Switch to English

ఏపీలో లాటరీ మళ్లీ రానుందా?

పేదల బతుకులను ఛిద్రం చేసే లాటరీ వ్యవస్థను తీసుకురావడానికి ఏపీలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా? ఆదాయాన్ని పెంపొందించుకునే విషయంలో ఈ మేరకు లాటరీ వ్యవస్థను పునరుద్ధరించడానికి కసరత్తు జరుగుతోందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. విభజన తర్వాత లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ.. అనంతరం పలు సంక్షేమ పథకాల కోసం పాలకులు భారీగా వెచ్చించడంతో పీకల్లోతు అప్పల్లో కూరుకుపోయింది. చంద్రబాబు గద్ద దిగే సరికి దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పులు ఉండగా.. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ కూడా అప్పులు తేక తప్పని పరిస్థితి నెలకొంది.

మరోవైపు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయల్సిన బాధ్యత జగన్ పై ఉంది. మద్యం షాపులను దశలవారీగా తగ్గిస్తామని, నాలుగేళ్లలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని ప్రకటించిన జగన్.. ఆ దిశగా ముందుకు వెళ్లాల్సి ఉంది. అదే జరిగితే మద్యం ద్వారా వచ్చే కోట్ల రూపాయల ఆదాయం కోల్పోక తప్పదు. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్న ఏపీకి ఇది పెద్ద దెబ్బే అవుతుంది. ఈ నేపథ్యంలో మద్యం ద్వారా కోల్పోతున్న ఆదాయాన్ని మరో మార్గంలో పొందాలని భావిస్తున్న ఏపీ సర్కారు.. లాటరీని మళ్లీ ప్రవేశపెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు కేరళలో లాటరీలు నడుస్తున్నాయి.

వీటి ద్వారా ఆయా ప్రభుత్వాలకు భారీగానే ఆదాయం సమకూరుతోంది. గతంలో ఏపీలో కూడా లాటరీ వ్యవస్థ ఉండేది. అయితే, పేదలు వీటికి బానిసలుగా మారి నష్టపోతుండటంతో నిషేధం విధించారు. మళ్లీ ఆదాయ పెంపు మార్గాల్లో భాగంగా దీనివైపు ఏపీ ఆసక్తి చూపిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ కేరళలో అమలవుతున్న లాటరీ విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

నా సినిమా బాహుబలి 2 కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రం దాదాపుగా రెండు వేల కోట్లను వసూళ్లు చేసిన విషయం తెల్సిందే. వందేళ్ల సినీ చరిత్రలో ఆ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా లేదనే...

పారిపోయి అందరిని టెన్షన్‌ పెట్టిన కరోనా పాజిటివ్‌ పేషంట్‌

కరోనా ఉందనే అనుమానం ఉంటేనే వారికి ఆమడ దూరంలో ఉండాలని డాక్టర్లు మరియు పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడ కరోనా పేషంట్‌ కనిపించినా కూడా వెంటనే వారిని పట్టుకుని వెళ్లి ఐసోలేషన్‌లో వేస్తున్నారు. వారు...

ఇస్మార్ట్ భామకు బాగా బోర్ కొడుతోందిట

ఇస్మార్ట్ శంకర్ తో నభ నటేష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో నటన పరంగానే కాకుండా వడ్డించిన గ్లామర్ విందుకు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ నభ కెరీర్...

నిమ్మగడ్డ ఎపిసోడ్‌: జనసేనకి వెరీ స్పెషల్‌.. ఎందుకంటే.!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించే క్రమంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘ఎన్నికల సంస్కరణల’ పేరిట ఆర్డినెన్స్‌ తీసుకురావడం, ఈ క్రమంలో పెద్దయెత్తున దుమారం చెలరేగడం తెల్సిన విషయమే. తాజాగా...

కరోనా వైరస్‌: మే 31 తర్వాత ఏం జరుగుతుంది.?

జూన్‌ 1న కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు తమకు తోచిన రీతిలో పోస్టింగ్స్‌ పెడుతున్నారు. ‘గత రెండు మూడు నెలలుగా కరోనా వైరస్‌ దెబ్బకి లాక్‌డౌన్‌లో...