Switch to English

మహిళా దినోత్సవం రోజున ఆడపడుచులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కానుకలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,801FansLike
57,764FollowersFollow

మహిళాభ్యుదయానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరచూ చెబుతుంటారు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం, మహిళా దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలోని మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాల్ని ప్రారంభిస్తోంది.

మహిళా సంక్షేమం, వివిధ రంగాల్లో మహిళలు రాణించడం.. ధ్యేకంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఈ క్రమంలో పలు ఎంవోయూలు కుదుర్చుకోవడంతోపాటు, పలు పథకాలు ప్రారంభించడం, ఆయా కార్యక్రమాలకు నిధులు కేటాయించడం.. జరుగుతోంది.

మహిళా దినోత్సవరం సందర్భంగా ప్రభుత్వం మెప్మా కింద 30 వేల మంది కొత్త మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రకటిస్తుంది. వీరికి అవకాశాలు, స్వయం ఉపాధి, ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. 10 వేల మంది మహిళలను రాపిడో డ్రైవింగ్ విభాగం, 4 వేల మంది స్వయం ఉపాధి పథకాల్లో, 4 వేల మందిని కేంద్ర ప్రాయోజిత పథకాల్లో, 4 వేల మందిని పర్యాటక అనుంబంధ రంగాల్లో, 4 వేల మంది తృప్తి హోటల్స్ స్థాపనలో, 2 వేల మంది స్మార్ట్ స్ట్రీట్స్ వెండింగ్ జోన్‌లో, మరో 2 వేల మందికి టిడ్కో జీవనాధారం కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

వ్యవసాయాధిరిత, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సర్వీస్ సెక్టార్, వ్యాపారాల్లో సుమారు 1 లక్ష మంది మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.ఎంఎస్ఎంఈలో 10 వేల మందికి జీవనోపాధి కల్పించేందుకు 2025-26 సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.

ఆంధ్రప్రదేశ్ మహిళా డిజిటల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో మైలురాయిని చేరుకుంటుంది. డ్వాక్రా మహిళలు 1 లక్షకు పైగా ఉత్పత్తులను ONDC ద్వారా Wow Geni యాప్‌లో విక్రయిస్తారు. దీని వలన రూ.1.6 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.

“మహిళలకు మహిళల కోసం మహిళల చేత” అనే కార్యక్రమం గిన్నీస్ రికార్డును నమోదు చేస్తుంది. సెర్ప్, మెప్మా విభాగం, స్వయం సహాయ సంఘాల ఉత్పత్తులకు బ్యాంక్ లింకేజీ : మెప్మా కింద 7,471 మంది లబ్ధిదారులకు 645.52 కోట్ల బ్యాంకు రుణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిణీ చేస్తారు.

బ్యాంక్ లింకేజ్ ఉత్పాదక రుణాల పథకం కింద మొత్తం రూ.1,826.43 కోట్లు మంజూరు చేస్తారు. స్త్రీ నిధి సంస్థ ద్వారా ఉత్పాదక రుణాల కింద రూ.1,000 కోట్లు మంజూరు చెక్ అందజేస్తారు.

ఫ్లిప్‌కార్ట్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంటుంది. దీనిలో భాగంగా డ్వాక్రా సంఘాల ఉత్పత్తల విక్రయాలకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. సెర్ప్, కేటలిస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌ పై అవగాహన ఒప్పందం, వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ అందించడంపై క్యాటలిస్టు మేనేజ్ మెంట్ సర్వీసెస్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది.

వ్యవసాయాధారిత ఉత్పత్తులకు వ్యాల్యూ చైన్ అందించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు. సెర్ప్, సీసీడీతో ఒప్పందం :
డ్వాక్రా సంఘాలు సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు CCD(సెంటర్ ఫర్ కలెక్టివ్ డవల్మెంట్) తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది.

చిన్న తరహా హోటల్ వ్యాపారంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడానికి గాటోస్ కేఫ్‌తో ఒప్పందం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది. దీని ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పన లభిస్తుంది.

సర్వీస్ ప్రొవైడర్ల జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి హోమ్ ట్రయాంగిల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18,515 సర్వీస్ ప్రొవైడర్లకు ప్రయోజనం చేకూరుతుంది. దీని ద్వారా నెలకు రూ.15,000 నుంచి రూ.35,000 నికర ఆదాయం వస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణ మరమ్మతు నిపుణులు ఉంటారు.

రాపిడో ప్రతినిధులతో అవగాహన ఒప్పందం. రాష్ట్ర వ్యాప్తంగా 1,000 ఎలక్ట్రిక్ వాహనాలు మహిళా లబ్ధిదారులకు లబ్ధిదారులకు అందించబడతాయి. వాటిలో 760 ఈ బైక్‌లు, 240 ఈ ఆటోలు ఉంటాయి. ప్రకాశం జిల్లా నుండి 10 ఇ-బైక్‌లు, 10 ఇ-ఆటోలు లబ్ధిదారులకు కేటాయింపు. వీటికి ప్రభుత్వం రుణసదుపాయం కల్పిస్తుంది.

ఆన్‌బోర్డింగ్ ఛార్జీలు, నెలవారీ చార్జీలను మూడు నెలల పాటు మాఫీ చేస్తుంది. చందా రుసుము (మూడు నెలలకు) మాఫీ చేస్తుంది. దీని ద్వారా సుమారు రూ.30 వేల వరకు ఆదాయం పొందవచ్చు.

రాష్ట్రంలోని 55,607 మంది అంగన్వాడీ వర్కర్లకు, 48,909 మంది అంగన్వాడీ హెల్పర్లకు మేలు చేకూర్చేలా తీసుకున్న గ్రాట్యూటీ నిర్ణయంపై ముఖ్యమంత్రి వివరిస్తారు.

దీని ద్వారా ఒక్కో అండన్వాడీ వర్కర్ రూ.1.79 లక్షల నుంచి రూ.2.32 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అంగన్వాడీ హెల్పర్లకు రూ.1.09 లక్షల నుంచి రూ.1.41 లక్షల వరకు లబ్ధి పొందుతారు. దీన్ని అమలు చేసినందుకు ప్రభుత్వంపై ఏటా రూ.17.73 కోట్ల భారం పడుతుంది.

2024 జూన్ నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన, మరణించిన ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలవుతుంది. గతేడాది జూన్ నుంచి రిటైర్డ్ అయిన వారికి గాను గ్రాట్యూటీ కింద మొత్తం రూ.1.90 కోట్లు విడుదల చేయనుంది.

పిఎం – విశ్వకర్మ పథకం ద్వారా 1000 మంది మహిళలకు రూ. 1 లక్ష వరకు రుణాలు. మహిళా సంఘాల ద్వారా అరకు కాఫీ ప్రమోషన్ కు 100 అవుట్ లెట్లు, 100 హోటళ్లు.

ఇలా మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టే పలు కార్యక్రమాలు రాష్ట్రంలోని మహిళా స్వయం సాధికారతకు ఉపకరిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అయిన మహిళా లోకం, ఆర్థికంగా శక్తిని పుంజుకుంటే, సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందనేది కూటమి ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

సినిమా

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం...

Shine Tom Chacko: డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు అరెస్ట్.. షాక్ లో ఇండస్ట్రీ

Shine Tom Chacko: మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన నటుడు ‘షైన్ టామ్ చాకో’ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన్ను ఎర్నాకుళంలో అరెస్టు చేశారు....

హిట్-3 వర్సెస్ రెట్రో.. ఎవరి సత్తా ఎంత..?

నేచురల్ స్టార్ నాని చాలా రోజుల తర్వాత మళ్లీ పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాను తీసుకెళ్తున్నారు. దసరా తర్వాత హిట్-3 కోసం దేశ వ్యాప్తంగా తన సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ...

ఇళయరాజా సంగీతానికి పాట రాయడం అదృష్టం : కీరవాణి

మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజాకు పాట రాయడం నిజంగా తన అదృష్టం అన్నారు మరో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా...

పుష్ప-2 వీఎఫ్ ఎక్స్ వీడియో.. సుకుమార్ ఇంత మోసం చేశాడా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మూవీ పుష్ప-2 చాలా పెద్ద హిట్. ఈ సినిమాలో పెద్దగా వీఎఫ్ ఎక్స్ వాడలేదు అనే చాలా మంది...