మార్వో మరియు ఆర్‌ఐలు గాయాలపాలయ్యారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కారుకి ఎదురుదెబ్బ

పోతిరరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ దూకుడికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బ్రేక్ వేసింది. ఈ ప్రాజెక్టు కారణంగా పర్యావరణంపై పడే ప్రభావం గురించి అధ్యయనం చేసి ఇచ్చేందుకు నాలుగు శాఖలతో...

టీం సేఫ్టీ కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్.!

ఇండస్ట్రీ హిట్ 'అల వైకుంఠపురములో', బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నఅల్లు అర్జున్, సుకుమార్ కలిసి సినిమా చేయనున్నారు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్...

బిగ్ బాస్ స్టార్ తండ్రి ఒక రేపిస్ట్

హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించింది నటి, సింగర్, మోడల్ షెహనాజ్ గిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ దక్కించుకున్న షెహనాజ్...

వారి కోసం అయినా షూటింగ్స్‌కు అనుమతించాలి : చిరంజీవి

తెలుగు సినిమా ప్రముఖులు నేడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు విషయాలపై చర్చించారు. సినీ కార్మికులు రెండు నెలలుగా షూటింగ్స్‌...

గాడ్సేపై నాగబాబు ట్వీట్‌: జనసేనకు కొత్త తలనొప్పి

మహాత్మాగాంధీని చంపేశాడు గనుక, నాథూరామ్ గాడ్సే మంచోడు కాదు. చరిత్ర మనకి చెప్పేది ఇదే. జాతి పిత మహాత్మాగాంధీని అభిమానించేవారెవరూ గాడ్సేని పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించరు. ఇది చరిత్ర చెబుతోన్న సత్యం....