Switch to English

పడిపోతున్న ఏపీ గ్రాఫ్‌.. పైపైకి తెలంగాణ గ్రాఫ్‌.!

ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే, తెలంగాణ ఎన్నో అంశాల్లో ముందంజలో వుంది. ఇది అభివృద్ధి సూచికల లెక్క. తమిళనాడు సంగతి సరే సరి. కర్నాటక కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే బెటర్‌. ఛత్తీస్‌ఘడ్‌ని ఆంధ్రప్రదేశ్‌తో పోల్చలేం.. ఆ రాష్ట్ర పరిస్థితులు వేరు. అన్నట్టు, ఒరిస్సా కూడా ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందంజలోనే వున్నట్లు కన్పిస్తోంది.

ఇంతకీ, ఆంధ్రప్రదేశ్‌కి ఏమయ్యింది.? భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ పుంజుకునే అవకాశాలు వున్నాయా.? లేదా.? ‘రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా తేవాలో మాకు బాగా తెలుసు..’ అంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

అసలు, రాష్ట్రం భ్రష్టుపట్టిపోవడానికి ప్రధాన కారణాల్లో బొత్స సత్యనారాయణ చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలు కూడా ఓ కారణమే. అమరావతిని స్మశానంగా అభివర్ణించింది ఈయనగారే మరి. రాజధానిపై అయోమయం సృష్టించింది ఈ మంత్రిగారే. ఓ బాధ్యతగల మంత్రి అయి వుండి, రాష్ట్ర రాజధాని అమరావతిపై అవాకులు చెవాకులు పేలారంటే, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ఉద్దేశ్యమేంటన్నది సుస్పష్టమవుతోంది.

తెలంగాణలో రకరకాల సదస్సులు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి సదస్సులు, అంతర్జాతీయ సదస్సులతో తెలంగాణ ఓ వెలుగు వెలుగుతోంది. ఐటీ ఆధారిత సంస్థలు, హైద్రాబాద్‌ దాటి, తెలంగాణలోని ఇతర జిల్లాలకూ విస్తరిస్తున్నాయి. మరోపక్క పారిశ్రామికంగా తెలంగాణ సరికొత్త వెలుగులతో హల్‌చల్‌ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలో నీటి సమస్య కూడా తీరిపోయినట్లే. కానీ, ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లోనూ అయోమయంతోనే విలవిల్లాడుతోంది.

ఈ ఏడాది రాష్ట్రానికి నీటి ఎద్దడి అనూహ్యంగా వుంటుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. పరిశ్రమలు, ప్రగతి అనే అంశాల గురించి చర్చించుకోవడం దండగ.. అనే స్థాయికి రాష్ట్రంలో ప్రజానీకం అసహనానికి గురవుతున్నారు. అభివృద్ధిని గాలికొదిలేసి.. రాష్ట్ర రాజధానిని వివాదాస్దపం చేసింది రాష్ట్రంలోని అధికార పార్టీ. దాంతో, రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు అస్సలేమాత్రం చూడని దుస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కి సహజసిద్ధమైన వనరులు, అవకాశాలు చాలానే వున్నాయి. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్న చందాన తయారైంది ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి.

సినిమా

ఎక్స్ క్లూజివ్: రవితేజ ‘క్రాక్’ ఓటిటి రిలీజ్ వార్తలన్నీ పుకార్లే.!

థియేటర్లు నాలుగు నెలలుగా మూతపడే ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకు కూడా ఓపెన్‌ అయ్యేది నమ్మకం తక్కువే. ఆ తర్వాత అయినా ఓపెన్‌...

బాలీవుడ్‌ మరో స్టార్‌ కన్నుమూత

బాలీవుడ్‌ లో వరుసగా జరుగుతున్న సంఘటలు సినీ ప్రేక్షకులకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కరోనా బారిన పడటంతో పాటు సుశాంత్‌ తో...

ఎక్స్ క్లూజివ్: ఊహించని డైరెక్టర్ తో అల్లు అర్జున్ పొలిటికల్ థ్రిల్లర్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. క్లాస్ నుంచి కంప్లీట్ మాస్ లుక్ లోకి మారి...

షార్ట్ ఫిలింని కాస్తా మినీ మూవీగా మార్చేసిన రెజీనా.!

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ రెజీనా. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ...

సినిమా అవకాశమంటూ ఘరానా మోసం.. డబ్బులు వసూలు చేసి ఆపై..

సినిమా అంటే ఇష్టం అందరికీ ఉంటుంది. సినిమాల్లో నటించాలనే వ్యామోహం ఉంటుంది మరికొందరికి. ఇటువంటి వారిని సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలు గతంలో...

రాజకీయం

హిందూపురం జిల్లా కోసం బాలయ్య డిమాండ్‌.. ఇది పెద్ద షాకే.!

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏం చేసినా అందులో ‘చెడు’ చూడటమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఓ టీడీపీ ఎమ్మెల్యే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆలోచనల్ని స్వాగతించారు....

రాజస్థాన్ రగడ: పైలట్ దారెటు?

రాజస్థాన్ లో రాజకీయ రగడ మరింత ముదిరింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కొనసాగుతున్న విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇరువురూ తమ తమ బల ప్రదర్శనలు ఏర్పాటు...

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాళ్‌ హెమటాబాద్‌ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రాయ్‌ తన స్వగ్రామంలో తన ఇంటికి సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆయన్ను చంపేసి ఆ తర్వాత ఉరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లుగా...

9 ఏళ్ల తర్వాత సుప్రీంలో పద్మనాభస్వామి ఆలయ కేసు తీర్పు

దేశంలోని అత్యంత సంపద ఉన్న దేవాలయంగా కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి వారి ఆలయం నిలిచిన విషయం తెల్సిందే. ట్రావెన్‌కోర్‌ రాజ వంశానికి చెందిన రాజులు ఈ భారీ సంపదను దాచారు. పద్మనాభస్వామి వారి...

పార్టీ పేరు రగడ: వైఎస్సార్సీపీకి నోటీసులు.!

ఇకపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనీ, వైఎస్సార్సీపీ అనీ పిలవడానికి వీల్లేదా.? ఏమో, ముందు ముందు ఆ పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా అయితే ఇప్పటిదాకా...

ఎక్కువ చదివినవి

బాలీవుడ్‌ మరో స్టార్‌ కన్నుమూత

బాలీవుడ్‌ లో వరుసగా జరుగుతున్న సంఘటలు సినీ ప్రేక్షకులకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కరోనా బారిన పడటంతో పాటు సుశాంత్‌ తో పాటు మరికొందరు వివిధ కారణాల వల్ల...

అధికారుల నిర్లక్ష్యం.. ఏపీలో 27 వేల కరోనా నమూనాలు వృథా

ఏపీలో కరోనా నిర్థారణ పరీక్షలు లక్షల్లో జరుగుతున్నాయి. ప్రతి రోజు 25 వేల నుండి 35 వేల వరకు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 11.4 లక్షల మంది శాంపిల్స్‌ను ఆరోగ్య శాఖ...

క్రైమ్ స్టోరీ: ఎటిఎం దొంగను పట్టించిన ఆరవ వేలు.!

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శేఖర్ రెడ్డి ఫోటోగ్రాఫర్. తన వృత్తితో వస్తున్న డబ్బులు అతడికి సరిపోవడం లేదు. దాంతో అతడు ఈజీ మనికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందులో భాగంగా బైక్స్...

నడిరోడ్డుపై యువకుడు మృతి.. కరోనా భయంతో ఎవరూ పట్టించుకోని వైనం

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాల్ని హరించడమే కాదు.. వారిలో సాటి మనిషిని చూస్తే భయం పుట్టే పరిస్థితులు కల్పించింది. ఇటువంటి పరిస్థితిని ఉదహరించే సంఘటన హైదరాబాద్ లోని ఏఎస్ రావ్ నగర్లో జరిగింది....

కొత్త జిల్లాల రగడ.. మంత్రి పదవుల కోసమా.?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల రగడ షురూ అయ్యింది. ఇద్దరు వైసీపీ నేతలు, శ్రీకాకుళం జిల్లా విభజన ఆలోచనపై పెదవి విరిచారు. ఆ ఇద్దరి ‘అసహనం’పై వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ, పరిస్థితిని...